తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ai In Movies: ఏఐ చేస్తున్న మాయ.. ముసలి హీరోలు కూడా కుర్రాళ్లుగా.. బిగ్ బీయే కాదు వీళ్లు కూడా..

AI in movies: ఏఐ చేస్తున్న మాయ.. ముసలి హీరోలు కూడా కుర్రాళ్లుగా.. బిగ్ బీయే కాదు వీళ్లు కూడా..

Hari Prasad S HT Telugu

22 April 2024, 16:32 IST

google News
    • AI in movies: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మాయ చేస్తోంది. సినిమాల్లో ముసలి హీరోలను కూడా కుర్రాళ్లుగా చూపిస్తోంది. తాజాగా కల్కి 2898 ఏడీ మూవీ కోసం అమితాబ్ బచ్చన్ కూడా యువకుడిలా మారిపోయాడు.
ఏఐ చేస్తున్న మాయ.. ముసలి హీరోలు కూడా కుర్రాళ్లుగా.. బిగ్ బీయే కాదు వీళ్లు కూడా..
ఏఐ చేస్తున్న మాయ.. ముసలి హీరోలు కూడా కుర్రాళ్లుగా.. బిగ్ బీయే కాదు వీళ్లు కూడా..

ఏఐ చేస్తున్న మాయ.. ముసలి హీరోలు కూడా కుర్రాళ్లుగా.. బిగ్ బీయే కాదు వీళ్లు కూడా..

AI in movies: అదీ ఇదీ అని కాదు అన్ని రంగాల్లోనూ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఊహించని మాయ చేస్తోంది. తాజాగా కల్కి 2898 ఏడీ మూవీ కోసం అమితాబ్ బచ్చన్ ను ఓ యువకుడిగా చూపించడం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. బిగ్ బీయే కాదు.. గతంలో చాలా మంది హీరోలను ఈ ఏఐ యువకులుగా మార్చేసింది. వాళ్లెవరో చూడండి.

సినిమాల్లో ఏఐ మాయ

సినిమా హీరోల వయసును డిజిటల్ గా తగ్గించడం కొన్నేళ్లుగా కొనసాగుతోంది. తాజాగా అశ్వత్థామ పాత్ర కోసం అమితాబ్ ఏఐ లుక్ అభిమానుల్లో ఆసక్తి రేపింది. ఈ ఏఐ వల్ల సదరు పాత్రల గతాన్ని చూపించే సమయంలో వేరెవరినో చూపించాల్సిన అవసరం లేకుండా ఆ నటులే అప్పట్లో ఎలా ఉన్నారో ఆ రూపాన్ని తిరిగి తీసుకురాగలుగుతున్నారు. ఈ నేపథ్యంలో గతంలో ఇలా ఏఐ ద్వారా స్క్రీన్ పై వయసు తక్కువగా కనిపించిన హీరోలు ఎవరో చూద్దాం.

ఆమిర్ ఖాన్ - పీకే, లాల్ సింగ్ చద్దా

బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ ఈ ఏఐ ద్వారా తన రెండు సినిమాల్లో వయసు తక్కువగా కనిపించాడు. రెండేళ్ల కిందట వచ్చిన లాల్ సింగ్ చద్ధా ఒకటి కాగా.. అంతకుముందు పీకే మూవీలోనూ డిజిటల్ టచప్ ద్వారా ఆమిర్ వయసు తగ్గించారు. దీనివల్ల స్క్రీన్ పై ఆమిర్ ఖాన్ ఓ యువకుడిగా కనిపించాడు.

హ్యారిసన్ ఫోర్డ్ - ఇండియానా జోన్స్, డయల్ ఆఫ్ డెస్టినీ

గతేడాది 81 ఏళ్ల హ్యారిసన్ ఫోర్డ్ ను మూవీలో ఫ్లాష్‌బ్యాక సీన్ కోసం వయసు తగ్గించి చూపించారు. దీనివల్ల అతడు 35 ఏళ్ల కిందట తాను ఎలా ఉండేవాడో అలా ఈ మూవీలో కనిపించాడు.

సల్మాన్ ఖాన్ - భారత్ మూవీ

బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కూడా భారత్ మూవీ కోసం యువకుడిలా కనిపించాడు. ఈ సినిమాలో 8 ఏళ్ల వయసు నుంచి 70 ఏళ్ల వరకూ అతని జీవితం సాగుతుంది. అందుకు తగినట్లే ఏఐ సాయంతో సల్మాన్ లుక్ మార్చేశారు.

బ్రాడ్ పిట్ - ది క్యూరియస్ కేస్ ఆఫ్ బెంజమిన్ బటన్

ది క్యూరియస్ కేస్ ఆఫ్ బెంజమిన్ బటన్ మూవీ కోసం హాలీవుడ్ నటుడు బ్రాడ్ పిట్ ను కూడా డిజిటల్ డీ ఏజింగ్ చేశారు. ఈ సినిమాకు బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ కింద ఆస్కార్ కూడా రావడం విశేషం.

షారుక్ ఖాన్ - డంకీ

గతేడాది షారుక్ ఖాన్ నటించిన మూవీ డంకీ. ఈ మూవీలోనూ షారుక్ రెండు వేర్వేరు కాలాల్లోని పాత్రలను పోషించాడు. అందులో యువకుడిగా ఉన్నప్పటి పాత్ర కోసం డిజిటల్ గా అతని ముఖంలో మార్పులు చేశారు.

ఇవే కాదు తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి నటిస్తున్న ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మూవీలోనూ అతన్ని యువకుడిగా ఉన్నప్పటిటా చూపించడానికి ఏఐ సాయం తీసుకుంటున్నారు.

తదుపరి వ్యాసం