Guppedantha Manasu April 20th Episode: సౌజన్యరావు కుట్ర గురించి రిషికి చెప్పిన వసు.. మొండి పట్టుదలతో మిస్టర్ ఆటిట్యూడ్-guppedantha manasu 2023 april 20th episode rishi takes light on soujanya rao proposal ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Guppedantha Manasu April 20th Episode: సౌజన్యరావు కుట్ర గురించి రిషికి చెప్పిన వసు.. మొండి పట్టుదలతో మిస్టర్ ఆటిట్యూడ్

Guppedantha Manasu April 20th Episode: సౌజన్యరావు కుట్ర గురించి రిషికి చెప్పిన వసు.. మొండి పట్టుదలతో మిస్టర్ ఆటిట్యూడ్

Maragani Govardhan HT Telugu
Apr 20, 2023 07:31 AM IST

Guppedantha Manasu April 20th Episode: ఈ రోజు గుప్పెడంత మనసు ఎపిసోడ్‌లో సౌజన్యరావు ప్రపోజల్‌ గురించి రిషికి ఎలా చెప్పాలా అని వసు, జగతీ సతమతమవుతుంటారు. చివరకు వసు.. రిషికి ఆ విషయం గురించి చెబుతుంది. అయితే రిషి మాత్రం ఆ మ్యాటర్‌ను లైట్ తీసుకుంటాడు.

గుప్పెడంత మనసు ఏప్రిల్ 20వ తేదీ ఎపిసోడ్
గుప్పెడంత మనసు ఏప్రిల్ 20వ తేదీ ఎపిసోడ్

Guppedantha Manasu April 20th Episode: గుప్పెడంత మనసు నిన్నటి ఎపిసోడ్‌లో సౌజన్యరావు ఎంఎస్ఆర్‌ కాలేజ్‌లో డీబీఎస్టీ కాలేజ్‌ను కలపాలని జగతీ, వసుల ముందు ప్రతిపాదిస్తాడు. ఇందుకు వారిద్దరూ ససేమిరా జరగదని అక్కడ నుంచ వచ్చేస్తారు. ఎలా జరగదో నేను చూస్తానంటూ సౌజన్యరావు తన ప్లాన్‌లో తను ఉంటాడు. గురువారం నాటి ఎపిసోడ్‌లో ఇంటికి వచ్చిన జగతీ, వసులు.. జరిగిన విషయాన్ని మహేంద్రకు చెప్పి దీర్ఘంగా ఆలోచిస్తుంటారు. సౌజన్యరావు ఇలా చేస్తాడని ఊహించలేదని, తనలో ఏదో కుట్ర దాగుందని జగతీ అంటుంది. ఇందుకు వసు కూడా అవును మేడమ్.. సౌజన్యరావు మన కాలేజ్‌లో రిషి సార్‌ను కలిసినప్పుడు ఒకలా.. ఇప్పుడు మరోలా మాట్లాడారు అని చెబుతుంది. అనంతరం జగతీ మాట్లాడుతూ.. ఈ విషయం రిషికి చెప్పడం ఎలా అంటూ మహేంద్రను అడుగుతుంది.

జగతీ మాటను పూర్తిగా వినని రిషి..

రిషి ప్రస్తుతం డీబీఎస్టీ కాలేజ్‌లో మెడికల్ కాలేజ్ వస్తుందని చాలా సంతోషపడుతున్నాడని, ఇప్పుడు ఈ విషయం చెబితే ఎంతలా బాధపడతాడో భయమేస్తుందని జగతీతో మహేంద్ర చెబుతాడు. ఇంతలో రిషి ఎంట్రీ ఇస్తాడు. ఏంటి మేడమ్ అందరూ అలా ఉన్నారని జగతీని రిషి అడుగుతాడు. ఏం లేదని జగతీ బదులిస్తుంది. మీరు వెళ్లిన పని ఏమైందని అడుగుతాడు. ఏం లేదు రిషి సౌజన్యరావు గారు.. అని విషయం చెబుతుండగా.. రిషి కలగజేసుకుని మీరు వెళ్తే పని కాకుండా ఉంటుందా అని అంటాడు. దీంతో జగతీ ఏం మాట్లాడలేకపోతుంది. నేను వసును బయటకు తీసుకెల్దామని అనుకుంటున్నాను. వచ్చిన తర్వాత అన్ని విషయాలను మాట్లాడుకుందాము అంటూ వసును పిలిచి అక్కడనుంచి వెళ్తాడు.

రిషి-వసు బైక్ రైడ్..

ఇదే మంచి అవకాశం వసు.. వెళ్లి సమయం చూసి అసలు విషయం చెప్పు అంటూ జగతీ.. వసుకు హిత బోధ చేస్తుంది. దీంతో వసు.. రిషితో పాటు వెళ్తుంది. సీన్ కట్ చేస్తే వసు కారు దగ్గరకు వెళ్తుంటే.. రిషి వద్దని వారించి కారులో వెళ్లట్లేదని చెబుతాడు. మనం బైక్‌పై వెళ్తున్నామని అంటాడు. ఎందుకు సార్ వసు ప్రశ్నించగా.. కొన్నికొన్ని ఉత్సాహాలకు కొన్ని కొన్ని కోరికలు ఉంటాయంటూ ఇద్దరూ బైక్ రైడ్‌కు సిద్ధమవుతారు. ఎక్కడకని వసు ప్రశ్నించగా.. నీకు చెప్పకుండా తీసుకెల్దామని అనుకుంటున్నానని, ఎక్కడకు వెళ్లినా.. ఎంతదూరం వెళ్లినా కలిసే వెళ్తాం వసుధార.. గమ్యం గురించి ఆలోచించకు.. ప్రయాణాన్ని ఆస్వాదించూ అంటూ వసుకు హెల్మెట్ తొడుగుతాడు రిషి.. ఇంతలో పైన బాల్కనీ నుంచి దేవయాని వీరిద్దరిని కోపంగా చూస్తుంటుంది.

వసు-రిషిని చూసి ఓర్వలేకపోతున్న దేవయాని..

కోపంతో భర్త ఫణీంద్ర దగ్గరకు వచ్చి కారులో వెళ్తేనే వెయ్యి మంది చూస్తారు.. ఇప్పుడు బైక్‌లో వెళ్లడమేంటని కోపగించుకుంటుంది. నాకు అసలు ఈ ఇంట్లో పద్ధతులు.. ముఖ్యంగా ఈ వసుధార వాలకం నాకు నచ్చట్లేదని అంటుంది. వారు ఏదో పనిమీదో వెళ్తున్నారు.. మధ్యలో నీకెందుకు అంటూ ఫణీంద్ర.. దేవయాని అంటాడు. నువ్వు రిషిని పెంచిన తల్లివి, అందుకు వాడు గౌరవిస్తున్నాడు. మరి వాడిని కంట్రోల్ చేయాలనుకోకు.. అదే నీకే నష్టం జరుగుతుందని చెబుతాడు. ఎప్పుడూ పాత చింతకాయ పచ్చడి సీరియల్స్ కాకుండా కాస్త ట్రెండ్‌కు తగినట్లుగా మారండి అని అంటాడు. ఇంతలో ధరణి రాగా.. ఫణీంద్ర ఆమెను.. కాస్త కాఫీ తీసుకురామని పురమాయించి వెళ్తాడు. మీకు ఏమైనా తీసుకురావాలా? కాఫీ.. టీ లాంటిది అంటూ దేవయానిని అడుగుతుంది. ఏమి వద్దు కానీ.. విషం ఉంటే తీసుకురా అని చెబుతుంది. అయ్యో అత్తయ్య గారు విషం ఇంట్లో లేదనకుంటా అంటూ అక్కడనుంచి వెళ్తుంది. చిర్రెత్తికుపోయిన దేవయాని ఉంటే తీసుకొద్దామనే అనుకుంటూ వెళ్లిపోతుంది.

సీన్ కట్ చేస్తే రిషి, వసులు డీబీఎస్టీ కాలేజ్‌కు వస్తారు. ఏంటో చెప్పండి పదే పదే అడిగినా రిషి మాత్రం చెప్పడు. అనంతరం వసుధారను కళ్లు మూసుకోమని చెబుతాడు. ఆమె మూసుకోకపోతే.. బలవంతంగా కళ్లపై చేతులు పెట్టి గదిలోకి తీసుకెళ్తాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ కళ్లు తెరవద్దని చెబుతాడు. ఆమెను డీబీఎస్‌టీ మెడికల్ కాలేజ్ అనే బోర్డు వద్దకు తీసుకొచ్చి కళ్లు తెరవమంటాడు. అది చూసిన వసు షాక్ అవుతూ సౌజన్యరావుతో జరిగిన మీటింగ్ గురించి చెప్పాలా? వద్దా? అని ఆలోచిస్తుంటుంది. ఇదేనా సార్ సర్ ప్రైజ్ అని అడుగుతుంది. ఎలా ఉంది? అని అడుగ్గా చాలా బాగుందని చెబుతుంది వసు. ఇది నా కోరిక ఇప్పుడు తీరబోతుంది. అందుకే చాలా సంతోషంగా ఉన్నానని చెబుతాడు. ఆ బోర్డు చూసి విషయం చెబుతామా లేదా అని ఆలోచిస్తున్న వసును చూసిన రిషి ఏమైందని అడుగుతాడు.

రిషికి నిజం చెప్పిన వసు..

అనంతరం సౌజన్యరావును కలిసిన విషయాన్ని చెప్పబోతుండగా.. ఇప్పుడు ఎందుకు ఆ విషయాలు ఇంటి దగ్గర మాట్లాడుకుందామని చెప్పాగా అని అంటాడు రిషి. సార్ ఇది మీరు విని తీరాలి అని అనగా.. సరే చెప్పు అని రిషి అంటాడు. దీంతో సౌజన్యరావు ప్రపోజల్ గురించి రిషికి వసు వివరిస్తుంది. షాక్ అయిన రిషి.. ఎంఎస్ఆర్ కాలేజ్‌లో డీబీఎస్టీ కాలేజ్‌ను కలపాలా నో వే అని తన ఉద్దేశాన్ని చెబుతాడు. అయినా నువ్వెందుకు ఈ విషయంలో బాధపడుతున్నావని వసును ప్రశ్నించగా.. అది కాదు.. ఈ సారి మెడికల్ కాలేజ్‌పై మీరు చాలా ఆశలు పెట్టుకున్నారు అందుకేనని బదులిస్తుంది.

లైట్ తీసుకున్న రిషి..

వసు మాటలు విన్న రిషి.. అతనేదో ప్రపోజల్ తీసుకొచ్చాడని సరేనన్నాను. కానీ మనసులో ఇంత దురుద్దేశం ఉంటుందని మనం ఊహించలేం కదా. ఇందులో ఆందోళన చెందాల్సిన అవసరం ఏముందని మ్యాటర్‌ను లైట్ తీసుకుంటాడు రిషి. మరోపక్క వసు మాత్రం మనసులో కలవరం చెందుతూ ఉంటుంది. డీబీఎస్టీ కాలేజ్ బోర్డు తీసేందుకు వసు ప్రయత్నించగా.. రిషి వద్దని వారిస్తాడు. ఎంఎస్ఆర్ రాకముందు కూడా నా మనసులో డీబీఎస్టీ మెడికల్ కాలేజ్ గురించి ఆలోచన ఉంది, ఇప్పుడు అతను లేకపోయినా.. నా మనసులో అదే ఉంది. ఎవరో వచ్చారని, ఎవరో వెళ్లిపోయారని మనం కంగారు పడాల్సిన అవసరం లేదని, మన పని మనం చేసుకుంటూ వెళ్తాం అని చెబుతాడు. డీబీఎస్టీ కాలేజ్ నా డ్రీమ్ అది కచ్చితంగా స్టార్ట్ అవుతుంది. కానీ కొంచెం సమయం పట్టవచ్చు అంటూ రిషి అక్కడ నుంచి వెళ్లిపోతాడు.

రిషి లైట్ తీసుకున్న విషయాన్ని జగతీ, మహేంద్రకు వివరిస్తుంది వసు. రిషి ఏమైనా బాధపడ్డాడా? అని జగతీ.. వసును అడుగుతుంది. బాధైతే లోపల ఉంది కానీ.. బయటకు మాత్రం చూపించలేదు. పైగా నాకు ధైర్యం చెప్పాడని వసు చెబుతుంది. మరోపక్క మహేంద్ర వచ్చిన అవకాశం చేజారిపోయిందని బాధపడుతుండగా.. డీబీఎస్టీ మెడికల్ కాలేజ్ ఎలాగైనా ప్రారంభించాలని, చాలా మంది పేద పిల్లలకు సహాయం చేసినవారమవుతారని జగతీ చెబుతుంది. ఇది అంత సులభం కాదని, సెంట్రల్, స్టేట్ గవర్నమెంట్ల నుంచి పర్మిషన్ తీసుకోవాలని, పైగా ఇంకా చాలా సమస్యలు ఎదురవుతాయని మహేంద్ర అంటాడు. మంచి పనులు చేసేటప్పుడు ఇలాంటి సమస్యలు వస్తాయని, అలా అని ప్రతి సమస్యకు భయపడుతూ అడుగులు వెనక్కేయకూడదని జగతీ చెబుతుంది. రిషి ఆనందం కోసం మనం ఏం చేయాడనికైనా సిద్ధంగా ఉండాలని అంటుంది జగతీ. ఇదంతా బయట నుంచి రిషి వింటూ ఉంటాడు.

జగతీకి థ్యాంక్స్ చెప్పాలనుకున్న రిషి..

మరుసటి రోజు రిషి, వసులు కాలేజ్‌కు బయల్దేరబోతారు. ఇంతలో వసు.. రిషి గుండీలు సరిగ్గా పెట్టుకోలేదని గుర్తు చేస్తుంది. ఇలా అయితే జెంటిల్మెన్ అని ఎలా అంటారు సార్ అంటూ.. గుండీలు పెడుతుంది. నిజం చెప్పండి సార్ మెడికల్ కాలేజ్ గురించి ఆలోచిస్తున్నారు కదూ..! ఇలాగేతై ఎలా సార్ అంటుంది వసు. నా గురించి మీరంతా బాధపడుతున్నారు కదూ.. రాత్రి నువ్వు, మేడమ్ మాట్లాడుకున్న మాటలను విన్నాను. మీరిద్దరూ నా గురించి, కాలేజ్ గురించి ఆలోచిస్తున్నారు. ఏదోకటి చేయాలని తపన పడుతున్నారని అని రిషి అంటాడు. నా తరఫున మేడమ్‌కు థ్యాంక్ చెప్పు అని అనగా.. మీరే చెబితే బాగుంటుందని వసు అంటుంది. నేను చెప్పినా, నువ్వు చెప్పినా ఒకటే వసుధార అని రిషి అంటాడు. కానీ నేను చెప్పేదనికంటే మీరు చెబితేనే మేడమ్ ఎక్కువగా సంతోషిస్తారని వసు అుటుంది.

Whats_app_banner