Balakrishna: జవాన్ దర్శకుడితో బాలకృష్ణ సినిమా…ఎన్‌బీకే 109 ఫిక్స్ అయ్యిందా...-jawan director to team up with balakrishna ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Jawan Director To Team Up With Balakrishna

Balakrishna: జవాన్ దర్శకుడితో బాలకృష్ణ సినిమా…ఎన్‌బీకే 109 ఫిక్స్ అయ్యిందా...

HT Telugu Desk HT Telugu
Jun 21, 2022 01:26 PM IST

అఖండ స‌క్సెస్ త‌ర్వాత గ్యాప్ లేకుండా వ‌రుస‌గా సినిమాల్ని అంగీక‌రిస్తున్నారు బాల‌కృష్ణ‌. ప్ర‌స్తుతం ఆయ‌న గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్నారు. తాజాగా బాల‌కృష్ణ మ‌రో సినిమాకు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు తెలిసింది. ఈ సినిమాకు ద‌ర్శ‌కుడు ఎవ‌రంటే...

బాల‌కృష్ణ
బాల‌కృష్ణ (twitter)

గ‌త ఏడాది విడుద‌లైన అఖండ చిత్రం బాల‌కృష్ణ కెరీర్‌లో అతిపెద్ద విజ‌యాల్లో ఒక‌టిగా నిలిచింది. బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ సినిమా వంద కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. క‌రోనా కార‌ణంగా న‌ష్టాల బారిన ప‌డిన సినీ ప‌రిశ్ర‌మ‌లో ఈ విజ‌యం ఉత్సాహాన్ని నింపింది. ఈ స‌క్సెస్ త‌ర్వాత గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో బాల‌కృష్ణ ఓ సినిమా చేస్తున్నారు. రియ‌లిస్టిక్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ సినిమా చిత్రీక‌ర‌ణ ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది.

 గోపీచంద్ మ‌లినేని సినిమా పూర్త‌యిన వెంట‌నే అనిల్ రావిపూడి ప్రాజెక్ట్ మొద‌లుపెట్ట‌బోతున్నారు. వ‌రుస లైన‌ప్‌ల‌తో బాల‌కృష్ణ బిజీగా ఉన్నారు. తాజాగా ఆయ‌న మ‌రో సినిమాను అంగీక‌రించిన‌ట్లు స‌మాచారం. ఖ‌డ్గం, కింగ్‌, ప‌రుగు, అతిథితో పాటు తెలుగులో ప‌లు విజ‌య‌వంత‌మైన చిత్రాల‌కు ర‌చ‌యితగా ప‌నిచేశారు బీవీఎస్ ర‌వి. గోపీచంద్ హీరోగా రూపొందిన వాటెండ్ సినిమాతో ద‌ర్శ‌కుడిగా మారారు. 

సాయిధ‌ర‌మ్‌తేజ్ తో జ‌వాన్ అనే సినిమాను తెర‌కెక్కించాడు. ద‌ర్శ‌కుడిగా బీవీఎస్ ర‌వి త‌న మూడో సినిమాను బాల‌కృష్ణ‌తో చేయ‌బోతున్న‌ట్లు తెలిసింది. బాల‌కృష్ణ హోస్ట్ గా వ్య‌వ‌హ‌రించిన అన్‌స్టాప‌బుల్ టాక్ షో విజ‌య‌వంత‌మైంది. ఈ టాక్ షోకు బీవీఎస్ ర‌వి స్క్రీన్‌ప్లే రైట‌ర్ గా వ్య‌వ‌హ‌రించాడు. టాక్ షో ఫ‌స్ట్ సీజ‌న్ షూటింగ్ స‌మ‌యంలో బాల‌కృష్ణ‌కు అత‌డు ఓ క‌థ‌ను వినిపించిన‌ట్లు చెబుతున్నారు. బీవీఎస్ ర‌వి చెప్పిన క‌థ బాల‌కృష్ణ‌కు న‌చ్చిన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. టాక్ షో స‌క్సెస్‌ను దృష్టిలో పెట్టుకొని అత‌డితో సినిమా చేయ‌డానికి బాల‌కృష్ణ అంగీక‌రించిన‌ట్లు చెబుతున్నారు. బాలకృష్ణ హీరోగా నటించనున్న 109వ సినిమా ఇది. 

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్