James Cameron on Titanic: జాక్‌ను బతికించాల్సింది.. టైటానిక్‌పై 25 ఏళ్ల తర్వాత కామెరాన్ కామెంట్స్-james cameron on titanic says jack might have lived ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  James Cameron On Titanic: జాక్‌ను బతికించాల్సింది.. టైటానిక్‌పై 25 ఏళ్ల తర్వాత కామెరాన్ కామెంట్స్

James Cameron on Titanic: జాక్‌ను బతికించాల్సింది.. టైటానిక్‌పై 25 ఏళ్ల తర్వాత కామెరాన్ కామెంట్స్

Hari Prasad S HT Telugu
Feb 09, 2023 11:50 AM IST

James Cameron on Titanic: జాక్‌ను బతికించాల్సింది అంటూ టైటానిక్‌ సీన్ పై 25 ఏళ్ల తర్వాత ఆ మూవీ డైరెక్టర్ జేమ్స్ కామెరాన్ స్పందించాడు. ఆ ఎపిక్ లవ్ స్టోరీలో టైటానిక్ మునిగిన సమయంలో ప్రేయసిని కాపాడి ప్రియుడు కన్నుమూయడం చాలా మందికి రుచించలేదు.

టైటానిక్ మూవీలో లియొనార్డో డికాప్రియో, కేట్ విన్‌స్లెట్
టైటానిక్ మూవీలో లియొనార్డో డికాప్రియో, కేట్ విన్‌స్లెట్ (HT_PRINT)

James Cameron on Titanic: జాక్, రోజ్.. చరిత్రలో అమర ప్రేమికులుగా మిగిలిపోయిన ఓ రోమియో జూలియట్, దేవదాస్ పార్వతి, సలీమ్ అనార్కలిలాగా 25 ఏళ్లుగా సినీ ప్రేక్షకుల గుండెల్లో నిలిచిన ప్రేమ జంట ఇది. హాలీవుడ్ సూపర్ హిట్ మూవీ టైటానిక్ లో లియోనార్డో డికాప్రియో, కేట్ విన్‌స్లెట్ లు పోషించిన పాత్రలివి. ఇందులో టైటానిక్ మునిగిపోయిన సమయంలో ప్రేయసి రోజ్ ప్రాణాలను కాపాడటానికి ప్రియుడు జాక్ తన ప్రాణాలు అర్పిస్తాడు.

ఈ లవ్ స్టోరీ ఇన్నేళ్లుగా ప్రేక్షకుల మదిలో అలా మిగిలిపోయినా.. జాక్ మరణం మాత్రం చాలా మందికి రుచించలేదు. ఆ మూవీలో జాక్ ను డైరెక్టర్ జేమ్స్ కామెరాన్ ఎందుకు చంపేయాల్సి వచ్చిందో అర్థం కాలేదు. బతికి ఉంటే బాగుండేది కదా అన్న ప్రశ్న ఇప్పటికీ వస్తూనే ఉంది. దీనిపై మొత్తానికి 25 ఏళ్ల తర్వాత స్పందించాడు. టైటానిక్ ఈ శుక్రవారం (ఫిబ్రవరి 10) రీరిలీజ్ కాబోతోంది.

జాక్ బతికి ఉండాల్సింది: కామెరాన్

జాక్ ను బతికించాల్సింది అనే ఎంతో మంది టైటానిక్ లవర్స్ ప్రశ్నకు తాజాగా డైరెక్టర్ కామెరాన్ స్పందించాడు. నిజానికి మూవీలో అతడు చనిపోయే సమయంలో ఓ డోర్ జాక్ కు దొరుకుతుంది. దానిపై రోజ్ ను ఎక్కించి ఆమెను కాపాడతాడు.

గడ్డ కట్టించేంత చల్లగా ఉన్న ఆ నీటిలో తాను ఎక్కువసేపు ప్రాణాలతో ఉండలేక చనిపోతాడు. అయితే ఇద్దరూ ప్రాణాలు కాపాడుకునేంత పెద్దదిగానే అది ఉన్నా.. డైరెక్టర్ ఎందుకిలా చేశాడన్న అనుమానం చాలా మందిలో కలిగింది.

ఈ మధ్య నేషనల్ జాగ్రఫిక్ డాక్యుమెంటరీలో ఇద్దరు స్టంట్ పర్ఫార్మర్లు ఆ సీన్ ను రీక్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. వాళ్ల ప్రకారం.. ఇద్దరూ బతికే అవకాశం ఉండేదని తేలింది. దీనిపై కామెరాన్ స్పందిస్తూ.. ఆ డోర్ ను నేను కాస్త చిన్నదిగా చూపి ఉంటే సరిపోయేది.. ఈ ప్రశ్నలు తలెత్తేవి కావు అని అనడం విశేషం.

"టైటానిక్ తర్వాత కూడా ప్రపంచంలో ఎన్నో దారుణమైన విషాదాలు చోటు చేసుకున్నాయి. అంటే మొదటి ప్రపంచ యుద్ధంలో కోట్ల మంది చనిపోయారు. రెండో ప్రపంచ యద్ధంలో కూడా. కానీ టైటానిక్ మాత్రం ఇప్పటికే ప్రత్యేకంగా నిలిచింది.

ఆ సమయంలో మహిళలు, పిల్లలను కాపాడటానికి పురుషులు లైఫ్ బోట్ల నుంచి తప్పుకున్నారు. ప్రేమ, త్యాగానికి ఇది అద్దం పట్టినందు వల్లే ఇలా ప్రత్యేకంగా నిలిచిపోయిందేమో" అని కామెరాన్ అన్నాడు.

"సినిమాలో మేము చూపించిన దాని పరంగా చూస్తే.. లైఫ్ బోట్స్ వచ్చే వరకూ జాక్ అలాగే ఉండేవాడేమో అనిపించింది. చివరగా చెప్పాలంటే జాక్ బతికి ఉండాల్సింది. కానీ అందులో చాలా అంశాలు ముడిపడి ఉన్నాయి" అని కామెరాన్ స్పష్టం చేశాడు.

టైటానిక్ మూవీ 1997, డిసెంబర్ లో రిలీజైంది. అప్పట్లో ఆ మూవీ రిలీజైన తర్వాత 8వ వారంలో మొదటి ఏడు వారాల కంటే ఎక్కువగా ఆ మూవీ భారీగా కలెక్షన్లు రాబట్టింది. దానికి కారణం వాలెంటైన్స్ డే. ఇప్పుడు మరోసారి వాలెంటైన్స్ వస్తున్న తరుణంలో టైటానిక్ రీరిలీజ్ కు సిద్ధమైంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్