తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Animal Day 9 Collections: యానిమల్ సినిమా బాక్సాఫీస్ ర్యాంపేజ్.. దంగల్‍ను బీట్ చేసిన మూవీ.. 9 రోజుల్లో ఎన్ని కోట్లంటే!

Animal Day 9 Collections: యానిమల్ సినిమా బాక్సాఫీస్ ర్యాంపేజ్.. దంగల్‍ను బీట్ చేసిన మూవీ.. 9 రోజుల్లో ఎన్ని కోట్లంటే!

10 December 2023, 19:11 IST

google News
    • Animal Movie 9 days Collections: యానిమల్ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. రెండో వీకెండ్‍లోనూ భారీగా వసూళ్లను రాబట్టింది. వివరాలివే..
Animal Day 9 Collections: యానిమల్ సినిమా బాక్సాఫీస్ ర్యాంపేజ్
Animal Day 9 Collections: యానిమల్ సినిమా బాక్సాఫీస్ ర్యాంపేజ్

Animal Day 9 Collections: యానిమల్ సినిమా బాక్సాఫీస్ ర్యాంపేజ్

Animal Movie 9 days Collections: బాలీవుడ్ స్టార్ రణ్‍బీర్ కపూర్ హీరోగా నటించిన యానిమల్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఇప్పట్లో తుఫాన్ ఆపేలా కనిపించడం లేదు. డిసెంబర్ 1వ తేదీన రిలీజ్ అయిన ఈ చిత్రం.. ఇప్పటికీ జోరుగా వసూళ్లను దక్కించుకుంటోంది. రెండో వీకెండ్‍లోనూ అదరగొట్టింది. యానిమల్‍కు 9వ రోజైన శనివారం కూడా భారీగా కలెక్షన్లు వచ్చాయి. ఈ లెక్కలను ఆదివారం (డిసెంబర్ 10) వెల్లడించింది మూవీ యూనిట్.

యానిమల్ సినిమా ప్రపంచవ్యాప్తంగా 9 రోజుల్లో రూ.660.89కోట్ల గ్రాస్ కలెక్షన్లను దక్కించుకుంది. 9వ రోజైన శనివారం రూ.60కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి. రెండో వీకెండ్ శనివారంలోనూ ఈ మూవీ దుమ్మురేపింది. సరైన పోటీ లేకపోవడం కూడా యానిమల్‍కు కలిసివస్తోంది. ఇక, ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక గ్రాస్ సాధించిన బాలీవుడ్ చిత్రాల్లో టాప్-10లోకి అడుగుపెట్టింది యానిమల్.

దంగల్‍ను దాటేసి..

ఇండియాలోనే యానిమల్ సినిమా 9 రోజుల్లో రూ.395.27 కోట్ల నెట్‍ కలెక్షన్లను దక్కించుకుంది. అన్ని భాషల వెర్షన్‍లను కలిపి దేశంలో ఈ వసూళ్లను రాబట్టింది. ఆమిర్ ఖాన్ హీరోగా నటించిన దంగల్ (2016) సినిమాను ఇండియా వసూళ్ల విషయంలో దాటేసింది యానిమల్. దంగల్ చిత్రం ఇండియాలో రూ.387.38 కోట్ల నెట్ కలెక్షన్లను దక్కించుకుంది. ఇప్పుడు దంగల్ ఇండియా లైఫ్ టైమ్ కలెక్షన్లను యానిమల్ 9 రోజుల్లోనే దాటేసింది. విదేశాల్లోనూ యానిమల్ దుమ్మురేపుతోంది. ఆదివారమైన 10వ రోజు కూడా యానిమల్ సినిమాకు కలెక్షన్లు భారీగా వచ్చే ఛాన్స్ ఉంది.

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన యానిమల్ చిత్రంలో రణ్‍బీర్ కపూర్, రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా నటించారు. అనిల్ కపూర్, బాబీ డియోల్, తృప్తి డిమ్రి కీలకపాత్రలు చేశారు.

ఓవర్ డోస్ వైలెన్స్, బోల్డ్ సీన్లు, బూతులు ఎక్కువగా ఉన్నాయని యానిమల్ చిత్రంపై కొందరు విమర్శలు చేస్తున్నారు. అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ మూవీకి మాత్రం కలెక్షన్లు భారీ స్థాయిలో వస్తూనే ఉన్నాయి. రెండో వారం కూడా జోరు కనబరిచింది. తండ్రిని కాపాడుకునేందుకు ఏమైనా చేసేందుకు, ఎవరినైనా చంపేందుకు వెనుకాడని కొడుకు పాత్రను ఈ చిత్రంలో చేశారు రణ్‍బీర్.

తదుపరి వ్యాసం