Baby OTT Release Date: గుడ్‌న్యూస్ చెప్పిన ఆహా.. బేబీ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే
18 August 2023, 10:33 IST
- Baby OTT Release Date: గుడ్‌న్యూస్ చెప్పింది ఆహా ఓటీటీ. బేబీ ఓటీటీ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసింది. శుక్రవారం (ఆగస్ట్ 18) తమ ట్విటర్ అకౌంట్ ద్వారా ఆహా ఈ అనౌన్స్‌మెంట్ చేసింది.
ఆహాలో స్ట్రీమ్ అవనున్న బేబీ మూవీ
Baby OTT Release Date: ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అప్‌డేట్ ఇచ్చింది ఆహా ఓటీటీ. గత నెలలో రిలీజై ఓ కల్ట్ క్లాసిక్ గా నిలిచిపోయిన బేబీ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది. ఈ మూవీని ఆగస్ట్ 25 నుంచి స్ట్రీమ్ చేయనున్నట్లు వెల్లడించింది. శుక్రవారం (ఆగస్ట్ 18) తమ ట్విటర్ అకౌంట్ ద్వారా ఆహా ఓటీటీ ఈ విషయం చెప్పింది.
"మరోసారి కల్ట్ లవ్ స్టోరీ ఆఫ్ ద డెకేడ్ చూడటానికి సిద్ధంగా ఉండండి. బేబీ మూవీ మిమ్మల్ని ప్రేమలో పడేలా చేస్తుంది. కోపం తెప్పిస్తుంది. కన్నీళ్లు పెట్టిస్తుంది. ఈ సినిమా ఆగస్ట్ 25న స్ట్రీమ్ అవుతుంది. అంత వరకూ ఆగలేకపోతే వెంటనే ఆహా గోల్డ్ సబ్‌స్క్రైబ్ చేసుకోండి. 12 గంటల ముందే ఈ సినిమా చూసేయండి" అని ఆహా ట్వీట్ చేయడం విశేషం. ఆహా గోల్డ్ సబ్‌స్క్రిప్షన్ కోసం ఏడాదికి రూ.899 చెల్లించాల్సి ఉంటుంది.
బేబీ మూవీ ఓటీటీ రిలీజ్ తేదీపై శుక్రవారం అప్‌డేట్ ఇవ్వనున్నట్లు ఒక రోజు ముందే ఆహా చెప్పింది. అందుకు తగినట్లే కాసేపటి కిందటే ఓటీటీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి అభిమానులను ఆనందానికి గురి చేసింది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి, విరాజ్ అశ్విన్ నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర దుమ్ము రేపిన విషయం తెలిసిందే. తొలి రోజు తొలి షో నుంచే ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూలు వచ్చాయి.
బేబీ స్టోరీ ఇదీ..
మూడు పాత్రల నేపథ్యంలో ఈ ట్రయాంగిల్ లవ్‌స్టోరీని యూత్ ఆడియెన్స్ కనెక్ట్ అయ్యేలా అందంగా స్క్రీన్‌పై ప్రజెంట్ చేశారు డైరెక్టర్. ముక్కోణపు ప్రేమకథలు టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్స్‌పై చాలా వచ్చాయి. వాటికి భిన్నంగా నేటి ప్రేమాయణాలు ఎలా ఉంటున్నాయన్నది క్రిస్టల్ క్లియర్‌గా ఈ సినిమాలో చూపించేందుకు దర్శకుడు ప్రయత్నించారు. విఫల ప్రేమికుడిగా ఆనంద్ దేవరకొండ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఈ కథ మొదలవుతుంది. స్కూల్‌డేస్‌లోని లవ్ స్టోరీని చాలా నోస్టల్జిక్‌గా చూపించారు డైరెక్టర్. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ డైలాగ్స్‌తో ఈ లవ్ సీన్స్‌పై ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు.
ఈ సినిమాలో యాక్టింగ్ విషయంలో హీరోలు ఇద్దరి కంటే హీరోయిన్ వైష్ణవి చైతన్యకే ఎక్కువగా మార్కులు పడతాయి. తొలి సినిమాతోనే మల్టీపుల్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌లో అదరగొట్టింది. అమాయకత్వం, కాస్త కన్నింగ్‌నెస్ ఉన్న పాత్రలో వేరియేషన్ చూపించిన విధానం బాగుంది. ఆటోడ్రైవర్‌గా ఆనంద్‌దేవరకొండ మెచ్యూర్డ్ యాక్టింగ్‌ను కనబరిచాడు. ఎమోషనల్ సీన్స్‌లో మెప్పించాడు. ఇంజినీరింగ్ స్టూడెంట్‌గా స్టైలిష్ రోల్‌కు విరాజ్ న్యాయం చేశాడు.