Avatar 2 Collections: అవతార్ టాప్.. ప్రపంచంలో అత్యధిక కలెక్షన్లు సాధించిన టాప్ 5 సినిమాలు ఇవే-avatar 2 collections made it the third highest grossing film in the world ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Avatar 2 Collections: అవతార్ టాప్.. ప్రపంచంలో అత్యధిక కలెక్షన్లు సాధించిన టాప్ 5 సినిమాలు ఇవే

Avatar 2 Collections: అవతార్ టాప్.. ప్రపంచంలో అత్యధిక కలెక్షన్లు సాధించిన టాప్ 5 సినిమాలు ఇవే

Hari Prasad S HT Telugu
Jun 09, 2023 01:39 PM IST

Avatar 2 Collections: అవతార్ 2 టాప్ లో నిలవగా.. ప్రపంచంలో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఈ మధ్యే అవతార్ ది వే ఆఫ్ వాటర్ ఓటీటీలోకి వచ్చిన విషయం తెలిసిందే.

అవతార్ 2 మూవీ
అవతార్ 2 మూవీ

Avatar 2 Collections: అవతార్ 2 లేదా అవతార్ ది వే ఆప్ వాటర్.. ప్రపంచంలో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాల్లో మూదోస్థానం ఈ మూవీదే. గతేడాది డిసెంబర్ 16న రిలీజైన ఈ మూవీ.. బాక్సాఫీస్ ను పూర్తిగా కొల్లగొట్టిన తర్వాత సుమారు ఆరు నెలలకు ఓటీటీలో అడుగుపెట్టింది. బుధవారం (జూన్ 7) నుంచి ఈ అవతార్ 2 డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాలేంటో ఒకసారి చూద్దాం.

అవతార్

జేమ్స్ కామెరాన్ క్రియేట్ చేసిన ఈ అద్భుతం 2009లో రిలీజైంది. 292 కోట్ల డాలర్లు (సుమారు రూ.24 వేల కోట్లు) వసూలు చేసి ఇప్పటికీ ప్రపంచంలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా కొనసాగుతోంది. పండరో ప్రపంచాన్ని పరిచయం చేసిన మూవీ ఇది.

అవెంజర్స్: ఎండ్ గేమ్

అవెంజర్స్ సిరీస్ లో భాగంగా వచ్చిన అవెంజర్స్: ఎండ్ గేమ్ మూవీ 2019లో రిలీజైంది. ఈ సినిమా 279 కోట్ల డాలర్లు (సుమారు రూ.23 వేల కోట్లు) వసూలు చేసింది. అత్యధిక వసూళ్లలో ఈ మూవీ రెండోస్థానంలో ఉంది.

అవతార్: ది వే ఆఫ్ వాటర్ లేదా అవతార్ 2

అవతార్ 2 లేదా అవతార్ ది వే ఆఫ్ వాటర్ మూవీ 2022, డిసెంబర్ 16న రిలీజైంది. అవతార్ మూవీకి సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమా 232 కోట్ల డాలర్లు (సుమారు రూ.19 వేల కోట్లు) వసూలు చేసింది. అవతార్ కంటే ఎక్కువ బడ్జెట్, అంతకంటే ఎక్కువ హైప్ తో రిలీజైనా కూడా ఆ మూవీ కలెక్షన్ల కంటే ఎంతో దూరంలోనే నిలిచి మూడోస్థానంతో సరిపెట్టుకుంది.

టైటానిక్

జేమ్స్ కామెరాన్ క్రియేట్ చేసిన మరో వండర్ టైటానిక్. 1997లో రిలీజైన ఈ మూవీ 226 కోట్ల డాలర్లు (సుమారు రూ.18600 కోట్లు) వసూలు చేసింది. 1912లో జరిగిన టైటానిక్ షిప్ ప్రమాదానికి ఓ లవ్ స్టోరీని యాడ్ చేసి తీసిన సినిమా ఇది.

స్టార్ వార్స్: ది ఫోర్స్ అవేకెన్స్

స్టార్ వార్స్: ది ఫోర్స్ అవేకెన్స్ సినిమా 2015లో రిలీజైంది. ఈ మూవీ 207 కోట్ల డాలర్లు (సుమారు రూ.17 వేల కోట్లు) వసూలు చేసింది. అత్యధిక వసూళ్లు సాధించిన మూవీస్ లో ఐదోస్థానంలో ఈ సినిమా ఉంది.

సంబంధిత కథనం