Guppedantha Manasu April 18th Episode: రిషి లైఫ్‌లోకి ఎంటరైన కొత్త విలన్ - దేవయానికి మరో షాక్
Guppedantha Manasu April 18th Episode: రిషి, వసుల ఆనందాన్ని చెడగొట్టడానికి దేవయానికి ఎన్ని ఎత్తులు వేసిన అవి ఫ్లాప్ అవుతూనే ఉన్నాయి. రిషి గదికి వసు వెళ్లకుండా అడ్డుకుంటుంది దేవయాని. కానీ ఆమె మాటలకు ఎదురుచెబుతాడు రిషి. ఆ తర్వాత నేటి గుప్పెడంత మనసు సీరియల్‌లో ఏం జరిగిందంటే...
Guppedantha Manasu April 18th Episode: రిషి, వసుధార లైఫ్‌లోకి మరో కొత్త విలన్ ఎంటరవుతాడు. కాలేజీలో అడుగుపెట్టడంతోనే డీబీఎస్‌టీ కాలేజీ అనే బోర్డ్ వైపు చూస్తూ ఈ బోర్డ్ పీకేసీ ఎమ్ఎస్ఆర్ అని న్యూ బోర్డ్ పెట్టిస్తే ఎలా ఉంటుందని ఊహిస్తూనే మనసులో రిషిపై ఉన్న కోపాన్ని బయటపెడతాడు. ఆ ఊహను నిజం చేసేద్దాం అంటూ అతడు కాలేజీ బిల్డింగ్ లోపలికి అడుగుపెట్టాడు. రిషిని కలిసి తన పేరు ఎం.సౌజన్యరావుగా పరిచయం చేసుకుంటాడు. ఎమ్ఎస్‌ఆర్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్‌కు ఎండీ, చైర్మన్ అని రిషితో చెబుతాడు. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడటానికి వచ్చానని అంటాడు. వచ్చి రావడంతోనే రిషిపై ప్రశంసలు కురిపిస్తాడు ఎంఎస్ఆర్.
రిషికి ఎంఎస్ఆర్ ప్రపోజల్...
ఆ తర్వాత రిషి మెడికల్ కాలేజీ స్థాపిస్తోన్న విషయం తెలుసుకొని అతడితో కలిసి పనిచేయాలనుందని మనసులో మాట బయటపెడతాడు. ఎవరైనా ది బెస్ట్ అనుకున్నవాళ్లతోనే ప్రయాణం చేయాలని అనుకుంటారు. డీబీఎస్‌టీ బెస్ట్ కాలేజీ కావడంతోనే ఇక్కడకు వచ్చానని ఎంఎస్ఆర్ చెబుతాడు.
ఇద్దరం కలిసి పనిచేస్తే పర్మిషన్స్, పనులు తొందరగా పూర్తవుతాయి. అన్ని విషయాల్లో నేను మీకు ప్లస్ అవుతాను. తనకు చాలా బాగా బ్యాక్‌గ్రౌండ్ ఉందని రిషికి నమ్మకం కుదిరేలా మాట్లాడుతాడు. అతడి ఆంతర్యాన్ని గ్రహించని రిషి ఎంఎస్ఆర్ ప్రపోజల్‌కు ఒప్పుకుంటాడు. నెక్స్ట్ మీటింగ్‌లో పేపర్ వర్క్‌పై ఒప్పందాలు చేసుకుందామని అంటాడు. అతడు వెళుతూ ఫీల్డ్‌లో శత్రువులు ఎక్కువగా ఉంటారు జాగ్రత్త అంటూ రిషికి వార్నింగ్ ఇస్తాడు.
క్రెడిట్ కొట్టేసిన దేవయాని...
ఎంఎస్ఆర్ ప్రపోజల్‌ను ఫ్యామిలీ మెంబర్స్ అందరితో పంచుకొని సంతోషపడుతుంది వసుధార. రిషిని జగతి, మహేంద్రతోపాటు మిగిలిన కుటుంబసభ్యులు అందరూ పొగడ్తలతో ఆకాశానికి ఎత్తుతారు. నువ్వు కాలేజీతో పాటు మన వంశానికి ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టావని పొగడుతారు.
నువ్వు ఏ పనిచేయాలని అనుకున్నా మేమంతా అండగా ఉంటామని చెబుతారు. రిషిపై అందరూ పొగడ్తలు కురిపిస్తుండటంతో దేవయాని అసహనంగా ఫీలవుతుంటుంది. కానీ పైకి మాత్రం సంతోషాన్ని నటిస్తూ నువ్వు నా పెంపకంలో పెరగడం చాలా ఆనందంగా ఉంది అంటూ క్రెడిట్ మొత్తం తాను కొట్టేసే ప్రయత్నం చేస్తుంది.
వసుతో రిషి రొమాంటిక్ చాట్...
ఆ తర్వాత వసుధారతో ఫోన్‌లో చాటింగ్ చేస్తాడు రిషి. మరోసారి అతడిలోని రొమాంటిక్ యాంగిల్ బయటకు వస్తుంది. టూడే ఈజ్ ది హ్యాపీయెస్ట్ డే ఆఫ్ మై లైఫ్ అంటూ రిషితో సంతోషాన్ని పంచుకుంటుంది వసు. నువ్వు ఇంకా ఆనంద పడే విషయం ఒకటి చెబుతాను అంటాడు. అయితే ఫోన్‌లో కాకుండా డైరెక్ట్‌గా చెప్పి థ్రిల్ ఇస్తాను. నువ్వు నా గదికి రా అంటూ వసుధారకు మెసేజ్ పెడతాడు. రిషి గదికి ఆనందం వెళ్లడానికి రెడీ అవుతోంది వసుధార.
కానీ మధ్యలో దేవయాని...వసుధారను అడ్డగిస్తుంది. ఈ టైమ్‌లో ఎక్కడికి అంటూ కఠినంగా అడుగుతుంది. రిషి గదికి వెళుతున్నానని వసుధార ఆమెకు సమాధానం చెబుతుంది. తను పిలిస్తే నువ్వు వెళ్లడమేనా....వేళకాని వేళ ఎప్పుడు పడితే అప్పుడు వెళ్లకూడదని తెలియదా అంటూ వసును అడ్డగిస్తుంది. రిషి గదికి వెళ్లకూడదని వార్నింగ్ ఇస్తుంది. కన్నీళ్లతో వసుధార తన గదికి తిరిగి వెళ్లడానికి సిద్ధమవుతోండగా రిషి వస్తాడు.
దేవయానికి రిషి షాక్...
వసుధారను తానే పిలిచాను. మేము కొంచెం మాట్లాడుకోవాలి..అది కూడా ఇప్పుడే...కాలేజీ విషయాలు డిస్కస్ చేసుకోవాలని దేవయానికి గట్టిగా సమాధానం ఇస్తాడు. ఏ విషయమైనా ఆడపిల్ల నీ గదికి రావడం బాగుండదు రిషి అంటూ దేవయానికి తన మాటల్లో తప్పు లేదన్నట్లుగా ప్రవర్తిస్తుంది.
ఇంతలోనే అక్కడికి జగతి ఎంటరై వసు...రిషి గదికి వెళితే తప్పేముంది అంటుంది. వసు పద్దతులు తెలిసిన అమ్మాయి...హద్దు దాటి ప్రవర్తించదు...అలాగే రిషి మీద అనుమానపడితే మీ పెంపకాన్ని మీరు అనుమానించినట్లే అంటూ దేవయానికి క్లాస్ ఇస్తుంది. కానీ దేవయానికి మాత్రం తన పంతం వీడదు. చిన్న విషయాన్ని ఎందుకు పెద్దది చేస్తున్నారంటూ దేవయానిపై రిషి సీరియస్ అవుతాడు. వసు నేను ప్రేమించుకుంటున్నా్, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం అంటూ వసును తన గదికి తీసుకెళతాడు. మరోసారి తన ప్లాన్ ఫ్లాప్ కావడంతో దేవయాని రుసరుసలాడుతుంది.
సంబంధిత కథనం