Avatar 2 Collections : అవతార్ 2 మరో సంచలనం.. ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్స్ ఎంతంటే?-avatar 2 box office collections gonna creates new record in collections ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Avatar 2 Collections : అవతార్ 2 మరో సంచలనం.. ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్స్ ఎంతంటే?

Avatar 2 Collections : అవతార్ 2 మరో సంచలనం.. ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్స్ ఎంతంటే?

Anand Sai HT Telugu
Jan 23, 2023 01:40 PM IST

Avatar 2 Box Office Collections : జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వహించిన అవతార్ 2 సినిమా దూసుకెళ్తోంది. అత్యధిక వసూళ్లను సాధించే చిత్రం వైపుగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఈ సినిమా రెండు బిలియన్ల డాలర్ల మార్క్ ను దాటేసింది.

అవతార్ 2 కలెక్షన్లు
అవతార్ 2 కలెక్షన్లు

హాలీవుడ్ సూపర్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్(james cameron) తాజా వండర్ అవతార్ : ది వే ఆఫ్ వాటర్(Avatar The Way of Water) బాక్సాఫీస్ వద్ద మరో సంచలన రికార్డు సృష్టించింది. ఈ చిత్రం ఇప్పుడు అధికారికంగా 2 బిలియన్ల డాలర్ల మార్కును దాటింది. ప్రపంచంలో అత్యధిక వసూళ్లు చేసిన 6వ చిత్రంగా నిలిచింది.

అవతార్ 2 సినిమా 38వ రోజు ఈ అనూహ్యమైన ఫీట్‌ని సాధించింది. మరో విషయం ఏంటంటే.. జేమ్స్ కామెరూన్‌ను ఇప్పటి వరకు రెండు బిలియన్ల డాలర్లు సాధించిన 3 చిత్రాలను తీసిన ఏకైక దర్శకుడిగా నిలిచాడు. ఈ చిత్రం మరికొద్ది రోజుల్లో స్టార్ వార్స్ : ది ఫోర్స్ అవేకెన్స్ (2.07 బిలియన్ల డాలర్లు), అవెంజర్స్: ఇన్ఫినిటీ వార్ (2.05 బిలియన్ల డాలర్లు) జీవితకాల కలెక్షన్లను అధిగమించి, ఆల్ టైమ్ అత్యధిక వసూళ్లు చేసిన 4వ చిత్రంగా అవతరించనుంది.

2022 డిసెంబర్ 16 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది అవతార్ 2(Avatar 2). ఆ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగానూ నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా 2022లో 1.516 బిలియన్ డాలర్లను వసూలు చేసింది. ఫలితంగా 2022లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు నమోదు చేసింది. గతేడాది వసూళ్ల వర్షాన్ని కురిపించిన టామ్ క్రూజ్ చిత్రం టాప్ గన్ మ్యావ్రిక్‌ను అధిగమించింది.

హాలీవుడ్(Hollywood) యాక్షన్ హీరో టామ్ క్రూజ్ నటించిన టాప్ గన్ మ్యావ్రిక్ 1.4 బిలియన్ డాలర్లను వసూలు చేయగా.. అవతార్ 2 కిందటి ఏడాది 1.516 బిలియన్ డాలర్లతో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. అవతార్ 2 అమెరికా(America), కెనడాలో కలిపి 464 మిలియన్ డాలర్లను వసూలు చేయగా.. ఇతర ప్రపంచ దేశాలన్నింటిలో కలిపి 1.05 బిలియన్ డాలర్లతో వసూళ్ల వర్షాన్ని కురిపించింది. అమెరికా తర్వాత చైనాలో 168 మిలియన్లను వసూలు చేసింది. చైనా తర్వా ఫ్రాన్స్‌లో 96 మిలియన్ డాలర్లను(రూ.793 కోట్లు), దక్షిణ కొరియా నుంచి 78.2 మిలియన్ డాలర్లను(రూ.645 కోట్లు) వసూలు చేసింది.

IPL_Entry_Point

సంబంధిత కథనం