Unstoppable with NBK2: అన్‌స్టాపబుల్ 2 ట్రైలర్‌కు ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడొస్తుందంటే?-balakrishna unstoppable season 2 trailer will release on 2022 october 9th ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Unstoppable With Nbk2: అన్‌స్టాపబుల్ 2 ట్రైలర్‌కు ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడొస్తుందంటే?

Unstoppable with NBK2: అన్‌స్టాపబుల్ 2 ట్రైలర్‌కు ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడొస్తుందంటే?

Maragani Govardhan HT Telugu
Oct 08, 2022 10:27 PM IST

Unstoppable 2 Trailer: నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరించిన అన్‌స్టాపబుల్ షో ఎంత పెద్ద హిట్టయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా మరోసారి సీజన్ ప్రారంభం కాబోతుంది. ఈ మేరకు అక్టోబరు 9న ఈ సీజన్ 2 ట్రైలర్ విడుదల చేయనున్నారు.

<p>అన్‌స్టాపబుల్ 2 ట్రైలర్ వచ్చేస్తుంది.&nbsp;</p>
అన్‌స్టాపబుల్ 2 ట్రైలర్ వచ్చేస్తుంది. (Twitter)

Unstoppable with NBK2: అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే అంటూ ఆహా ద్వారా ఓటీటీ ఎంట్రీ ఇచ్చారు నటసింహం నందమూరి బాలకృష్ణ. సీజన్ 2 కోసం ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎందురుచూస్తున్నారు. 100 % లోకల్ ఎంటర్టైన్మెంట్ తో దూసుకుపోతోన్న ఆహా సంస్థ ఈసారి కూడా ఎవరూ చూడని విధంగా బాలయ్య బాబును అభిమానులకి చూపించబోతుంది. ఐఎండీబీలో నెంబర్ వన్ పొజిషన్‌లో బెట్టారు బాలకృష్ణ. మొదటి సీజన్ ను ఘనవిజయంగా పూర్తి చేసిన ఆహా. ఇప్పుడు సీజన్ 2 తో రావడానికి రెడీ అవుతోంది.

జాంబీ రెడ్డి, మరియు కల్కి లాంటి చిత్రాలతో తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకున్న ప్రశాంత్ వర్మ 2011 లో దీనమ్మ జీవితం అనే షార్ట్ ఫిలింతో ఆయన ప్రయాణం మొదలుపెట్టారు. అలా మొదలుబెట్టిన ప్రయాణం అన్ స్టాపబుల్ సీజన్‌ 1 వరకు సాగింది. నందమూరి బాలకృష్ణను ఇలా కూడా చూడగలమా అనేంత గొప్పగా గత సీజన్‌లో చూపించారు. ఇప్పుడు మరోసారి ఎవరూ ఊహించని విధంగా నందమూరి బాలకృష్ణ ను చూపించబోతున్నారు ప్రశాంత్ వర్మ. ఆహా వారు ట్రైలర్ ని అక్టోబర్ 09న విడుదల చేయనున్నారు.

"ఆదివారం పూట మొదటి ఆట అన్‌స్టాపబుల్ ట్రైలర్ కావాలి. లేటయింది కానీ బొమ్మ అదిరిపోతుంది" అంటూ ఆహా సంస్థ తన ట్విటర్ వేదికగా స్పందించింది.

గత సీజన్‌లో మోహన్ బాబు, నాని, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్, రవితేజ, గోపిచంద్ మలినేని, మహేశ్ బాబు తదితరులు ఈ షోకు హాజరయ్యారు. ఈ సీజన్‌కు టాలీవుడ్ స్టార్ హీరోల్లో చాలా మంది రాబోతున్నట్లు సమాచారం. పవర్ స్టార్ పవన్‌కల్యాణ్, మెగాస్టార్ చిరంజీవి, త్రివిక్రమ్ శ్రీనివాస్, అనుష్క శెట్టి లాంటి వాళ్లు ఇందులో భాగం కాబోతున్నారని తెలుస్తోంది. అన్‌స్టాపబుల్ షోకు డైరెక్టర్ క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. గతేడాది దీపావళి సందర్భంగా లాంచ్ అయిన ఈ షో.. 2022 ఫిబ్రవరి 2 వరకు నడిచింది

మరోపక్క బాలకృష్ణ.. గోపిచంద్ మలినేనితో ఓ సినిమా చేస్తున్నారు. NBK 107 వర్కింగ్ టైటిల్‌లో రూపొందుతున్న ఈ సినిమా ఈ ఏడాదే విడుదలయ్యే అవకాశముంది. ఈ సినిమాలో శృతిహాసన్ కథానాయికగా చేస్తోంది. వరలక్ష్మీ శరత్ కుమార్, దునియా విజయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. సాయి మాధవన్ బుర్రా సంభాషణలు రాశారు.

Whats_app_banner

సంబంధిత కథనం