Guppedantha Manasu Today episode: పాత గొడవల్ని మర్చిపోనున్న రిషి, వసుధార - ఒక్కటయ్యేందుకు కొత్త ప్లాన్
Guppedantha Manasu Today episode: తమ మధ్య ఉన్న గొడవల్ని మర్చిపోయి పాత రోజుల్లో ఉన్నట్లుగా సంతోషంగా ఉండాలని ఫిక్స్ అవుతారు రిషి, వసుధార. ఇందుకోసం ఒకరికొకరం మళ్లీ కొత్తగా పరిచయమవుదామని అంటుంది వసుధార. ఈ కొత్త జర్నీ కోసం వారు చేసుకున్న ఒప్పందాలేమిటన్నది నేటి గుప్పెడంత మనసు ఎపిసోడ్‌లో చూడాల్సిందే
Guppedantha Manasu Today episode: రిషి (Rishi), వసుధార డీబీటీఎస్ కాలేజీ గ్రౌండ్‌లో కూర్చొని మనసు విప్పి మాట్లాడుకుంటుంటారు. తమ జీవితంలోని సంతోషకర క్షణాలను తలచుకుంటుంటారు. మీరు సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలని వసుధార అడిగిన ప్రశ్నకు రిషి ఎమోషనల్‌గా సమాధానం చెప్పాడు. గొడవలు మర్చిపోయి పాత రోజుల్లో ఉన్నట్లుగా ఉండాలని అనిపిస్తోంది.
అప్పుడు నిన్ను చూస్తే ఏదైతే ఫీలింగ్ కలిగేదో ఆ ఫీలింగ్ కావాలని అనిపిస్తోంది. అప్పుడు నీతో మాట్లాడేటప్పుడు నా హార్ట్‌బీట్ ఎలా ఉండేదో ఆ గుండె చప్పుడు ఇప్పుడు వినాలని అనుకుంటున్నానని రిషి అంటాడు. ఆ రిలేషన్, బాండ్, స్వచ్ఛత అన్నింటికి మించి ఆ ఆనందం ఇప్పుడు కోరుకుంటున్నాను ఇవ్వగలవా అంటూ వసుధారను కోరుతాడు రిషి.
వసుధార కొత్త ఒప్పందం
ఆ పాత రోజుల కోసం ఓ ఒప్పందం చేసుకుందాం అంటూ రిషి ముందు కొత్త ప్రతిపాదనను పెడుతుంది వసుధార. మన రిలేషన్ మళ్లీ కొత్తగా మొదలుపెడదామని అంటుంది. . ఫస్ట్ టైమ్ తనను కలిసినప్పుడు ఎలా ఉండేవారో అలా ఉండండి అంటూ చెబుతుంది.
ఇద్దరం ఒకరికొకరం మళ్లీ కొత్తగా పరిచయం అవుదామని చెబుతుంది. ఆమె మాటలకు కన్ఫ్యూజ్ అయిన రిషి ఇప్పటి వరకు జరిగింది మర్చిపోమంటావా అని డుగుతాడు. మర్చిపోదాం అంటూ రిషిని కన్వీన్స్ చేస్తుంది వసుధార. మనం తలుచుకుంటే అసాధ్యం అంటూ ఏది ఉండదు అంటూ వసుధార పెద్ద డైలాగ్స్ చెబుతుంది.
ఈ సారి మన ప్రయాణంలో తప్పటడుగులు ఉండకూడదని రిషితో చెబుతుంది. కొత్త వసుధార, కొత్త రిషిలా రేపే మనం కొత్తగా కలవబోతున్నాం అని చెబుతుంది. చివరి వసుధార ఒప్పందాన్ని రిషి అంగీకరిస్తాడు.
రిషి, వసుధార కథ మళ్లీ మొదలు...
రిషి వల్లే డీబీఎస్‌టీ కాలేజీ తలెత్తుకొని నిలబడింది అంటూ జగతి అతడిపై ప్రశంసలు కురిపిస్తుంటుంది. దేవయాని కూడా రిషిని పొగడ్తల్లో ముంచెత్తుతుంది. కానీ ఆ పొగడ్తలు చెందాల్సింది తనకు కాదు వసుధారకు అంటూ రిషి చెబుతాడు వసుధార లేకపోతే డీబీఎస్‌టీ కాలేజీకి చెరగని మచ్చ వచ్చేది అంటూ ఆమెను పొగడుతాడు. కానీ ఆ క్రెడిట్ తాను తీసుకోవడానికి ఇష్టపడని వసుధార ...జగతి పేరు చెబుతుంది.
కాల పరీక్షలో నెగ్గుతారా...
రిషి, వసుధార ఒకరి గురించి మరొకరు ఆలోచిస్తూ పన్నెండు గంటలు ఎప్పడవుతుందా అని ఎదురుచూసి కలుసుకుంటారు. వారి మనసులే కాదు మాటలు కూడా కలిసిపోతాయి. గతంలోకి వెళ్లాలంటే ఆందోళన కలుగుతుంది అని భయపడతాడు రిషి. ప్రేమ, బంధానికి కాలం అగ్ని పరీక్ష పెడుతోంది. అందులో మనం నెగ్గాలి అంటాడు. . ఖచ్చితంగా మనం నెగ్గుతాం అంటుంది వసుధార.
గతంలో ఉన్నట్లుగా ఉండాలంటే ప్రస్తుతాన్ని పక్కనపెట్టాలని రిషి సూచిస్తాడు. మన మధ్య ఉన్న ఒప్పందాన్ని గురించి ఎవరికీ చెప్పకూడదని అందుకు రిరికొన్ని కండీషన్స్ పెడతాడు రిషి. వాటికి వసుధార ఒప్పుకుంటుంది. ఆమెకు బెస్ట్ ఆఫ్ లక్ చెప్పి వెళ్లబోతున్న రిషిని వెనక నుండి వాటేసుకుంటుంది వసుధార.
ఎంతకు వదలదు. ఆమె ప్రేమ చూసి రిషి కరిగిపోతాడు. వసుధార ఏంటింది అని అడిగితే ప్రేమ అంటూ చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోవడంతో నేటి గుప్పెడంత మనసు ఏపిసోడ్ ముగిసింది. వారి కొత్త ప్రయాణం ఎలా సాగుతుందో చూడాల్సిందే...