Guppedantha Manasu Today Episode: జగతీకి సారీ చెప్పిన రిషి.. వసు ప్లాన్ వర్కౌట్ అవుతుందా? -rishi asked sorry to jagathi in guppedantha manasu today 2023 march 29 episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Guppedantha Manasu Today Episode: జగతీకి సారీ చెప్పిన రిషి.. వసు ప్లాన్ వర్కౌట్ అవుతుందా?

Guppedantha Manasu Today Episode: జగతీకి సారీ చెప్పిన రిషి.. వసు ప్లాన్ వర్కౌట్ అవుతుందా?

Maragani Govardhan HT Telugu
Mar 29, 2023 12:46 PM IST

Guppedantha Manasu Today Episode: గుప్పెడంత మనసు ఈ రోజు ఎపిసోడ్‌లో రిషి-వసుధార తమ గత సన్నివేశాలను రీక్రియేట్ చేశారు. ఇందులో భాగంగా ఇద్దరూ తమ నటనతో ఆకట్టుకున్నారు. జగతీకి రిషి సారీ కూడా చెబుతాడు.

గుప్పెడంత మనసు
గుప్పెడంత మనసు

Guppedantha Manasu Today Episode: గుప్పెడంత మనసు నిన్నటి ఎపిసోడ్‌లో టైమ్ మెషిన్‌లో వెనక్కి వెళ్లినట్లుగా అప్పటి వసుధార, అప్పటి రిషిల్లా మారిపోదామని వసు ఐడియా ఇచ్చింది. దాతో రిషి కూడా సరే అంటా. అయితే ఇందులో కొన్ని కండీషన్స్ పెట్టుకుంటారు. ఉదయం తొమ్మిది నుంచి రాత్రి ఏడు గంటల వరకు మాత్రమే పాత రిష, వసుల్లా ఉండాలని, మిగిలిన టైమ్‌లో మాములుగా ఉండాలని ఒప్పందం కుదుర్చుకుంటారు. ఇక నేటి కథనంలో రిషి కళ్లజోడు పెట్టి, సూట్ వేసుకుని మెట్లు దిగుతుంటే అప్పటి రిషీని చూపిస్తూ కథను లింక్ చేశారు. రిషి కిందకు దిగే సరికి.. ధరణీ దగ్గరకు వచ్చి.. చిన్న మావయ్యగారు, చిన్న అత్తయ్యగారు, వసుధార కాలేజ్‌కు వెళ్లిపోయారు రిషీ.. నీకు చెప్పమన్నారు అని అంటుంది. అవునా వదినా.. సరే అయినే నేను వెళ్తాను అనేసి బయల్దేరుతూ వసును తలచుకుంటాడు. ఈ వసూ అల్రేడీ క్యారెక్టర్‌లో వెళ్లినట్లు ఉంది ఇట్స్ బిగెన్ అని మెసేజ్ చేస్తాడు.

మహేంద్ర కారులో కూర్చుని ఉన్న వసు ఆ మెసేజ్‌ను చూసి ఎస్ సార్ అని రిప్లయి ఇస్తుంది. ఇక వసును వెనక్కి తిరిగి చూసిన జగతీ.. "ఏంటి ఈ రోజు వసు కొత్తగా ప్రవర్తిస్తోంది.. రిషితో కాకుండా మాతో కారులో వస్తుంది. కారణం అడిగితే ఏం చెప్పలేదు.. ఏమై ఉంటుంది. వాళ్లి ద్దరూ ఏమైనా గొడవ పడ్డారా? అని ఆలోచిస్తూ.. వసు ఆర్ యూ ఓకే" అని అంటుంది. హా మేడమ్ ఎందుకు అలా అడుగుతున్నారని ప్రశ్నిస్తుంది. ఇందుకు జగతి కూడా ఏం లేదని బదులిస్తుంది.

సీన్ కట్ చేస్తే కాలేజ్‌లో వసు పక్కన నుంచి చాలా వేగంగా ఓ కారు వచ్చి ఆగుతుంది. అది రిషి కారే. వసు అప్పటిలో ఆ కారు వెనక పరుగుతీసినట్లుగా.. ఈ కారు వెనక పరుగుతీస్తుంది. అందులో నుంచి రిషి అప్పటిలాగానే కళ్లజోడు పెట్టుకుని చాలా ఆటిట్యూడ్‌తో కిందకు దిగుతాడు. సార్ సార్.. ఐయామ్ వసుధార.. ఫ్రమ్ విద్యా వికాస్ కాలేజ్ అని అంటుంది. అయితే? అంటాడు రిషి. చాలా మంది అనుకుంటారు కానీ.. అందరికీ అవకాశం దొరకాలి కదా? అంటాడు రిషి కోపంగా. నేను ఆ అవకాశం ఇవ్వమని అడగడానికే వచ్చాను సార్. అంటుంది వసు. మనం అడగ్గానే సరిపోదు.. అడిగింది అందుబాటులో ఉండాలి అంటాడు రిషి.

గతానికి వెళ్లిన రిషి-వసుధార..

మీరు తలచుకుంటే అన్నీ అందుబాటులోకి వస్తాయి సార్ అని వసు బదులిస్తుంది. 'ఎక్స్‌క్యూజ్ మీ.. మీ అడ్మీషన్ అప్లికేషన్ బ్లాక్‌లో ఇవ్వండి. అన్నీ బాగానే ఉంటే వాళ్లే కాల్ చేస్తారు' అంటూ రిషి వెళ్లబోతాడు. సార్ సార్ అంటూ వసూ వెంటబడుతుంది. సార్ ఈ కాలేజ్ చాలా గొప్పదని మా జగతీ మేడమ్ చెప్పారు అనగానే రిషికి జగతీ గుర్తొస్తుంది. (నేను నాన్న మీ అమ్మను అంటూ జగతీ ఏడుస్తూ చెబుతుంటే.. నాకు అమ్మలేదు.. మా అమ్మ ఎప్పుడో పోయింది.. చచ్చిపోయింది అంటూ రిషి మాట్లాడిన మాటలు గుర్తుకువస్తాయి) రిషి ఆ ఎమోషన్‌లో ఉండగానే వసు మాట్లాడటం మొదలుపెడుతుంది. ఇక్కడ యాజమాన్యానికి చూపించమని లెటర్ కూడా ఇచ్చారు. ప్లీజ్ ఒప్పుకోండి అంటుంది. వసు నా కాలేజ్‌కు రికమండేషన్స్‌కు సంబంధం లేదు అంటూ వెళ్లబోతాడు గతంలో మాదిరిగానే. దాంతో వసు వెనకనే ఉండి.. ఒక్కసారి మా జగతీ మేడమ్ పంపిన లెటర్ చూడండి అనగానే వసు చేతుల్లోని లెటర్ లాక్కుని ముక్కలు చేసి వసు మీదకే ఎగరేస్తాడు. ఇంకోసారి ఆవిడ పేరు చెప్పి ఈ కాలేజ్‌లో జాయిన్ అవ్వాలని ప్రయత్నించకు అనేసి కోపంగా అక్కడి నుంచి వెళ్లబోతుంటే ఎదురుగా జగతీ నిలుచుని ఉంటుంది. రిషికి గిల్టీగా అనిపిస్తుంది.

జగతీకి సారీ చెప్పిన రిషి..

రిషికి తన ప్రవర్తనపై తనకే కోపం వస్తుంది. 'ఆ పేరు(జగతీ) వింటే అప్పుడు కోపం, ద్వేషం.. కానీ ఇప్పుడు లేవు. పైగా గౌరవం ఏర్పడింది. రెస్పెక్ట్ పెరిగింది. తప్పు ఇప్పుడు జగతీ మేడం అనగానే కోపం తెచ్చుకోవడం తప్పు.. అది సరైంది కాదు.. ఎందుకంటే ఆమె అంటే డాడ్‌కు ప్రాణం.. ఈ కాలేజ్ పరువు' అని మనసులో అనుకుంటూ జగతీ దగ్గరకు వెళ్లి.. ఐయామ్ సారీ మేడ్మ.. ఐయామ్ రియల్లీ సారి అంటూ అనేసి అక్కడ నుంచి వెళ్లిపోతాడు.

ఆ తర్వాత జగతీ.. వసు దగ్గరకు వచ్చి ఏం జరిగిందని అడుగుతుంది. రిషి ఎందుకు సారి చెబుతున్నాడు? ఎందుకు అలా ఉన్నాడు? నువ్వు ఎందుకు ఇలా ఉన్నావ్? అసలు మీ మధ్య ఏం జరుగుతోంది? నువ్వు రిషితో కాకుండా మాతో కలిసి కాలేజ్‌కు ఎందుకు వచ్చావ్? అంటూ ప్రశ్నల వర్షాన్ని కురిపిస్తుంది. అయితే రిషితో కుదుర్చుకున్న ఒప్పందం గుర్తొచ్చి.. అంతా మంచికే మేడమ్.. తెలియాల్సిన రోజు కచ్చితంగా తెలుస్తుంది. అంటూ మాట దాటేస్తుంది. ఓ పక్క జగతీకి మాత్రం ఆందోళన పెరుగుతుంది. ఇదే విషయాన్ని మహేంద్రతో చర్చిస్తుంది. మన పెద్దరికం పాత్రను ఇంకా బాధ్యతగా నిర్వహించాలి మహేంద్ర అంటూ కంగారు పడుతుంది. ఇప్పుడు మీటింగ్ ఉంది కదా.. వారిద్దరిని గమనిద్దాం పదా అంటూ మీటింగ్‌కు వెళ్తారు.

అయితే అక్కడ రిషి, వసు కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. ఒకరితో ఒకరు సూచనలు, సలహాలు ఇచ్చుకుంటూ మీటింగ్ పూర్తి చేస్తారు. అది చూసిన జగతీ, మహేంద్ర వీళ్లు మనకు అర్థం కారను తలపట్టుకుంటారు. సీన్ కట్ చేస్తే రిషి గ్రౌండ్‌లో బాస్కెట్ బాల్ ఆడుతుంటాడు. వసు వెళ్లగా.. ఎంటీ ఇలా వచ్చావ్ అని అడుగుతాడు రిషి. గ్రౌండ్‌కు ఆడటానికే కాదు సార్.. చూడటానికి కూడా వస్తారు అని అంటుంది. ఆడటానికి ఆసక్తి ఉంటే నేర్పిస్తాను రిషి అంటాడు. ఈ సీన్ కూడా గతంలో జరిగింది. అయితే ఇద్దరి మధ్య అప్పుడు ప్రేమ లేదు. వసు కూడా ఆడేందుకు సై అంటుంది. నేర్పించే క్రమంలో ఇద్దరు చాలా దగ్గరగా రావడంతో రొమాంటిక్ ఫీలింగ్ మొదలవుతుంది. ఆడి ఇద్దరు అలిసిపోయి రెస్ట్ తీసుకుందామని అనుకుంటారు.

రిషి చెమటలను వసు తన చున్నీతో తుడుస్తూ ఉంటుంది. హేయ్ వద్దొద్దు అంటాడు. ఏం సార్ ఏమైంది? అని వసు అంటుంది. మనం ఇంకా ప్రేమించుకోలేదు అంటాడు రిషి.. హూ.. ఈ చిన్న సాయానికి ప్రేమ కావాలా సార్ అని వసు ప్రశ్నిస్తుంది. కానీ నువ్వు ప్రేమతోనే ఈ సాయం చేస్తున్నావ్ అంటాడు రిషి. సార్ నిజమే మనం గతంలో ప్రేమించుకోలేదు. కానీ ఇప్పుడు మనలో మన మనస్సులో ప్రేముంది. దానికి కావాల్సింది నమ్మక సార్. రెండు అక్షరాల ప్రేమకు కావాల్సింది . రెండు అక్షరాల ప్రేమను మూడు ముళ్ల వరకు తీసుకెళ్లేది నమ్మక. ఇది మనం ఎన్నో సార్లు చెప్పుకున్నాం సార్ అని అంటుంది వసు.

ఇక రిషి రాత్రి ఇంటికి వచ్చేసరకి వసు తన రూమ్‌లో ఉండదు. ఈ పొగరు రూమ్‌లో లేదేంటి? ఎక్కడకు వెళ్లినట్లు? అనే ఆలోచనలో పడతాడు రిషి. రిషి అలా అన్నందుకు.. ఇలా కూడా దూరంగా ఉండాలని, కొంపదీసి ఇల్లు వదిలి వెళ్లిపోయిందో ఏమో? అని అనుకుంటాడు. ఏదేతైనేం జగతీకి రిషిని దగ్గర చేసేందుకు వసు ప్లాన్ వర్కౌటుతున్నట్లు తెలుస్తోంది. ఈ రోజు ఎపిసోడ్‌లో జగతీకి రిషి సారీ చెప్పడమే ఇందుకు నిదర్శనం.

Whats_app_banner