Family Dhamaka in Aha OTT: ఆహా ఓటీటీలో మరో రియాల్టీ షో.. విశ్వక్‌సేన్ హోస్ట్ చేస్తున్న ఫ్యామిలీ ధమాకా-family dhamaka in aha ott vishwak sen to host the show ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Family Dhamaka In Aha Ott: ఆహా ఓటీటీలో మరో రియాల్టీ షో.. విశ్వక్‌సేన్ హోస్ట్ చేస్తున్న ఫ్యామిలీ ధమాకా

Family Dhamaka in Aha OTT: ఆహా ఓటీటీలో మరో రియాల్టీ షో.. విశ్వక్‌సేన్ హోస్ట్ చేస్తున్న ఫ్యామిలీ ధమాకా

Hari Prasad S HT Telugu
Aug 16, 2023 03:15 PM IST

Family Dhamaka in Aha OTT: ఆహా ఓటీటీలో మరో రియాల్టీ షో రాబోతోంది. టాలీవుడ్ హీరో విశ్వక్‌సేన్ హోస్ట్ చేస్తున్న ఫ్యామిలీ ధమాకా షో త్వరలోనే ప్రారంభం కానుంది.

ఆహాలో రానున్న విశ్వక్‌సేన్ ఫ్యామిలీ ధమాకా
ఆహాలో రానున్న విశ్వక్‌సేన్ ఫ్యామిలీ ధమాకా

Family Dhamaka in Aha OTT: పక్కా లోకల్ ఓటీటీ అయిన ఆహాలో మరో రియాల్టీ షో రానుంది. ఇప్పటికే అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే, తెలుగు ఇండియన్ ఐడల్ లాంటి ప్రోగ్రామ్స్ తో దుమ్ము రేపుతున్న ఈ ఓటీటీ.. ఇప్పుడు ఫ్యామిలీ ధమాకా (Family Dhamaka) అనే మరో షోకు తెరలేపబోతోంది. ఈ షోను టాలీవుడ్ హీరో విశ్వక్‌సేన్ హోస్ట్ చేయనుండటం విశేషం.

ఈ ఫ్యామిలీ ధమాకా రియాల్టీ షో అనౌన్స్‌మెంట్ ను బుధవారం (ఆగస్ట్ 16) ఓ ఫొటో ద్వారా ఆహా చేసింది. ఇది దాస్ ఆడించే ఫ్యామిలీ ఆట అంటూ విశ్వక్‌సేన్ చేతిలో ఓ పెద్ద బాంబు పట్టుకున్న ఫొటోను ఆహా షేర్ చేసింది. త్వరలోనే ఈ షో ప్రారంభం కానున్నట్లు ఈ ఓటీటీ వెల్లడించింది. ఈ షోతోనే హీరో విశ్వక్‌సేన్ డిజిటల్ ప్లాట్‌ఫామ్ లోకి అడుగుపెడుతున్నాడు.

వరుస షోలు, వెబ్ సిరీస్ లతో ఆహా ఓటీటీ దూసుకెళ్తోంది. ఎక్స్‌క్లూజివ్ గా తెలుగు కంటెంట్ అందిస్తూ ప్రేక్షకులకు దగ్గరవుతోంది. నేను సూపర్ వుమన్ అనే షో కూడా ప్రస్తుతం ఆహాలో సక్సెస్ సాధించింది. ఇక ఇప్పుడు ఈ ఫ్యామిలీ ధమాకాతో మరో లెవల్ ఎంటర్‌టైన్మెంట్ అందించడానికి సిద్ధమవుతోంది. ఎంటర్‌టైన్మెంట్ తోపాటు అన్ని భావోద్వేగాలు, ఉత్సాహాన్ని ఈ షో అందించబోతున్నట్లు ఆహా చెబుతోంది.

ఈ షోకు విశ్వక్‌సేన్ హోస్ట్ గా ఉండటం అదనపు బలమని కూడా ఈ సందర్భంగా ఆ ఓటీటీ స్పష్టం చేసింది. ఈ షో ఎప్పటి నుంచి ప్రారంభం కానున్నది మాత్రం ఆహా వెల్లడించలేదు. మరోవైపు విశ్వక్‌సేన్ ఇటు టాలీవుడ్ లోనూ వరుస సినిమాలు చేస్తున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే దాస్ కా ధమ్కీ, బూ సినిమాలతో వచ్చిన విశ్వక్.. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, గామితోపాటు మరో మూవీ చేస్తున్నాడు.