Tripti Dimri on Spirit: ప్రభాస్ సినిమాలో నటించనున్నారా? రూమర్లపై స్పందించిన యానిమల్ బ్యూటీ తృప్తి డిమ్రి-nothing as of now tripti dimri reacts on rumors of she acting with prabhas in spirit movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Tripti Dimri On Spirit: ప్రభాస్ సినిమాలో నటించనున్నారా? రూమర్లపై స్పందించిన యానిమల్ బ్యూటీ తృప్తి డిమ్రి

Tripti Dimri on Spirit: ప్రభాస్ సినిమాలో నటించనున్నారా? రూమర్లపై స్పందించిన యానిమల్ బ్యూటీ తృప్తి డిమ్రి

Chatakonda Krishna Prakash HT Telugu
Dec 10, 2023 04:20 PM IST

Tripti Dimri on Spirit: యానిమల్ సినిమాతో పాపులర్ అయిన తృప్తి డిమ్రి.. ప్రభాస్ తదుపరి సినిమాలో నటించనున్నారని కొంతకాలంగా పుకార్లు వస్తున్నాయి. దీనిపై ఆమె తాజాగా స్పందించారు.

తృప్తి డిమ్రి
తృప్తి డిమ్రి

Tripti Dimri on Spirit: యానిమల్ సినిమాతో బాలీవుడ్ నటి తృప్తి డిమ్రి ఒక్కసారిగా ఫుల్ పాపులర్ అయ్యారు. ఆ చిత్రంలో బోల్డ్ సీన్లలో నటించిన ఆమె ఆకట్టుకున్నారు. తృప్తి అందానికి, నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. దీంతో ఒక్కసారి ఆమె సరికొత్త నేషనల్ క్రష్ అయ్యారు. యానిమల్ చిత్రంలో హీరో రణ్‍బీర్‌తో తృప్తి కెమిస్ట్రీ అదిరిపోయింది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ సినిమా బ్లాక్‍బాస్టర్ కాగా.. అదే రేంజ్‍లో తృప్తి డిమ్రికి పేరు వచ్చింది.

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తదుపరి.. పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్‍తో స్పిరిట్ మూవీ చేయనున్నారు. అయితే, స్పిరిట్ చిత్రంలో ప్రభాస్ సరసన తృప్తి నటించనన్నారని కొంతకాలంగా రూమర్లు వస్తున్నాయి. ఆ సినిమాలో ఆమె హీరోయిన్ అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే, తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ రూమర్లపై తృప్తి డిమ్రి స్పందించారు.

ఇప్పటికైతే ప్రభాస్ ‘స్పిరిట్’ ప్రాజెక్టులో తాను లేనని తృప్తి డిమ్రి స్పష్టం చేశారు. రూమర్లకు చెక్ పెట్టారు. స్పిరిట్ చిత్రంలో తనకు ఇప్పటికైతే అవకాశం రాలేదని చెప్పారు.

యానిమల్‍లో ఇంటిమేట్ సీన్లపై తన తల్లిదండ్రులు కూడా మొదట్లో అభ్యంతరం చెప్పారని ఇటీవల మరో ఇంటర్వ్యూలో చెప్పారు తృప్తి డిమ్రి. అయితే, తాను ఎలాంటి తప్పు చేయడం లేదని, అది తన పని అని వివరించానని తృప్తి చెప్పారు. నటిగా తాను 100 శాతం నిజాయితీగా క్యారెక్టర్ చేయాలని, తాను అదే చేశానని, ఇందులో సమస్య ఏం లేదని చెప్పానని తృప్తి తెలిపారు.

తృప్తి డిమ్రి ప్రస్తుతం మేరే మెహబూబ్ మేరే సనమ్ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రంలో విక్కీ కౌశల్ హీరోగా కౌశల్ హీరోగా నటిస్తుండగా.. ఆనంద్ తివారీ దర్శకత్వం వహిస్తున్నారు. ధర్మ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది.

స్పిరిట్ సినిమా విషయానికి వస్తే.. ఈ చిత్రంలో వైలెంట్ పోలీస్ ఆఫీసర్‌గా ప్రభాస్ నటించనున్నారు. ఈ సినిమాను కూడా యాక్షన్ థ్రిల్లర్‌గానే సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించనున్నారు. టీ సిరీస్ పతాకంపై భూషణ్ కుమార్ నిర్మించనున్నారు. స్పిరిట్ సినిమా స్క్రిప్ట్ పనులు 2024 జూలై కల్లా పూర్తవుతాయని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సందీప్ తెలిపారు. సెప్టెంబర్‌లో షూటింగ్ మొదలుపెట్టాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలిపారు.

Whats_app_banner