Bigg Boss Prize Money: భారీగా పెరిగిన ప్రైజ్‌మనీ -బిగ్‌బాస్ హిస్టరీలోనే ఇదే ఫస్ట్ టైమ్ -విన్నర్‌కు దక్కేది ఎంతంటే?
15 December 2024, 11:57 IST
Bigg Boss Prize Money: బిగ్‌బాస్ 8 తెలుగు ప్రైజ్‌మనీ భారీగా పెరిగింది. బిగ్‌బాస్ హిస్టరీలోనే ఫస్ట్‌టైమ్ యాభై లక్షలు దాటింది. ప్రైజ్‌మనీని గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోలో నాగార్జున రివీల్ చేశాడు.
బిగ్‌బాస్ 8 తెలుగు ప్రైజ్‌మనీ
బిగ్‌బాస్ 8 తెలుగు గ్రాండ్ ఫినాలే నేడు (ఆదివారం ) గ్రాండ్‌గా జరుగనుంది. ఈ ఫైనల్ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను స్టార్ మా రివీల్ చేసింది. బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలేకు కన్నడ అగ్ర హీరో ఉపేంద్ర గెస్ట్‌గా వచ్చినట్లు ప్రోమోలో చూపించారు. రామ్‌చరణ్ కూడా చీఫ్ గెస్ట్‌గా ఈ గ్రాండ్ ఫినాలేకు హాజరుకానున్నట్లు ప్రచారం జరుగుతోంది. విన్నర్‌కు రామ్‌చరణ్ స్వయంగా బిగ్‌బాస్ 8 ట్రోఫీని అందించబోతున్నట్లు సమాచారం.
టాలీవుడ్ హీరోయిన్లు...
బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలేలో టాలీవుడ్ హీరోయిన్లు తమ ఆటపాటలతో సందడి చేయబోతున్నారు. ప్రోమోలో రాయలక్ష్మి, నభానటేష్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్‌ను చూపించారు. బిగ్‌బాస్ హౌజ్‌లోకి ప్రగ్యా జైస్వాల్ ఎంటర్ అయినట్లుగా కనిపించింది.
మాజీ కంటెస్టెంట్స్...
బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలేకు ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్‌తో పాటు ఫినాలే చేరిన కంటెస్టెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అటెండ్ అయ్యారు. ఫినాలేలో ఉండాలని హౌజ్‌లో ఉన్నన్నాళ్లు కోరుకున్నా...కానీ హౌజ్‌లో ఉండాలని కోరుకోలేకపోయానని రోహిణి ప్రోమోలో నవ్వులు పూయించింది. కిరాక్ సీతను ఆంటీ అని పిలిచి ఆటపట్టించారు.
ట్రోల్స్‌కు భయపడేది లేదు...
పెళ్లి కళ వచ్చేసింది అని నాగార్జున అనగానే సోనియా సిగ్గుపడిపోయింది. నేను ఏది మాట్లాడిన ట్రోల్ అవుతుందని అన్నది. . ట్రోల్స్ గురించి మనం భయపడుతామా అని నాగార్జున అనగానే...మనల్ని ఎవడ్రా ఆపేది అని సోనియా చెప్పింది
పెళ్లి సంబంధాలు చూశాం....
ఆ తర్వాత హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన నాగార్జున ఫైనల్ చేరిన గౌతమ్, నిఖిల్, ప్రేరణ, నబీల్, అవినాష్‌లను చూపించాడు. అశ్వత్థామ 2.ఓ అని గౌతమ్‌ను అతడి తండ్రి పిలిచాడు. పెళ్లి సంబంధాలు బాగా వస్తున్నాయా అని నాగార్జున అడగ్గానే అల్రెడీ రెండు, మూడు చూసి పెట్టామని గౌతమ్ తల్లి సమాధానమిచ్చింది. ఆ తర్వా తన తల్లిదండ్రులతో మాట్లాడిన నిఖిల్ ఎమోషనల్ అయ్యాడు.
బిగ్‌బాస్ ప్రైజ్‌మనీ...
బిగ్‌బాస్ ప్రైజ్‌మనీని నాగార్జున ఎంతో చెప్పాడు. 54 9999గా చెప్పాడు. ఈ ఫిగర్ నచ్చలేదనిన చెప్పి కంటెస్టెంట్స్‌తో ఫన్నీ గేమ్ ఆడించిన నాగార్జున ప్రైజ్‌మనీని యాభై ఐదు లక్షలు చేశాడు.బిగ్‌బాస్ సీజన్‌లో ఫస్ట్ టైమ్ ప్రైజ్‌మనీ 50 లక్షలు దాటిందని నాగార్జున అన్నాడు. ఈ సారి విన్నర్‌కు ఈ మొత్తం దక్కనున్నట్లు సమాచారం. ప్రైజ్‌మనీతో పాటు ఓ కారును బహుమతిగా ఇవ్వనున్నారు.
గౌతమ్ విన్నర్...
టాప్ ఫైవ్‌లో విన్నర్ ఎవరైతే బాగుంటుందని ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్‌ను అడిగాడు నాగార్జున. ఒక్కొక్కరు నయని పావని నిఖిల్ పేరు చెప్పింది. మణికంఠ...గౌతమ్ విన్నర్ అవుతాడని అన్నాడు. కిరాక్ సీత నబీల్ పేరు చెప్పగా...అభయ్ నవీన్ ప్రేరణ పేరు చెప్పాడు.
అవినాష్ ఇమిటేట్...
ప్రేరణ విన్నర్ అయితే..విన్నింగ్ స్పీచ్ ఎలా ఇస్తుందో అవినాష్ ఇమిటేట్ చేసి చూపించాడు. ఆ తర్వాత నాగమణికంఠను ఇమిటేట్ చేసి నవ్వించాడు. నిఖిల్‌ను నబీల్ ఇమిటేట్ చేశాడు. ప్రోమో చివరలో ఉపేంద్ర ఎంట్రీ ఇవ్వడం ఆకట్టుకుంటోంది.
బిగ్‌బాస్ ట్రోఫీ...
బిగ్‌బాస్ ట్రోఫీని నాగార్జున చూపించాడు. ఈ సారి విన్నర్‌ను డిఫరెంట్‌గా అనౌన్స్‌చేసినట్లుగా ప్రోమో చివరలో చూపించారు. ఆట చివరికి వచ్చిందంటే గెలుపు ఎవరిదో చెప్పాలిగా అని నాగార్జున అనగానే ఐదుగురు ఫైనలిస్ట్‌లు ఓ రూమ్‌లోకి వెళ్లారు. కొందరు కమాండోలో ఆ రూమ్‌లోకి ఎంటర్ అయ్యి ఐదుగురిపై గన్స్ గురిపెట్టడంతో ప్రోమో ఎండ్ అయ్యింది.
టాపిక్