Pragya Jaiswal: ప్రగ్యా జైస్వాల్ బాలీవుడ్ మూవీకి షాకింగ్ కలెక్షన్స్ - వంద కోట్లతో తీస్తే వచ్చింది ఎంతంటే?
Pragya Jaiswal: దాదాపు పదేళ్ల గ్యాప్ తర్వాత ఖేల్ ఖేల్ మే సినిమాతో బాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇచ్చింది ప్రగ్యా జైస్వాల్. అక్షయ్ కుమార్, తాప్సీ వంటి స్టార్స్ నటించిన ఈ బడ్జెట్ మూవీతో బాలీవుడ్‌లో పాగా వేయాలని ప్రగ్యా జైస్వాల్ కలలు కన్నది. కానీ ఈ బ్యూటీ ఆశ తీరలేదు.
(1 / 5)
కామెడీ డ్రామా కథాంశంతో తెరకెక్కిన ఖేల్ ఖేల్ మే బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. కామెడీ సినిమానే అయినా ఇందులో కామెడీ మాత్రం లేదంటూ ఆడియెన్స్ విమర్శలు గుప్పిస్తోన్నారు.
(2 / 5)
ప్రగ్యా జైస్వాల్ బాలీవుడ్ మూవీ నాలుగు రోజుల్లో కేవలం 13 కోట్ల వసూళ్లను మాత్రమే రాబట్టింది. దాదాపు వంద కోట్ల బడ్జెట్‌తో ఖేల్ ఖేల్ మే మూవీ తెరకెక్కడం గమనార్హం.
(3 / 5)
ఖేల్ ఖేల్ మే సినిమాలో నైనా అనే మోడ్రన్ గర్ల్‌గా ప్రగ్యా జైస్వాల్ కనిపించింది. సరదాగా ఆడిన ఓ గేమ్ నాలుగు జంటల జీవితాల్ని ఎలాంటి మలుపు తిప్పిందన్నదే ఈ మూవీ కథ.
(4 / 5)
అఖండ తర్వాత మరోసారి బాలకృష్ణతో ప్రగ్యా జైస్వాల్ రొమాన్స్ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తోన్నాయి.
ఇతర గ్యాలరీలు