Bigg Boss Abhai Naveen Eliminated: ఎలిమినేట్ అయిన అభయ్.. కొంప ముంచిన సెల్ఫ్ నామినేషన్.. ముగ్గురికి బ్లాక్ రోజ్
Bigg Boss 8 Telugu elimination: బిగ్‍బాస్ 8లో సీజన్ మూడో వారంలో అభయ్ నవీన్ ఎలిమినేట్ అయ్యారు. సెల్ఫ్ నామినేషన్ చేసుకోవడం దెబ్బకొట్టింది. హౌస్ నుంచి బయటికి వచ్చాక ముగ్గురికి రెడ్ రోజ్ ఇచ్చి.. సూచనలు చేశారు అభయ్.
బిగ్‍బాస్ తెలుగు 8వ సీజన్‍లో మూడో వారం ఫినిష్ అయింది. నేటి ఆదివారం (సెప్టెంబర్ 22) 21వ రోజు ఎపిసోడ్‍లో ఫన్ గేమ్‍లతో పాటు ఎలిమినేషన్ ప్రక్రియ కూడా సాగింది. కంటెస్టెంట్లతో హోస్ట్ నాగార్జున సరదా గేమ్స్ ఆడించారు. డ్యాన్సులతో హౌస్‍మేట్స్ దుమ్మురేపారు. ఈ వారం సినీ నటుడు అభయ్ నవీన్ ఎలిమినేట్ అయ్యారు. హౌస్ నుంచి బయటికి వచ్చాక కొందరికి బ్లాక్ రోజెస్, మరికొందరికి రెడ్ రోజెస్ ఇచ్చారు. ఆ వివరాలు ఇవే..
సీత ఫస్ట్ సేఫ్
నామినేషన్లలో ఉన్న ఎనిమిది మందిని నిలబడాలని నాగార్జున చెప్పారు. దీంతో అభయ్ నవీన్, సీత, నైనిక, పృథ్విరాజ్, విష్ణుప్రియ, ప్రేరణ, యష్మి గౌడ, మణికంఠ నిలబడ్డారు. ఆ తర్వాత వారికి ఇసుక ఉన్న ప్లేట్‍లను ఇచ్చారు. దీంట్లో ముందు సీత సేఫ్ అయ్యారు. ఆ తర్వాత ప్రేరణ సేవ్ అయ్యారు.
డ్యాన్స్ అదరగొట్టిన ప్రేరణ, విష్ణు
ఆదివారం కావటంతో కంటెస్టెంట్‍లతో ఫన్ గేమ్స్ ఆడించారు నాగార్జున. సెట్ కట్ అంటూ గేమ్ పెట్టారు. సెట్ అయ్యే వాళ్లకు హార్ట్ సింబల్ ఇవ్వాలని, కాని వారి వద్ద హార్డ్ బ్రేక్ చేయాలని చెప్పారు. దీంతో కంటెస్టెంట్లు కారణాలు చెబుతూ ఈ గేమ్ ఆడారు. సరదాగానే సాగింది.
పజిల్ సాల్వ్ చేస్తే పాట వస్తుందని, దాన్ని చెప్పాలంటూ కంటెస్టెంట్లకు టాస్క్ ఇచ్చారు నాగార్జున. పాటలకు కంటెస్టెంట్లు డ్యాన్సులు చేశారు. ప్రేరణ ఫుల్ ఎనర్జీతో డ్యాన్స్ చేశారు. విష్ణుప్రియ కూడా డ్యాన్స్ ఇరగదీశారు. కంటెస్టెంట్ చేసే సౌండ్‍ను కళ్లకు గంతలు కట్టుకున్న హౌస్‍మేట్ బట్టి ఆ పదాన్ని గుర్తుపట్టాలని చెప్పారు. ఈ ఆట కూడా హుషారుగా జరిగింది.
అభయ్, నిఖిల్ మధ్య ఉత్కంఠ
గేమ్స్ ఆడుతున్న క్రమంలోనే ఎలిమినేషన్ ప్రక్రియ కూడా సాగింది. నైనిక, విష్ణుప్రియ, నైనిక, యష్మి గౌడ, మణికంఠ సేవ్ అయ్యారు. చివరికి అభయ్, నిఖిల్ డేంజర్ జోన్‍లో నిలిచారు. వీరి మధ్య కాసేపు టెన్షన్ నెలకొంది. చివరికి అభయ్ నామినేట్ అయ్యారు.
ప్రవర్తన చూసే ఓటు
బిగ్‍బాస్ హౌస్ నుంచి స్టేజ్ మీదికి అభయ్ వచ్చారు. టాలెంట్ ఎంత ఉన్నా ప్రేక్షకులు ప్రవర్తన చూసే ఓటు వేస్తారని అభయ్‍తో నాగార్జున అన్నారు. ఓటింగ్‍లో తక్కువ ఉన్నందుకు ఎలిమినేట్ అయ్యావని చెప్పారు. ఆ తర్వాత హౌస్‍లో అతడి జర్నీని చూపించారు. బిగ్‍బాస్‍ను అభయ్ తిట్టినది కూడా చూపించారు.
ముగ్గురికి బ్లాక్, నలుగురికి రెడ్ రోజెస్
మూడు బ్లాక్ రెజెస్, మూడు రెడ్ రెజెస్ ఎవరికి ఇస్తావని అభయ్‍ను నాగార్జున అడిగారు. విష్ణుప్రియ, మణికంఠ, పృథ్విరాజ్‍కు బ్లాక్ రోజెస్ ఇచ్చారు అభయ్. విష్ణు కొన్ని పదాలు తెలియకుండా అనేసి, ఆ తర్వాత క్షమాపణ చెబుతోందని అది మార్చుకోవాలని అభయ్ సూచించారు. దోశ విషయాన్ని మణికంఠ పెద్దదిగా చేశారని, అలాంటి విషయాల్లో జోక్యం చేసుకోవద్దని అతడికి చెప్పారు. కోపం విషయంలో పృథ్విని అందరూ వేలెత్తిచూపిస్తున్నారని, అతడు కంట్రోల్‍లో ఉండాలని అభయ్ సూచించారు.
నిఖిల్, సీత, నబీల్, సోనియాకు రెడ్ రోడెస్ ఇచ్చారు అభయ్. నిఖిల్‍కు లవ్‍యూ చెప్పారు. తాను ముందు అనుకున్న దాని కంటే నిఖిల్ చాలా వేరేగా ఉన్నాడని, తనకు చాలా దగ్గరయ్యానని అన్నారు. సీతకు ఆ తర్వాత రెడ్ రోజ్ ఇస్తానని అభయ్ చెప్పారు. అభయ్ వెళ్లటంతో సీత ఏడుస్తూనే ఉన్నారు. దీంతో బయటకలుద్దామని, వచ్చే సంవత్సరం రాఖీ కట్టించుకుంటానని సీతతో అభయ్ అన్నారు. మూడో రెడ్ రోజ్ ఇద్దరికి ఇస్తానని నాగార్జున దగ్గర అడిగి.. నబీల్, సోనియాను ఎంపిక చేసుకున్నారు అభయ్. సోనియా బాగున్న సమయాల్లో కేర్ తీసుకుంటోందని అన్నారు. నబీల్‍కు లవ్యూ చెప్పారు అభయ్. టాస్క్ సమయంలో నడుము నొస్తోందని నబీల్ చెప్పాడని, ట్రోఫీ ఎత్తేందుకు ఇబ్బంది అవుతుందని సరదాగా చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు అభయ్. ఆ తర్వాత స్టేజ్ నుంచి బయటికి వెళ్లిపోయారు.
దెబ్బకొట్టిన సెల్ఫ్ నామినేషన్
బిగ్‍బాస్ 8లో ఈ వారం నిఖిల్‍తో పాటు అభయ్ కూడా చీఫ్‍గా ఉన్నారు. అయితే, ఒకరు సెల్ఫ్ నామినేట్ చేసుకోవాలని బిగ్‍బాస్ చెప్పారు. దీంతో నిఖిల్‍ను ఆపి మరీ తను తాను నామినేట్ చేసుకున్నారు అభయ్. ఆ తర్వాత పరిస్థితులు మారిపోయాయి. టాస్కులు సరిగా ఆడకపోవటంతో పాటు బిగ్‍బాస్‍కు చాలా దూషించారు అభయ్. దీంతో ఓట్లు సరిగా పడలేదు. ఎలిమినేట్ అయ్యారు. సెల్ఫ్ నామినేషనే అతడి కొంప ముంచి.. ఎలిమినేషన్ వరకు తీసుకొచ్చింది.
బిగ్‍బాస్ తెలుగు 8లో తొలి వారం బేబక్క ఎలిమినేట్ కాగా.. ఆ తర్వాత శేఖర్ బాషా ఔట్ అయ్యారు. చాలా కాలం ఉంటాడని అంచనాలు పెట్టుకున్న అభయ్ నవీన్ ఇప్పుడు మూడో వారంలోనే ఎలిమినేట్ అయ్యారు. దీంతో హౌస్‍లో ప్రస్తుతం 11 మంది కంటెస్టెంట్లు ఉన్నారు. త్వరలోనే వైల్డ్ కార్డ్ ద్వారా కొందరు ఎంట్రీ ఇవ్వనున్నారు.