Avatar 2 Passes Avengers Infinity War: అవేంజర్స్‌ను అధిగమించిన అవతార్ 2.. టాప్-5 బిగ్గెస్ట్ సినిమాగా రికార్డు-avatar 2 passes avengers infinity war to create fifth highest grossing film ever ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Avatar 2 Passes Avengers Infinity War To Create Fifth Highest Grossing Film Ever

Avatar 2 Passes Avengers Infinity War: అవేంజర్స్‌ను అధిగమించిన అవతార్ 2.. టాప్-5 బిగ్గెస్ట్ సినిమాగా రికార్డు

Maragani Govardhan HT Telugu
Jan 27, 2023 12:11 PM IST

Avatar 2 Passes Avengers Infinity War: హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన అవతార్ 2 సినిమా అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఈ సినిమా అత్యధిక వసూళ్లను సాధించిన టాప్-5 చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.

అవతార్ 2
అవతార్ 2

Avatar 2 Passes Avengers Infinity War: జేమ్స్ కామెరూన్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన అవతార్ ది వే ఆఫ్ వాటర్(Avatar the way of Water) సినిమా సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 2 బిలియన్ డాలర్ల మార్కును అందుకున్న ఈ సినిమా మరిన్ని రికార్డులను బద్దలుకొట్టే దిశగా ప్రయాణిస్తోంది. తాజాగా ఈ సినిమా ప్రముఖ మార్వెల్ సినిమా అవేంజర్స్ ఇన్ఫినిటీ వార్ రికార్డును బ్రేక్ చేసింది. ప్రపంచంలోనే అత్యధిక వసూళ్లను సాధించిన టాప్-5 చిత్రాల్లో చోటు దక్కించుకున్నట్లు ప్రముఖ హాలీవుడ్ మ్యాగజైన్ వెరైటీ పేర్కొంది.

వెరైటీ ప్రకారం అవతార్ 2 ప్రపంచ వ్యాప్తంగా 2.054 బిలియన్ డాలర్లను వసూలు చేసి అవేంజర్స్ ఇన్ఫినిటీ వార్ రికార్డును అధిగమించింది. 2018లో విడుదలైన ఇన్ఫినిటీ వార్ 2.052 బిలియన్ డాలర్లను కలెక్ట్ చేసింది. తాజాగా ఈ రికార్డును అధిగమించి అత్యధిక వసూళ్లను సాధించిన టాప్-5 చిత్రాల సరసన నిలిచింది.

ప్రపంచంలోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా అవతార్.. 2.92 బిలియన్ డాలర్లతో అగ్రస్థానంలో ఉంది. దీని తర్వాత అవేంజర్స్ ఎండ్ గేమ్(2.79 బిలియన్ డాలర్లు) రెండో స్థానంలో, టైటానిక్(2.19 బిలియన్లు) మూడో స్థానంలో, స్టార్ వార్స్ ఎపిసోడ్ 7- ది ఫోర్స్ అవేకిన్స్(2.07 బిలియన్ల) నాలుగో స్థానంలో ఉంది. తాజాగా ఐదో స్థానంలో అవతార్ 2 దూసుకొచ్చింది. ఈ సినిమా ఇప్పటికే అవేంజర్స్ ఇన్ఫినిటీ వార్, స్పైడర్ మ్యాన్ నో వే హోమ్(1.92 బిలియన్ డాలర్లు) చిత్రాలను అధిగమించింది.

అవతార్ 2 ఒక్క అమెరికాలోనే 603 మిలియన్ డాలర్లను రాబట్టగా.. అంతర్జాతీయ స్థాయిలో 1.5 బిలియన్ డాలర్లను కొల్లగొట్టింది. దీంతో అత్యధిక వసూళ్లను సాధించిన నాలుగో చిత్రంగా నిలిచింది. విశ్వవ్యాప్తంగా 2 బిలియన్ డాలర్ల మార్కును అందుకున్న ఆరో చిత్రంగా గుర్తింపు తెచ్చుకుంది. అందులోనూ విడుదలైన ఆరు వారాల్లోనే ఈ ఘనత సాధించడం విశేషం.

ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే 1.5 బిలియన్ డాలర్లు అవసరం కాగా.. ఆ వసూళ్లను అవతార్2 ఎప్పుడో సాధించింది. ప్రస్తుతం ఈ సినిమాకు లాభాల పంట పండింది. ఈ సినిమాను తెరకెక్కించేందుకు సరికొత్త టెక్నాలజీని ఉపయోగించారు. మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో రూపొందించారు.

జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఐదు భాగాలుగా విడుదల అవుతుది. ఇంకా థియేటర్లలో దిగ్విజయంగా ప్రదర్శితమవుతున్న ఈ సినిమా స్టార్ వార్స్ ది ఫోర్స్ అవేకిన్స్ రికార్డును కూడా అధిగమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఫిబ్రవరి 17 వరకు హాలీవుడ్‌లో ఎలాంటి పెద్ద సినిమాలు విడుదల కావట్లేదు. అప్పుడు యాంట్ మ్యాన్ వ్యాస్ప్ మాత్రమే రానుంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం