Cameron Earnings from Avatar 2: అవతార్ 2తో డైరెక్టర్ కామెరాన్ సంపాదించిన మొత్తం రూ.786 కోట్లు-cameron earnings from avatar 2 is huge with nearly 100 million dollars ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Cameron Earnings From Avatar 2 Is Huge With Nearly 100 Million Dollars

Cameron Earnings from Avatar 2: అవతార్ 2తో డైరెక్టర్ కామెరాన్ సంపాదించిన మొత్తం రూ.786 కోట్లు

Hari Prasad S HT Telugu
Feb 14, 2023 03:21 PM IST

Cameron Earnings from Avatar 2: అవతార్ 2తో డైరెక్టర్ కామెరాన్ సంపాదించిన మొత్తం అక్షరాలా రూ.786 కోట్లు. ఎన్నో భారీ బడ్జెట్ సినిమాల కంటే కూడా ఈ మొత్తం ఎంతో ఎక్కువ కావడం విశేషం.

అవతార్: ది వే ఆఫ్ వాటర్
అవతార్: ది వే ఆఫ్ వాటర్

Cameron Earnings from Avatar 2: అవతార్ 2.. ఎప్పుడో 2009లో వచ్చిన అవతార్ మూవీ సీక్వెల్ గా వచ్చిన సినిమా. అవతార్ ది వే ఆఫ్ వాటర్ పేరుతో గతేడాది డిసెంబర్ 16న రిలీజైన ఈ మూవీ.. ఊహించినట్లే బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ప్రపంచ సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల లిస్టులో మూడోస్థానంలో నిలిచింది.

ఈ మధ్యే కామెరాన్ మూవీయే అయిన టైటానిక్ లైఫ్ టైమ్ కలెక్షన్ల రికార్డును బ్రేక్ చేసింది. సుమారు రూ.3300 కోట్ల అతి భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ.. అంతకంటే ఎన్నో రెట్లు ఎక్కువే సంపాదించింది. అయితే ఈ సినిమా తీసిన డైరెక్టర్ జేమ్స్ కామెరాన్ కూడా భారీగానే వెనకేసుకున్నాడు. అవతార్ 2 గ్రాండ్ సక్సెస్ తో కామెరాన్ ఏకంగా 9.5 కోట్ల డాలర్లు (సుమారు రూ.786 కోట్లు) సంపాదించడం విశేషం.

దీంతో 2022 ఏడాదికిగాను అత్యధిక రెమ్యునరేషన్ అందుకున్న డైరెక్టర్ల లిస్టులో కామెరాన్ టాప్ లో నిలిచాడు. అతడు తీసిన అవతార్ మూవీయే ఇప్పటికే ప్రపంచంలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా ఉంది. ఇక మొత్తం ఐదు భాగాలుగా రానున్న ఈ అవతార్ సిరీస్ లో మూడోదైన అవతార్ ది సీడ్ బేరర్ డిసెంబర్ 20, 2024లో రిలీజ్ కానుంది.

క‌థ‌గా చెప్పుకుంటే అవ‌తార్ -2 రెగ్యుల‌ర్ రివేంజ్ డ్రామా. ఈ రొటీన్ పాయింట్‌ను గ్రాఫిక్స్‌తో విజువ‌ల్ ఫీస్ట్‌గా ద‌ర్శ‌కుడు మ‌లిచారు. రీఫ్ ఐలాండ్ బ్యాక్‌డ్రాప్‌, అక్క‌డి జంతువులు, మ‌నుషుల‌తో కొత్త ప్ర‌పంచాన్ని క్రియేట్ చేశారు జేమ్స్ కామెరూన్‌. ఆ బ్యాక్‌డ్రాప్‌లో వ‌చ్చే సీన్స్ ఆక‌ట్టుకుంటాయి.

రీఫ్ ఐలాండ్‌లోకి ప్రేక్ష‌కుల్ని తీసుకెళ‌తాయి. క్లైమాక్స్ యాక్ష‌న్ ఎపిసోడ్స్ హైలైట్‌గా నిలిచాయి. చివ‌ర‌లో వ‌చ్చే సీన్స్ కొంత జేమ్స్ కామెరూన్ టైటానిక్ సినిమాను గుర్తుచేసిన‌ట్లుగా అనిపిస్తాయి.

IPL_Entry_Point

సంబంధిత కథనం