తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Balakrishna Mahesh Babu: అంతటి విషాదంలోనూ మహేష్‌ బాబును నవ్వించిన బాలయ్య

Balakrishna Mahesh Babu: అంతటి విషాదంలోనూ మహేష్‌ బాబును నవ్వించిన బాలయ్య

HT Telugu Desk HT Telugu

16 November 2022, 15:32 IST

google News
    • Balakrishna Mahesh Babu: సూపర్‌ స్టార్‌ కృష్ణ మరణంతో అతని కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ముఖ్యంగా మహేష్‌ బాబు వరుసగా తన కుటుంబ సభ్యులను కోల్పోతూ తీవ్ర మనో వేధనలో ఉన్నాడు. అయితే అంతటి విషాదంలోనూ బాలయ్య అతన్ని నవ్వించిన తీరు అక్కడున్న వారిని ఆకర్షించింది.
బాలకృష్ణ, మహేష్ బాబు, గౌతమ్, గల్లా జయదేవ్
బాలకృష్ణ, మహేష్ బాబు, గౌతమ్, గల్లా జయదేవ్

బాలకృష్ణ, మహేష్ బాబు, గౌతమ్, గల్లా జయదేవ్

Balakrishna Mahesh Babu: టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేష్ బాబుకు 2022 చేదు అనుభవాన్నే మిగిల్చింది. ఈ ఏడాది మొదట్లోనే తన అన్న రమేష్‌ బాబును అతడు కోల్పోయాడు. ఆ తర్వాత ఈ మధ్యే తల్లి ఇందిరా దేవి కూడా కన్నుమూశారు. ఇక ఇప్పుడు తండ్రి కృష్ణ కూడా తుది శ్వాస విడవడంతో ఒంటరి అయిపోయిన బాధలో ఉన్నాడు.

మూడు రోజులుగా మహేష్‌ తీవ్ర దుఃఖంలో మునిగిపోయాడు. ఇంటికి వచ్చీపోయేవాళ్లు అతన్ని పరామర్శిస్తున్న సమయంలోనూ అతడు ముభావంగా కనిపించాడు. అయితే బుధవారం (నవంబర్‌ 16) కృష్ణకు నివాళులు అర్పించడానికి వచ్చిన బాలకృష్ణ మాత్రం కాస్త మహేష్‌ మూడ్‌ను మార్చే ప్రయత్నం చేశాడు. తన భార్య వసుంధర, కూతురు బ్రాహ్మణిలతో కలిసి బాలయ్య పద్మాలయా స్టూడియోస్‌కు వచ్చాడు.

ఈ సందర్భంగా చాలాసేపు అతడు మహేష్‌బాబుతోపాటు అతని కొడుకు గౌతమ్‌, కృష్ణ అల్లుడు గల్లా జయదేవ్‌లతో మాట్లాడుతూ కనిపించాడు. ఈ సందర్భంగానే మహేష్‌ను నవ్వించే ప్రయత్నం చేశాడు బాలకృష్ణ. నటనలో ఆరితేరిపోయినా, ఇప్పటికీ వయసు మీద పడినా.. తనలోని చిన్నపిల్లాడిని అప్పుడప్పుడూ బాలయ్య తట్టి లేపుతూ ఉంటాడు.

తన మాటలతో ఎదుటివారిని నవ్విస్తూ ఉంటాడు. మహేష్‌తో కూడా బాలయ్య అలాగే ఉన్నాడు. అతడు పూర్తిగా విషాదంలో మునిగిపోకుండా కాస్త నవ్వించి మూడ్‌ మార్చే ప్రయత్నం చేశాడు. మహేష్‌తోపాటు గౌతమ్‌ కూడా కాసేపు హాయిగా నవ్వుకున్నారు. ఇది అక్కడున్న వారి దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడీ ఫొటోలు, వీడియో వైరల్‌గా మారాయి. మంగళవారం నుంచి ఎంతో మంది సినీ, రాజకీయ ప్రముఖులు వచ్చిన కృష్ణకు నివాళులర్పించిన విషయం తెలిసిందే.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, గవర్నర్‌ తమిళిసై, ఏపీ సీఎం జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు, చిరంజీవి, వెంకటేశ్, అల్లు అర్జున్‌, పవన్‌ కల్యాణ్‌, ప్రభాస్‌లాంటి రాజకీయ, సినీ ప్రముఖులు కృష్ణ పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. తర్వాత అతని కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం నూరిపోసే ప్రయత్నం చేశారు.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం