తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Unstoppable 2 Second Episode: భీమ్లా నాయక్ సినిమాలో మొదట హీరోగా బాలయ్య? మరి పవర్ స్టార్ ఎందుకు చేశారు?

Unstoppable 2 Second Episode: భీమ్లా నాయక్ సినిమాలో మొదట హీరోగా బాలయ్య? మరి పవర్ స్టార్ ఎందుకు చేశారు?

21 October 2022, 17:51 IST

google News
    • Unstoppable 2 Second Episode: అన్‌స్టాపబుల్2 రెండో ఎపిసోడ్‌కు విశ్వక్ సేన్, సిద్ధు జొన్నలగడ్డ హాజరయ్యారు. వీరితో పాటు నిర్మాత సూర్యదేవర నాగవంశీ కూడా విచ్చేశారు. ఈ సందర్భంగా భీమ్లా నాయక్ సినిమా గురించి బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
భీమ్లా నాయక్ సినిమాలో ముందు హీరో బాలకృష్ణ
భీమ్లా నాయక్ సినిమాలో ముందు హీరో బాలకృష్ణ

భీమ్లా నాయక్ సినిమాలో ముందు హీరో బాలకృష్ణ

Unstoppable 2 Second Episode: నందమూరి నటసింహం బాలకృష్ణ గతేడాది అఖండ సినిమాతో అద్భుత విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా ఆహా వేదికగా ప్రసారమైన అన్‌స్టాపబుల్ షోకు వ్యాఖ్యతగా వ్యవహరించి తన క్రేజ్ అమాంతం పెంచేసుకున్నారు. ప్రస్తుతం అన్‌స్టాపబుల్ రెండో సీజన్ నడుస్తోంది. ఈ సందర్భంగా గత వారం జరిగిన మొదటి ఎపిసోడ్‌లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుతో ఘనంగా ప్రారంభించారు బాలయ్య. తనదైన శైలి వినోదంతో పాటు ఫన్నీ గేమ్స్, సీరియస్ క్వశ్చన్స్ ఒక్కటేమిటి అదిరిపోయే రీతిలో బావను ఆటపట్టించారు. అంతటితో ఆగకుండా అల్లుడు నారా లోకేష్‌తోనూ ముచ్చటించి నవ్వులు పూయించారు. తాజాగా రెండో ఎపిసోడ్‌ ఆహా వేదికగా ప్రసామైంది.

ఈ రెండో ఎపిసోడ్‌కు టాలీవుడ్ యంగ్ హీరోలు విశ్వక్ సేన్, డీజే టిల్లు సందడి చేశారు. బాలయ్య ఇద్దరికీ సాదర స్వాగతం పలికి వేదికపైకి తీసుకొచ్చారు. అంతటితో ఆగకుండా వారిపై జోకులు పేల్చడమే కాకుండా తనదైన ఛమత్కారాలతో ఆకట్టుకున్నారు. ఇద్దరితోనూ ఫన్నీ యాక్టివిటీస్, గేమ్స్, సరదా ప్రశ్నలను అడుగుతూ ఎపిసోడ్ ఆద్యంతం రక్తికట్టించారు. ఈ ఎపిసోడ్‌లో నిర్మాత సూర్యదేవర నాగవంశీ కూడా విచ్చేశారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

ఈ క్రమంలో పవర్ స్టార్ పవన్‌కల్యణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమాలో మొదట హీరో ఎవరు అని అడుగ్గా.. మీరే సర్ అంటూ నాగవంశీ సమాధానమిచ్చారు. మీ చుట్టూ తిరిగి.. మిమ్మల్ని అడిగాం సర్. అయితే సినిమా చూసి మీరే కదా సర్ పవన్ కల్యాణ్‌ గారికి అయితే బాగుంటుందని సజిస్ట్ చేశారు. అంటూ నాగవంశీ తెలిపారు. దీన్ని బట్టి చూస్తే భీమ్లా నాయక్ కథ ముందుగా బాలకృష్ణ వద్దకు వచ్చిందని, అయితే ఆ క్యారెక్టర్‌ తనకంటే పవన్ కల్యాణ్‌కు సూటవుతుందని బాలయ్య చెప్పారని అర్థమవుతుంది. ప్రస్తుతం ఈ వీడియోకు సంబంధించిన క్లిప్పులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నెటిజన్లు కూడా విశేషంగా స్పందిస్తున్నారు.

మరోపక్క బాలకృష్ణ.. గోపిచంద్ మలినేనితో ఓ సినిమా చేస్తున్నారు. NBK 107 వర్కింగ్ టైటిల్‌లో రూపొందుతున్న ఈ సినిమా ఈ ఏడాదే విడుదలయ్యే అవకాశముంది. ఈ సినిమాలో శృతిహాసన్ కథానాయికగా చేస్తోంది. వరలక్ష్మీ శరత్ కుమార్, దునియా విజయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. సాయి మాధవన్ బుర్రా సంభాషణలు రాశారు.

తదుపరి వ్యాసం