Avatar 2 in OTT: అవతార్ 2 ఈ రోజు నుంచే ఓటీటీలో.. స్ట్రీమింగ్ టైమ్ ఇదే-avatar 2 in ott from today june 7th and the streaming time is this ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Avatar 2 In Ott: అవతార్ 2 ఈ రోజు నుంచే ఓటీటీలో.. స్ట్రీమింగ్ టైమ్ ఇదే

Avatar 2 in OTT: అవతార్ 2 ఈ రోజు నుంచే ఓటీటీలో.. స్ట్రీమింగ్ టైమ్ ఇదే

Hari Prasad S HT Telugu
Jun 07, 2023 10:07 AM IST

Avatar 2 in OTT: అవతార్ 2 ఈ రోజు నుంచే ఓటీటీలోకి రాబోతోంది. అయితే ఈ మూవీ స్ట్రీమింగ్ టైమ్ మాత్రం వేరు. మిగతా సినిమాలు, సిరీస్ లు అర్ధరాత్రి 12 నుంచే వస్తాయి. కానీ అవతార్ 2 మాత్రం మధ్యాహ్నం రానుంది.

అవతార్ ది వే ఆఫ్ వాటర్
అవతార్ ది వే ఆఫ్ వాటర్

Avatar 2 in OTT: హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరాన్ తెరకెక్కించిన అద్భుతం అవతార్ ది వే ఆఫ్ వాటర్ బుధవారం (జూన్ 7) నుంచే ఓటీటీలో ఉచితంగా అందుబాటులోకి రానుంది. ఈ సినిమా కోసం చాలా రోజులుగా ఎదురు చూస్తున్న అభిమానుల ఆశలు ఫలించనున్నాయి. ఈ మూవీ బుధవారం మధ్యాహ్నం 12.30 గంటల నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.

నిజానికి మన సినిమాలు, సిరీస్ లు అర్ధరాత్రి నుంచే అందుబాటులోకి వస్తాయి. అవతార్ 2 మాత్రం ఈస్టర్న్ స్టాండర్డ్ టైమ్ ప్రకారం రాత్రి 3 గంటలకు, పసిఫిక్ స్టాండర్డ్ టైమ్ ప్రకారం అర్ధరాత్రి 12 గంటల నుంచి స్ట్రీమ్ అవుతాయి. పసిఫిక్ స్టాండర్డ్ టైమ్ కంటే మన ఇండియన్ స్టాండర్డ్ టైమ్ 12.30 గంటలు ముందు ఉంటుంది.

దీంతో అవతార్ ది వే ఆఫ్ వాటర్ ఇండియాలో స్ట్రీమ్ అయ్యే సమయం బుధవారం (జూన్ 7) మధ్యాహ్నం 12.30 గంటలు కానుంది. బుధవారం ఉదయాన్నే హాట్‌స్టార్ చూసి నిరాశ చెందిన అభిమానులు ఈ స్ట్రీమింగ్ సమయాన్ని నోట్ చేసుకోండి. మధ్యాహ్నం 12.30 నుంచి ఈ సినిమా అందుబాటులో ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా 2.3 బిలియన్ డాలర్లు వసూలు చేసిన అవతార్ ది వే ఆఫ్ వాటర్.. ఏకంగా 173 రోజుల తర్వాత ఓటీటీలోకి వస్తోంది.

సాధారణంగా ఓ మూవీ థియేటర్లలో రిలీజైన తర్వాత గరిష్ఠంగా 90 రోజుల్లోపే ఓటీటీలో అడుగుపెడుతుంది. కానీ ఈ అవతార్ 2 మాత్రం గతేడాది డిసెంబర్ 16న రిలీజైంది. నిజానికి నెల రోజుల కిందటే ఈ మూవీ ఓటీటీలోకి వచ్చినా.. రెంటల్ విధానంలో భారీగా చెల్లించాల్సి వచ్చింది. అయితే బుధవారం (జూన్ 7) నుంచి ఫ్రీగా అందుబాటులోకి రావడంతో డిజిటల్ ప్లాట్‌ఫామ్ పై కూడా ఈ సినిమా సంచలనాలు క్రియేట్ చేస్తుందని భావిస్తున్నారు.

సంబంధిత కథనం