Guppedantha Manasu April 17th Episode: జీవితాంతం తోడుగా ఉంటానని రిషికి వసు ప్రామిస్ - ఆనందంలో జగతి
Guppedantha Manasu April 17th Episode: శూన్య మాసం కారణంగా వసుతో తన పెళ్లి వాయిదాపడటంతో రిషి బాధపడుతోంటాడు. కాలం తొందరగా పరిగెడితే బాగుండునని వసుధారతో అంటాడు. ఆ తర్వాత నేటి గుప్పెడంత మనసు సీరియల్‌లో ఏం జరిగిందంటే...
Guppedantha Manasu April 17th Episode: రిషికి కాఫీ కలుపుకొని అతడి రూమ్‌కు వెళుతుంది వసుధార. ఆమె తన రూమ్‌లోకి అడుగుపెట్టగానే వెంటనే డోర్ క్లోజ్ చేస్తాడు రిషి. వసు దగ్గరకు వస్తుంటాడు. ఆమె మాత్రం అతడికి దూరంగా వెళ్లిపోతుంది. ఇద్దరు రొమాంటిక్ మూడ్‌లోకి వెళ్లిపోతారు. శూన్య మాసం ఎప్పుడు అవుతుందో ఏంటో మనసు రకరకాలు ఆలోచిస్తుంది. దేని కోసమే పరితపిస్తుందని రిషి ప్రేమ మైకంలో మునిగిపోయి వసుతో రొమాంటిక్ డైలాగ్స్ చెబుతాడు. శూన్య మాసం కారణంగా పెళ్లి వాయిదాపడటంతో రిషి బాధపడిపోతుంటాడు.
భయపడ్డ వసుధార...
తమ రూమ్ దగ్గరకు ఎవరో వస్తుండటంతో వసుధార భయపడుతుంది. కంగారు పడాల్సిన పనిలేదు. మనకు పెళ్లి జరుగబోతుందని అంటాడు. అతడి మాటలకు పెళ్లి జరుగబోతుంది కానీ జరగలేదు కదా. జరుగబోవడానికి, జరగడానికి చాలా తేడా ఉంది. అప్పటివరకు ఇలా దగ్గరకు రావడాలు బాగుండవంటూ రిషితో వసుధార అంటోంది.
దాంతో పెళ్లి వరకు ఎంత నీ నుంచి డిస్టెన్స్ మెయింటేన్ చేయాలో చెప్పు అంటూ వసుపై సెటైర్స్ వేస్తాడు రిషి. దాంతో కొన్నింటికి లెక్కలు ఉండవు అంటూ వసుధార తన దైన శైలిలో తెలివిగా సమాధానాలు చెబుతుంది. వసుధార తెచ్చిన కాఫీని వసుధారకు షేర్ చేసి ఇస్తాడు రిషి.
ఇద్దరు కలిసి కాఫీ తాగుతారు. కాఫీ తాగుతోండగా ఫస్ట్ టైమ్ కాలం పరిగెడితే బాగుండూ అనిపిస్తోంది. నువ్వు నేను ఒకే చోట, ఒకే గదిలో...ఆ క్షణం త్వరగా రావాలి అంటూ రిషి కోరుకుంటాడు. అతడి మాటలకు వసుధార సిగ్గుపడుతుంది.
సంతోషంలో జగతి...
జగతి సంతోషంలో మునిగిపోవడంతో ఏంటి మేడమ్ ఫేస్‌లో ఆనందం కనిపిస్తోందని మహేంద్ర ఆమెను అడుగుతాడు. అతడి నోట్లో చక్కెర పోసి నోరు తీపి చేస్తుంది. రిషి, వసు పెళ్లి విషయంలోనే సంతోషంగా ఉన్నట్లు జగతి చెబుతుంది. వారి పెళ్లి ఎలాంటి ఆటంకాలు వస్తాయో, దేవయాని ఏ ఇబ్బందులు గురిచేస్తుందో అనే టెన్షన్ ఉండేది. కానీ రిషి..దేవయానిని నోరు ఎత్తకుండా చేశాడు, తనకు సరైన రీతిలో సమాధానం చెప్పాడంటూ జగతి సంతోషంతో పొంగిపోతుంది.
ఆమె సంతోషంలో ఉండగా రిషి, వసుధారల పెళ్లి నువ్వు అమ్మగా చూసేంత వరకు అవుతుంది అంటూ మహేంద్ర అంటాడు. దగ్గరుండి పెళ్లి చేసే అవకాశం రాదేమో అనగానే అప్పటివరకు ఆనందంగా ఉన్న జగతి ఎమోషనల్ అవుతుంది. దగ్గరుండి పెళ్లి చేసే అవకాశం వస్తే ఒక అమ్మగా అంతకుమించిన అదృష్టం ఏమి ఉండదు. కానీ రిషి ఇవ్వడు అంటుంది.
రిషికి వసు థాంక్స్...
దేవయానికి వేసినప్లాన్ నుంచి తనను కాపాడిన రిషికి థాంక్స్ చెబుతుంది వసుధార. నా జీవితంలో చేదు అనుభవాలన్నీ మీ ఊరిలో జరిగిన సంఘటనలు మాత్రమే అని వసుతో చెబుతాడు రిషి . పాత గొడవల్ని గుర్తుచేసుకుంటాడు. వాటి వల్లే ఇద్దరం ఎంతోబాధను అనుభవించామని చెబుతాడు.
వాటిని అధిగమించి ఇక్కడకు చేరుకున్నామని, ఆ చేదు జ్థాపకాల్ని ఎప్పుడు గుర్తుచేసుకోవద్దని వసుతో అంటాడు. నువ్వు ఎప్పుడు నా పక్కనే ఉండాలి. నిన్ను ఒంటరిగా ఒక్క క్షణం ఎక్కడికి పంపించనని అంటాడు రిషి. అతడి మాటలకు మిమ్మల్ని వదిలి ఎక్కడికి పోనని వసుధార అంటుంది.
మినిస్టర్ ప్రశంస...
రిషి, వసులను కిడ్నాప్ చేయడానికి శత్రువులు ప్రయత్నించిన విషయం తెలుసుకున్న మినిస్టర్ రిషికి కాల్ చేస్తాడు. ఆ శత్రువుల పేర్లు చెప్పమని అడుగుతాడు. కానీ విద్యార్థుల క్షేమం తనకు ముఖ్యమంటూ రిషి వారి పేర్లు చెప్పడు.
మరి ఏం చేయాలని అనుకుంటున్నావని అడగ్గా మళ్లీ వాళ్లు రిషింద్రభూషన్ వైపు కన్నెత్తి చూడాలంటే భయపడేలా బదులిస్తానంటూ మినిస్టర్‌తో రిషి అంటాడు. రిషి మంచితనాన్ని మినిస్టర్ పొగడడంతో నేటి గుప్పెడంత మనసు ఎపిసోడ్ ముగిసింది.