తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss: య‌ష్మిని వాడుకున్నావ్‌...నిఖిల్‌పై నోరుజారిన గౌత‌మ్ - బ్లాంక్ చెక్‌ల‌ను చింపేసిన న‌బీల్‌, ప్రేర‌ణ‌

Bigg Boss: య‌ష్మిని వాడుకున్నావ్‌...నిఖిల్‌పై నోరుజారిన గౌత‌మ్ - బ్లాంక్ చెక్‌ల‌ను చింపేసిన న‌బీల్‌, ప్రేర‌ణ‌

03 December 2024, 6:25 IST

google News
  • Bigg Boss: బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలేలోకి ఇప్ప‌టికే అవినాష్ ఎంట్రీ ఇచ్చాడు. సెకండ్ ఫైన‌లిస్ట్ కోసం బిగ్‌బాస్ టాస్క్ పెట్టాడు. ఈ టాస్క్‌లో నిఖిల్‌పై గౌత‌మ్ నోరు జారాడు. య‌ష్మిని వాడుకుంది నువ్వే అంటూ అన‌డం గొడ‌వ‌కు దారితీసింది.

బిగ్‌బాస్
బిగ్‌బాస్

బిగ్‌బాస్

Bigg Boss: బిగ్‌బాస్ టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ ఎవ‌ర‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. ఇప్ప‌టికే అవినాష్ డైరెక్ట్‌గా గ్రాండ్ ఫినాలేలోకి ఎంట్రీ ఇచ్చాడు. నామినేష‌న్స్ నుంచి సేఫ్ అయ్యాడు. ఫినాలేలోకి ఎంట్రీ ఇచ్చే సెకండ్ కంటెస్టెంట్ కోసం బిగ్‌బాస్ టాస్క్ పెట్టాడు. హౌజ్‌మేట్స్ ఫొటోల‌ను గార్డెన్ ఏరియాలో పెట్టాడు.

ఫినాలే రేసు నుంచి ఎవ‌రినైతే త‌ప్పించాల‌ని అనుకుంటున్నారో కార‌ణాలు చెబుతూ వారి ఫొటోల‌ను కాల్చేయాల‌ని బిగ్‌బాస్ టాస్క్ ఇచ్చాడు. చివ‌ర‌కు ఎవ‌రి ఫొటో అయితే మిగిలితే వారే ఫైన‌ల్ చేరుతార‌ని, నామినేష‌న్స్ నుంచి సేవ్ అవుతార‌ని కంటెస్టెంట్స్‌తో బిగ్‌బాస్ చెప్పాడు.

విష్ణు ఫొటో కాల్చేసిన అవినాష్‌...

తొలుత అవినాష్ ....విష్ణుప్రియ ఫొటో కాల్చేశాడు. బిగ్‌బాస్ నాకు సెట్ అవ్వ‌దు...ఆడ‌లేను అంటూ విష్ణుప్రియ ఎప్పుడు చెబుతుంది... ఇంటి ప‌నులు చేయ‌లేనంటూ చాలా సార్లు త‌ప్పించుకుంది... అందుకే ఆమె ఫొటో కాల్చేస్తున్నాన‌ని అవినాష్ చెప్పాడు.

రిలేష‌న్ లేదు...

ఆ త‌ర్వాత విష్ణుప్రియ‌...గౌత‌మ్ ఫొటోను కాల్చేసింది. ఎవ‌రితో క్లోజ్‌నెస్‌, రిలేష‌న్ లేదు...మీరు ఏం ఆడుతున్నార‌ని నాకైతే తెలియ‌డం లేద‌ని గౌత‌మ్‌తో అన్న‌ది. నేనేంటో నీకు అర్థం కావ‌డం లేదంటే అది నీ ఫాల్ట్ అని గౌత‌మ్ వాదించాడు.

నిఖిల్ వ‌ర్సెస్ గౌత‌మ్‌...

ఆ త‌ర్వాత గౌత‌మ్ వంతు వ‌చ్చింది. అత‌డు నిఖిల్ ఫొటోను కాల్చేయ‌డంతో ర‌చ్చ మొద‌లైంది. నేను ఫ్యాక్ట్స్ మాట్లాడిన ప్ర‌తిసారి నువ్వు పోట్రే అన్నావ‌ని నిఖిల్‌తో గౌత‌మ్ అన్నాడు.ఫ్యాక్స్ట్ కాదు పాయింట్స్ అంటూ గౌత‌మ్ కౌంట‌ర్ ఇచ్చాడు. పోట్రే అన్న ప‌దం వాడినందుకు నాకు ఫైన‌ల్ అర్హ‌త లేదా అంటూ నిఖిల్ వాదించాడు. పోట్రే అన్న‌ది చాలా పెద్ద ప‌దం...నేను నిన్ను బ్యాడ్ వేలో ప్రోట్రే చేస్తున్నాన‌ని ప్ర‌చారం చేస్తున్నావ‌ని నిఖిల్‌పై గౌత‌మ్ ఫైర్ అయ్యాడు. పోట్రే అన్నందుకే నేను ఫినాలేకు వెళ్ల‌కూడ‌దంటే నీ కంటే నాకే ఫినాలేలో అడుగుపెట్టే అర్హ‌త ఎక్కువ‌గా ఉంద‌ని నిఖిల్ బ‌దులిచ్చాడు.

య‌ష్మిని వాడుకుంది నువ్వే...

గొడ‌వ కాస్త ప‌ర్స‌న‌ల్‌లోకి వ‌చ్చింది. సింగిల్ అని చెప్పి య‌ష్మిని వాడుకున్న‌ది నువ్వు అంటూ గౌత‌మ్ నోరు జారాడు. ఎవ‌రు వాడుకుంది...నువ్వే వాడుకుంది ...తేజ‌తో స‌హా అంద‌రిని వాడుకుంది నువ్వే అంటూ నిఖిల్ బ‌దులివ్వ‌గానే గౌత‌మ్ కోపం ప‌ట్ట‌లేక‌పోయాడు.

నాకు య‌ష్మికి, నాకు ప్రేర‌ణ‌కు మ‌ధ్య‌ ఏం జ‌రిగిందో నీకు తెలియ‌దు అంటూ నిఖిల్‌తో గొడ‌వ‌ప‌డ్డాడు గౌత‌మ్‌. ప్రేర‌ణ‌ను వాడుకున్నాన‌ని అంటున్నావు...అస‌లు మా మ‌ధ్య ఏం జ‌రిగిందో నీకు తెలుసా అని గౌత‌మ్ అన్నాడు. వాడుకున్నావు అనే మాట నేను అన‌లేదు...ఆడుకున్నావు...వాడుకున్నావు...అనే ప‌దాల‌కు తేడా తెలియ‌కుండా నువ్వే మాట్లాడుతున్నావ‌ని నిఖిల్ ఆన్స‌ర్ ఇచ్చాడు. య‌ష్మిని నేను వాడుకున్న‌ది నువ్వు చూశావా అంటూ గౌత‌మ్‌ను నిల‌దీశాడు నిఖిల్‌.

బ‌రాబ‌ర్ మాట్లాడుతా...

నువ్వు అన్న‌ప్పుడు నేను బ‌రాబ‌ర్ మాట్లాడుతా అంటూ గౌత‌మ్ కోపంగా అరిచాడు. బొచ్చు కూడా పీక‌లేవు అంటూ నువ్వు హౌజ్‌లో రూడ్‌గా బిహేవ్ చేశాడు... అది త‌ప్పు కాదా నిఖిల్ అన‌గానే...త‌ప్పు ఉంటే యాక్సెప్ట్ చేస్తాన‌ని గౌత‌మ్ బ‌దులిచ్చాడు. నేను అమ్మాయిల‌తో మిస్‌బిహేవ్ చేయ‌లేదు. డిస్ రెస్పెక్ట్ చేసిన‌ట్లు ప్రూవ్ చేస్తే ఇప్పుడే హౌజ్ నుంచి బ‌య‌ట‌కు వెళ్లిపోతా అని గౌత‌మ్‌తో నిఖిల్ ఛాలెంజ్ చేశాడు.

ఆ త‌ర్వాత నిఖిల్‌ను మూస్కోని కూర్చో అని గౌత‌మ్ అవ‌మానించాడు. గౌత‌మ్ మాట‌ల‌ను మిగిలిన హౌజ్‌మేట్స్ త‌ప్పుప‌ట్ట‌డంతో అత‌డు సారీ చెప్పాడు. సారీ నాకు అవ‌స‌రం లేదు...ఇంకోసారి నోరు జారితే వేరేలా ఉంటుంద‌ని గౌత‌మ్‌కు వార్నింగ్ ఇచ్చాడు.

న‌బీల్‌, ప్రేర‌ణ బ్లాంక్ చెక్స్‌...

ఆ త‌ర్వాత నిఖిల్‌...రోహిణి ఫొటోను కాల్చేశాడు. ఆ త‌ర్వాత న‌బీల్‌, ప్రేర‌ణ ఫొటోలు మిగ‌ల‌డంతో వారిని యాక్టివిటీ ఏరియాలోకి బిగ్‌బాస్ పిలిచాడు. వారి ఎదురుగా ఉన్న బ్లాంక్ చెక్‌ల‌లో ఎవ‌రు ఎక్కువ ఎమౌంట్ రాస్తే వారే బిగ్‌బాస్ సెకండ్ ఫైన‌లిస్ట్ అవుతార‌ని బిగ్‌బాస్ అన్నాడు. ఇద్ద‌రు త‌మ‌కు న‌చ్చిన ఎమౌంట్స్ రాశారు. ఈ ఎమౌంట్ బిగ్‌బాస్ విన్న‌ర్ ప్రైజ్‌మ‌నీ నుంచి క‌ట్ అవుతుంద‌ని చెప్పి బిగ్‌బాస్ షాకిచ్చాడు.

చెక్‌ల‌ను చింపేసే ఛాన్స్ కూడా వారికి ఇచ్చాడు. డ‌బ్బు ఇచ్చి ఫైన‌ల్ టికెట్ కొనుక్కోవ‌డం అవ‌స‌ర‌మా అంటూ మిగిలిన కంటెస్టెంట్స్ ఒప్పించ‌డంతో వారున‌బీల్‌, ప్రేర‌ణ త‌మ‌ చెక్‌ల‌ను చింపేశారు. చింపేసే ముందు చెక్‌ల‌పై ఉన్న ఎమౌంట్ చూపించారు. న‌బీల్ ప‌దిహేను ల‌క్ష‌లు రాయ‌గా...ప్రేర‌ణ నాలుగు ల‌క్ష‌ల ముప్పై వేలు రాసింది. దాంతో ప్రేర‌ణ, న‌బీల్ కూడా ఈ వీక్ నామినేష‌న్స్‌లో ఉన్నారు.

తదుపరి వ్యాసం