తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Avatar 2 Shooting: అవతార్ 2లో నీటి కింద షూటింగ్ ఎలా చేశారు.. జేమ్స్ కామెరాన్ ఏం చెప్పాడో చూడండి

Avatar 2 Shooting: అవతార్ 2లో నీటి కింద షూటింగ్ ఎలా చేశారు.. జేమ్స్ కామెరాన్ ఏం చెప్పాడో చూడండి

Hari Prasad S HT Telugu

07 June 2023, 13:35 IST

    • Avatar 2 Shooting: అవతార్ 2లో నీటి కింద షూటింగ్ ఎలా చేశారు? దీనికి డైరెక్టర్ జేమ్స్ కామెరానే సమాధానం ఇచ్చాడు. ఈ అవతార్ ది వే ఆఫ్ వాటర్ మూవీ బుధవారం (జూన్ 7) ఓటీటీలోకి వచ్చిన విషయం తెలిసిందే.
అవతార్ ది వే ఆఫ్ వాటర్ మూవీలో నీటి అడుగున ఓ సీన్
అవతార్ ది వే ఆఫ్ వాటర్ మూవీలో నీటి అడుగున ఓ సీన్

అవతార్ ది వే ఆఫ్ వాటర్ మూవీలో నీటి అడుగున ఓ సీన్

Avatar 2 Shooting: అవతార్ ది వే ఆఫ్ వాటర్ సుమారు ఆరు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చింది. ఈ మూవీ బుధవారం (జూన్ 7) నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. దీంతో మరోసారి ఈ సినిమా ట్రెండింగ్ లో ఉంది. జేమ్స్ కామెరాన్ క్రియేట్ చేసిన ఈ అద్భుతాన్ని ప్రపంచం నివ్వెరపోయింది. అయితే అవతార్ ది వే ఆఫ్ వాటర్ మూవీలో చాలా వరకూ నీటి అడుగున ఉండే సీన్లే ఉన్నాయి.

ట్రెండింగ్ వార్తలు

Hi Nanna: హాయ్ నాన్న సినిమాకు మరో అంతర్జాతీయ వేదికపై అవార్డుల పంట.. ఆరు పురస్కారాలు: ఏఏ విభాగాల్లో వచ్చాయంటే..

Samantha: ‘అది ఫేక్’: సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సమంత ఫ్యాన్స్.. ఏం జరిగిందంటే..

Chitram Choodara OTT: నేరుగా ఓటీటీలోకి వస్తున్న వరుణ్ సందేశ్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

Aditya Kapur Ananya Panday: బాలీవుడ్ లవ్ బర్డ్స్ ఆదిత్య కపూర్, అనన్య పాండే బ్రేకప్ చేసుకున్నారా? వివరాలివే

మరి వాటిని ఎలా తీశారు? దీనికి సమాధానం కామెరానే చెప్పాడు. నిజంగా ఈ షూటింగ్ లో తాము చాలా పెద్ద సవాళ్లు ఎదుర్కొన్నట్లు వెల్లడించాడు. "నీటి అడుగున, నీటి పైన షూటింగ్ చేయడం అనేది ముఖ్యం. అలా చేయడం వల్ల యాక్టర్స్ సరిగా స్విమ్ చేయగలరు.. నీటి నుంచి బయటకు రాగలరు.. డైవింగ్ చేయగలరు. ఇదంతా నిజంగా జరుగుతున్నట్లు కనిపిస్తుంది. ఎందుకంటే ఆ మోషన్ నిజమైనది. ఆ ఎమోషన్ నిజమైనది" అని కామెరాన్ అన్నాడు.

ఈ నీటి అడుగున సీక్వెన్స్ షూట్ చేయడానికి మన్‌హటన్ బీచ్ స్టూడియోస్ లో ఓ పెద్ద ట్యాంక్ నిర్మించారట. ఈ ట్యాంక్ 120 అడుగుల పొడవు, 60 అడుగుల వెడల్పు, 30 అడుగుల లోతు ఉంటుంది. ఇందులో 2.5 లక్షల గ్యాలన్ల నీటిని నింపొచ్చు. ఇందులో నిజంగా సముద్రంలో ఉండే పరిస్థితులను ఈ ట్యాంక్ లో క్రియేట్ చేసి షూట్ చేశారు.

"ఆ ట్యాంకే పూర్తిగా మా షూటింగ్ అడ్డాగా మారిపోయింది. అందులోనే అలలను క్రియేట్ చేసేవాళ్లం. ఆ నీటి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో అలలు వాళ్లను తాకే సీన్లను చిత్రీకరించేవాళ్లం. ఆ అలలు బలంగా తాకుతున్నా.. వాళ్లు తమ డైలాగులు చెబుతూ, అదే సమయంలో ఊపిరి తీసుకుంటూ నానా కష్టాలు పడ్డారు" అని కామెరాన్ వెల్లడించాడు.

పండోరా అనే ఓ కొత్త ప్రపంచాన్ని ఈ అవతార్ సినిమా ద్వారా కామెరాన్ క్రియేట్ చేశాడు. తొలి పార్ట్ 2009లో అవతార్ గా వచ్చింది. ఇప్పుడు వచ్చిన అవతార్ ది వే ఆఫ్ వాటర్ మొత్తం నీటిపై జరిగే యుద్ధంగా చూపించారు. భూమి నుంచి వచ్చిన మనషుల నుంచి తమ పండోరా ప్రపంచాన్ని కాపాడుకోవడానికి అక్కడి వాళ్లు చేసే యుద్ధం ఈ సినిమాల్లో చూడొచ్చు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.