తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Attitude Star Chandrahas: మా నాన్న మెగాస్టార్ - అందుకే నేను ఆటిట్యూడ్ చూపిస్తున్నా - ట్రోల్స్‌పై చంద్ర‌హాస్ కామెంట్స్‌

Attitude Star Chandrahas: మా నాన్న మెగాస్టార్ - అందుకే నేను ఆటిట్యూడ్ చూపిస్తున్నా - ట్రోల్స్‌పై చంద్ర‌హాస్ కామెంట్స్‌

09 September 2024, 10:13 IST

google News
  • Attitude Star Chandrahas: సీరియ‌ల్ యాక్ట‌ర్ ప్ర‌భాక‌ర్ త‌న‌యుడు చంద్ర‌హాస్ రామ్‌న‌గ‌ర్ బ‌న్నీ మూవీతో హీరోగా ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు. రామ్‌న‌గ‌ర్ బ‌న్నీ గ్లింప్స్‌ను తెలంగాణ స్పీక‌ర్ గ‌డ్డ ప్ర‌సాద్‌కుమార్ రిలీజ్ చేశాడు. ఈ ఈవెంట్‌లో త‌న‌పై వ‌స్తోన్న ట్రోల్స్‌పై చంద్ర‌హాస్ రియాక్ట్ అయ్యాడు.

ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్
ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్

ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్

Attitude Star Chandrahas: సీరియ‌ల్ యాక్ట‌ర్ ప్ర‌భాక‌ర్ త‌న‌యుడు చంద్ర‌హాస్ హీరోగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోన్నాడు. రామ్‌న‌గ‌ర్ బ‌న్నీ పేరుతో ఓ మూవీ చేస్తోన్నాడు. రామ్‌న‌గ‌ర్ బ‌న్నీ సినిమా గ్లింప్స్‌ను ఆదివారం తెలంగాణ స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్ రిలీజ్ చేశాడు. రామ్‌న‌గ‌ర్ బ‌న్నీ సినిమాకు వెలిగొండ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

రియ‌ల్‌లైఫ్‌లో న‌టించ‌డం రాదు...

ఈ గ్లింప్స్ రిలీజ్ ఈవెంట్‌లో త‌న‌పై వ‌స్తోన్న ట్రోల్స్‌పై చంద్ర‌హాస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

"సినిమా లాంఛింగ్ రోజు నేను చేతులు జేబులో పెట్టుకొని క్యాజువ‌ల్‌గా నిల్చున్నా. అది చూసి చాలా మంది న‌న్ను ట్రోల్ చేశారు. స్టేజ్‌పై ఒక‌లా...స్టేజ్ కింద ఒక‌లా బిహేవ్ చేయ‌డం నాకు రాదు. సినిమాలో యాక్టింగ్ చేస్తా...కానీ రియ‌ల్‌లైఫ్‌లో యాక్టింగ్ చేయ‌డం నాకు తెలియ‌ద‌ని చంద్ర‌హాస్ అన్నాడు.

నాకు తెలిసినంత వ‌ర‌కు నేను ఎవ‌రిని కించ‌ప‌ర‌చ‌లేదు. ఏ త‌ప్పు చేయ‌లేదు కాబ‌ట్టి ఎవ‌రికి భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని" చంద్ర‌హాస్ తెలిపాడు.

బుల్లితెర మెగాస్టార్‌...

“మా నాన్న బుల్లితెర మెగాస్టార్‌. డైరెక్ట‌ర్‌, యాక్ట‌ర్‌, ప్రొడ్యూస‌ర్‌గా ఎన్నో సీరియ‌ల్స్ చేశారు. హోస్ట్‌గా ప‌లు టీవీ షోలు చేశాడు. మా నాన్న గొప్ప హీరో అయిన‌ప్పుడు నాకు ఆటిట్యూడ్ ఉంట‌ది. ఆటిట్యూడ్ స్టార్ అనే పిలుపును నేను ఇన్‌స‌ల్ట్‌గా భావించ‌డం లేదు. ఆ ట్యాగ్‌ను చూసి గ‌ర్వంగా ఫీల‌వుతున్నా. రామ్ న‌గ‌ర్ బ‌న్నీతో నాపై నెగెటివ్‌గా ఉన్న వాళ్లంద‌రూ పాజిటివ్ అవుతార‌ని అనుకుంటాను. ప్ర‌తి సినిమాను నా ట్రోల‌ర్స్‌ను మార్చేస్తాను. అదే గోల్‌గా పెట్టుకున్నా” అని చంద్ర‌హాస్ తెలిపాడు.

ఇదే నా రిక్వెస్ట్‌...

“న‌న్ను జోక‌ర్ అంటూ ట్రోల్ చేశారు. అన‌కూడ‌ని మాట‌ల్ని అన్నారు. నాలంటోడు హిట్టు కొడితే ఆ కిక్కు వేరుగా ఉంటుంది. సినిమా రిలీజ్ రోజు ఆటిట్యూడ్ స్టార్ అని నా పేరు స్క్రీన్‌పై క‌నిపించ‌గానే పాజిటివ్‌గా ఆలోచించేవాళ్లు అంద‌రూ అర‌వాల‌ని కోరుకుంటున్నారు. ఇది నా రిక్వెస్ట్” అని చంద్ర‌హాస్ అన్నాడు.

మూడు సినిమాలు...

ప్ర‌స్తుతం హీరోగా మూడు సినిమాలు చేస్తున్న‌ట్లు చంద్ర‌హాస్ తెలిపాడు. రామ్‌న‌గ‌ర్ బ‌న్నీ మూవీ అక్టోబ‌ర్‌లో రిలీజ్ కానున్న‌ట్లు చెప్పాడు. యూత్‌ఫుల్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ మూవీని ఏ భాష‌లో రిలీజ్ చేసినా ఆడుతుంద‌నే న‌మ్మ‌కం ఉంద‌ని తెలిపాడు. రామ్‌న‌గ‌ర్ బ‌న్నీ క‌లెక్ష‌న్స్‌లో ప‌ది శాతం వ‌ర‌ద బాధితుల‌కు స‌హాయంగా అందించ‌బోతున్న‌ట్లు చంద్ర‌హాస్ చెప్పాడు.

రామ్‌న‌గ‌ర్ బ‌న్నీ సినిమాలో విస్మ‌య శ్రీ, రిచా జోషి హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. మ‌ధునంద‌న్‌, స‌లీమ్ ఫేకు, స‌మీర్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ సినిమా చంద్ర‌హాస్ తండ్రి ప్ర‌భాక‌ర్ స్వ‌యంగా ప్రొడ్యూస్ చేస్తున్నాడు. త్వ‌ర‌లోనే రామ్ న‌గ‌ర్ బ‌న్నీ రిలీజ్ డేట్‌ను అనౌన్స్‌చేయ‌బోతున్నారు.

ఇల్లు ఇల్లాలు పిల్ల‌లు...

కాగా గ‌త కొంత‌కాలంగా బుల్లితెర‌కు దూరంగా ఉంటున్న ప్ర‌భాక‌ర్ త్వ‌ర‌లోనే ఇల్లు ఇల్లాలు పిల్ల‌లు సీరియ‌ల్‌లో రీఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు. త్వ‌ర‌లోనే స్టార్ మా ఛానెల్‌లో ఈ సీరియ‌ల్ టెలికాస్ట్ కాబోతోంది. ఈసీరియ‌ల్‌లో ప్ర‌భాక‌ర్‌తో పాటు ఆమ‌ని కీల‌క పాత్ర‌లో న‌టిస్తోంది.

తదుపరి వ్యాసం