Guppedantha Manasu April 12 Episode: కిడ్నాప్‌కు గురైన వసు-రిషి.. విలన్ సౌజన్యరావు ఎంట్రీ
Guppedantha Manasu April 12 Episode: గుప్పెడంత మనసు నేటి ఎపిసోడ్‌లో రిషి-వసు కిడ్నాప్‌కు గురవుతారు. కొత్త విలన్ సౌజన్యరావు ఎంట్రీ ఇస్తాడు. రిషి, వసులు కిడ్నాప్ కు గురికావడంతో ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది.
Guppedantha Manasu April 12 Episode: గుప్పెడంత మనసు గత ఎపిసోడ్‌లో రిషి, వసుల మధ్య ప్రేమ మరింత పెరుగుతున్నట్లు చూపించారు. సరదాగా గడిపిన తర్వాత కారులో తిరిగి ఇంటికి ప్రయాణం చేస్తుంటారు. ఆ సమయంలో రిషి వసూతో నీకో విషయం చెప్పాలి వసుధార.. ఎవ్వరితోనూ చెప్పొద్దు అని అంటాడు. చెప్పండి సార్ అని వసు బదులిస్తుంది. నిన్ను వెంటనే పెళ్లి చేసుకోవాలని ఉంది. కొన్ని కొన్ని అణచుకోవడం, కొన్నింటిని ఆపుకోవడం మహా కష్టం అంటూ రిషి సిగ్గుపడతాడు. మరోవైపు వసు కూడా రిషి మాటలకు సిగ్గుపడుతుంది. వీరి మధ్య సంభాషణ జరుగుతుండగా.. ఓ అమ్మాయి సహాయం కోసం అర్థిస్తుంటుంది. కారు ఆపండి అంటూ వేడుకుంటుంది.
వెంటనే ఆమెను చూసి వసు కారు ఆపండి సార్ అంటూ రిషిని అడుగుతుంది. సడెన్ బ్రేక్ వేయగా కారుపై పడుతుంది. వసుధార వాటర్ తీసుకుని రా అని రిషి ఆదేశించడంతో..వసు వాటర్ బాటిల్ తీసుకొచ్చి ఇస్తుంది. అతడు ఆమెకు నీళ్లు ఇచ్చిన తర్వాత అసలు విషయం చెబుతుంది. తనను ఎవరో ఇద్దరూ రౌడీలు తరముతున్నారని, కాపాడాలని వేడుకుంటోంది. ఇద్దరు రౌడీలు అన్నావ్? ఎక్కడ అని ప్రశ్నిస్తాడు. మిమ్మల్ని చూసి ఎక్కడో దాక్కున్నట్లు ఉన్నారు సార్ అని ఆ అమ్మాయి అంటుంది. ఇప్పుడేం భయంలేదు నీ పేరు ఏంటని అడుగ్గా.. త్రివేణి సార్ అని బదులిస్తుంది.
ఇంటి వద్ద డ్రాప్ చేయాలని కోరిన త్రివేణి..
ఇప్పుడే పోలీసులకు కాల్ చేసి చెబుతాను.. జరిగింది అంతా చెబితే వాళ్లే చూసుకుంటారు అని ఫోన్ తీయబోతాడు రిషి. ఆ అమ్మాయి వద్దని వారిస్తుంది. ఎందుకు అని రిషి అడుగ్గా.. సార్ నేను ఉద్యోగం చేయడం మా అమ్మ నాన్నకు ఇష్టం లేదు. ఎంతో కష్టపడి ఒప్పించి చేస్తున్నా. ఇప్పుడు ఈ పోలీసు కేసు అది అంటే వారు నన్ను కచ్చితంగా ఉద్యోగం మానిపిచ్చేస్తారు. నేను ఏ తప్పు చేయకున్నా నన్నే తిడతారు అని సమాధానమిస్తుంది. ఇందుకు రిషి అంగీకరిస్తాడు. త్రివేణి తనను తన ఇంటి వద్ద డ్రాప్ చేయమని కోరుకుంటుంది. అందుకు రిషి, వసు సరేనని ఆమెను కారు ఎక్కించుకుంటారు. జగతీకి కాల్ చేసిన వసు.. మేడమ్ చిన్న పనిపడిందని, ఇంటికి రావడానికి ఆలస్యమవుతుందని చెబుతుంది. హా సరే జాగ్రత్త అంటూ జగతీ ఫోన్ పెట్టేస్తుంది.
అనంతరం త్రివేణి ఇంటి వద్ద రిషి, వసులు డ్రాప్ చేసి వెళ్లిపోబోతారు. అందుకు ఆమె సార్ ఇంట్లోకి వచ్చి కాఫీ తాగి వెళ్లాలని, ప్లీజ్ దయచేసి రండి అంటూ లోపలకు ఆహ్వానిస్తుంది. హాల్లోకి వెళ్లాక వాటర్ తీసుకొస్తాను మేడమ్ అంటూ వెళ్లి నీళ్లు తీసుకొస్తుంది. మీ అమ్మ నాన్న ఎక్కడ అని అడగ్గా.. ఇంట్లో పడుకుని ఉంటారు సార్.. రండి పరిచయం చేస్తాను అంటూ గదిలోకి తీసుకువెళ్తుంది త్రివేణి.
వసు మెడపై కత్తి..
వసు, రిషీలు గదిలో వెళ్తున్నప్పుడు మరో విలన్‌ను పరిచయం చేస్తున్నట్లు చూపిస్తారు. ఆ వ్యక్తం ముఖం కనిపించకుండా చదరంగంపై పావులు కదుపుతూ ఉంటాడు. మరోపక్క త్రివేణి మంచంపై పడుకుని ఉన్నావారిని అమ్మా, నాన్న అని పిలిచి వాళ్లు వచ్చారు లేవండి అంటూ లేపుతుంటుంది. వెంటనే వాళ్లు ముసుగులు తీసి రిషిపై వేసేందుకు ప్రయత్నిస్తారు. ఆ ఘటనకు ఆశ్చర్యపోయిన రిషి.. వెంటనే తేరుకొని ఆ రౌడీలను కొడతాడు. మరోపక్క త్రివేణి సరుగులో ఉన్న కత్తి తీసి వసు మెడపై పెడుతుంది. సార్ రిషి సార్ అంటూ వసు అరుస్తుంది. రిషి షాకయ్యి.. వెనక్కి తిరిగి చూసేసరికి ఆ రౌడీలు రిషిని కదలకుండా పట్టేసుకుంటారు. వెంటనే త్రివేణి, ఫోన్, కారు కీస్ తీసుకోండ్రా అంటూ వారిని ఆదేశిస్తుంది. దీంతో ఆ రౌడీలు రిషి ఫోన్, కారు కీస్ లాక్కుని వెళ్తారు.
విలన్ సౌజన్యరావు ఎంట్రీ..
ఆ తర్వాత వసును మంచం మీదకు తోసేసి..గుమ్మం దాక వెళ్తుంది త్రివేణి. వసు ఆమెను వెంబడించిన గుమ్మం నుంచి లోపలకు తోసేసి గది తలపు పెట్టేస్తుంది. వసుధార నీకేం కాలేదు కదా అని రిషి వసును పైకిలేపుతాడు. మరోపక్క ఈ కిడ్నాప్ అంతా చేయించినా విలన్ సౌజన్యరావును చూపిస్తారు. సార్ ఎవరు వీళ్లంతా అంటూ రిషిని అడుగుతుంది వసు. ఎవరైనా కావచ్చు వసుధార.. అంటూ ఆలోచిస్తాడు. మరోపక్క సౌజన్యరావు రాజు, రాణీలు పక్కకు తోసేసి గట్టిగా నవ్వుతూ.. కంటికి కనిపించని శత్రువులు చాలా మంది ఉంటారు రిషీంద్ర భూషణ్ అని అనుకుంటాడు.
మనం ఎవరికీ అన్యాయం చేయలేదు.. కానీ మనకు ఇలా జరగడమేంటి? అని రిషి వసుతో అంటుంటాడు. ఈ రోజుల్లో మంచి చేసే వాడికే శత్రువులు ఎక్కువైపోతున్నారు మిస్టర్ ఏం చేస్తాం.. కలికాలం అంటూ విలన్ నవ్వడం చూపిస్తారు. మరోపక్క వసు, రిషి బాధపడుతుంటారు. ఏం ఆశించి ఇదంతా చేశారంటావ్ అని రిషితో వసు అంటుంటే.. అధికారం అని విలన్ చెప్పడం కనిపిస్తుంది. ఎందుకు ఈ మధ్య శత్రువులు ఎక్కువయ్యారనిపిస్తుంది అంటాడు రిషి టెన్షన్‌గా. రాజుకు ఎప్పుడూ శత్రువులు ఉంటూనే ఉంటారని నవ్వుతాడు విలన్. రెండు సీన్స్ ఆల్ట్రానేట్‌గా చూపిస్తూ సీన్ ఆసక్తికరంగా మార్చారు.
కిడ్నాప్ చేయించింది ఎవరో నాకు తెలుసు: రిషి
మొన్నటికి మొన్న స్పాట్ వ్యాల్యూషన్‌లో కాలేజ్‌ను ఇరికించాలని చూశారు. ఇప్పుడేమో ఇలా.. వాళ్లే అనిపిస్తోంది అని రిషి వసుతో అంటాడు. నం అప్పుడే కాస్త జాగ్రత్త పడి ఉండాల్సింది. ఎందుకు చేశారో? ఎవరు చేశారో తెలుసుకుని ఉండాల్సింది అంటుంది వసు. వాళ్లు ఎవరో నాకు తెలుసు వసుధారా అంటాడు రిషి. ఆ విలన్ నవ్వుతాడు పెద్దగా.. ‘సార్ మీరేమంటున్నారు?’ అంటుంది వసు. అవును వసుధార... ఆ పని చేయించిన వాళ్లు నాకు తెలుసు.. కానీ సాటి విద్యాసంస్థలను అవమానించకూడదని వదిలేశాను.. కానీ ఆ విశ్వాసంవాళ్లకు లేదు.. మళ్లీ అదే వక్రబుద్ధి చూపించారు. మన కాలేజ్ మీద పై చేయి సాధించాలని ట్రై చేస్తున్నారు అని రిషి చెబుతాడు.
సౌజన్యరావుపై మరో విలన్..
ఇంతలో విలన్ సౌజన్యరావుకు ఓ మెసేజ్ వస్తుంది. ఏమైంది ఇంకా అప్డేట్ రాలేదు? అనేది దాని సారాంశం. చిక్కాల్సిన వాళ్లు చిక్కారు సార్ అని మెసేజ్ చేస్తాడు. అంటే అసలు విలన్ సౌజన్యరావు కాదని, మరొకరు ఉన్నారని తెలుస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ వారు తప్పించుకోకూడదు అని మరో మెసేజ్ వస్తుంది సౌజన్యరావుకు. ఓకేసార్ అంటూ సౌజన్యరావు మెసేజ్ పంపిస్తాడు. ఏం చేయాలో తెలుసుగా? జాగ్రత్త. వాళ్లను అసలు వదలొద్దు అని అవతలి వైపు నుంచి మరో సందేశం వస్తుంది. ఓకేసార్ అని సౌజన్య రావు బదులిస్తాడు. దీన్ని బట్టి చూస్తే విలన్ సౌజన్యరావు కాకుండా అతడిపై మరొకరు ఉన్నారని తెలుస్తుంది. దీంతో వీళ్లిద్దరూ ఈ కిడ్నాప్ నుంచి ఎలా తప్పించుకుంటారా? లేదా ఆసక్తికరంగా ఉంది.