తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Avatar 3 Release Date: అవతార్ 3 రిలీజ్ మరింత ఆలస్యం.. ఎప్పుడు రానుందంటే?

Avatar 3 Release Date: అవతార్ 3 రిలీజ్ మరింత ఆలస్యం.. ఎప్పుడు రానుందంటే?

Hari Prasad S HT Telugu

14 June 2023, 8:09 IST

    • Avatar 3 Release Date: అవతార్ 3 రిలీజ్ మరింత ఆలస్యం కానుంది. అవతార్ ది వే ఆఫ్ వాటర్ ఈ మధ్యే ఓటీటీలోకి వచ్చిన సందర్భంగా ఈ ఫ్రాంఛైజీ నుంచి రాబోయే మూడో పార్ట్ పై ఆసక్తికరమైన అప్‌డేట్ వచ్చింది.
అవతార్ ది వే ఆఫ్ వాటర్ మూవీలో ఒక సీన్
అవతార్ ది వే ఆఫ్ వాటర్ మూవీలో ఒక సీన్

అవతార్ ది వే ఆఫ్ వాటర్ మూవీలో ఒక సీన్

Avatar 3 Release Date: ప్రపంచ సినిమా చరిత్రలోనే అతిపెద్ద మూవీ ఫ్రాంఛైజీ అవతార్. అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 3 సినిమాల్లో రెండు ఈ ఫ్రాంఛైజీకి చెందినవే. ఇప్పటికే రెండు సినిమాలు రాగా.. మరో మూడు రానున్నాయి. అయితే తాజాగా వస్తున్న వార్తల ప్రకారం.. అవతార్ 3 రిలీజ్ తేదీ వాయిదా పడింది. అనుకున్న సమయాని కంటే ఏడాది ఆలస్యం కానుంది.

ట్రెండింగ్ వార్తలు

Nagababu Twitter: ట్విట్టర్‌లోకి నాగబాబు రీఎంట్రీ .. ఆ వివాదాస్పద ట్వీట్ డిలీట్

PM Narendra Modi Biopic: ప్రధాని నరేంద్ర మోదీ పాత్రలో కట్టప్ప!: వివరాలివే

TV Serial Actor Chandu: ఆమె వల్లే మేం విడిపోయాం.. ఆత్మహత్య చేసుకుంటాడనుకోలేదు: సీరియల్ నటుడు చందూ భార్య

OTT Movie: చైన్ బిజినెస్ మోసాలు.. ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసిన ఫ్యామిలీ ఎమోషన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

జేమ్స్ కామెరాన్ డైరెక్ట్ చేసిన ఈ అవతార్ 2009లో రిలీజ్ కాగా.. అవతార్ 2 లేదా అవతార్ ది వే ఆఫ్ వాటర్ 2022లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అప్పుడే మిగతా మూడు సినిమాల రిలీజ్ తేదీలను కూడా మేకర్స్ అనౌన్స్ చేశారు. అయితే తాజాగా అవతార్ 3 రిలీజ్ తేదీ వాయిదా పడినట్లు వెరైటీ మ్యాగజైన్ వెల్లడించింది. డిస్నీలో భారీ మార్పులు చోటు చేసుకుంటుండటంతో ఆ నిర్మాణ సంస్థ నుంచి వచ్చే సినిమాలు ఆలస్యమవుతున్నాయి.

అందులో భాగంగానే అవతార్ 3 కూడా ఏడాది ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. "అవతార్ 3 డిసెంబర్ 19, 2025లో రిలీజ్ కానుంది. ఇక అవతార్ 4 డిసెంబర్ 21, 2029.. అవతార్ 5 డిసెంబర్ 19, 2031కి రిలీజ్ అవుతాయి. ఇలా చూస్తే అవతార్ ఫ్రాంఛైజీలో చివరి సినిమా మొదటి సినిమా తర్వాత 22 ఏళ్లకు రిలీజ్ కాబోతోంది. 2009లో అవతార్ వచ్చిన విషయం తెలిసిందే" అంటూ వెరైటీ మ్యాగజైన్ కథనం ప్రచురించింది.

డిస్నీ రూపొందిస్తున్న అన్ని సినిమాలపై ప్రభావం పడుతోంది. రైటర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా స్ట్రైక్, ప్రొడక్షన్ ఆలస్యం కావడం ఈ సినిమాల రిలీజ్ వాయిదాలకు కారణమవుతున్నట్లు వెరైటీ వెల్లడించింది. ఇక అవతార్ ఫ్రాంఛైజీ విషయానికి వస్తే ఆ సినిమా పోస్ట్ ప్రొడక్షన్, విజువల్ ఎఫెక్ట్స్ విభాగాలను మరింత విస్తరించనున్నారు. ఇది కూడా అవతార్ సినిమాల రిలీజ్ పై ప్రభావం చూపుతున్నాయి.

2009లో వచ్చిన అవతార్ మూవీ ఇప్పటికీ ప్రపంచంలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డు క్రియేట్ చేయగా.. గతేడాది రిలీజైన అవతార్ ది వే ఆఫ్ వాటర్ మూడో స్థానంలో నిలిచింది.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం