Pushpa 3: పుష్ప 3 అప్‌డేట్ రివీల్ చేసిన ఆస్కార్ విన్నర్ - పుష్పరాజ్ రాంపేజ్!
03 December 2024, 14:24 IST
Pushpa 3: పుష్ప 3పై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వచ్చేసింది. మూడో పార్ట్‌కు పుష్ప ది రాంపేజ్ అనే టైటిల్‌ను ఫిక్స్‌చేశారు. పుష్ప 2 థియేటర్లలో పుష్ప 3 స్పెషల్ టీజర్‌ను స్క్రీనింగ్ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
పుష్ప 3
Pushpa 3: ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్‌తో పాటు అన్ని ఇండస్ట్రీలో పుష్ప 2 హవా కనిపిస్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే సరికొత్త రికార్డులను తిరగరాస్తోంది అల్లు అర్జున్ మూవీ. వరల్డ్ వైడ్‌గా డిసెంబర్ 5న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్‌కు ముందు రోజు రాత్రి నుంచే ప్రీమియర్ షోలు పడనున్నాయి. ప్రీమియర్ షోలకు సంబంధించిన అనుమతులు, టికెట్ల ధరలు ఇప్పటికే ఖరారు అయ్యాయి.
ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్…
పుష్ప 2 మూవీని థియేటర్లలో చూసే ఫ్యాన్స్‌కు మేకర్స్ ఓ సర్‌ప్రైజ్‌ను ఇవ్వబోతున్నారు. పుష్ప 3కి సంబంధించిన స్పెషల్ టీజర్‌ను స్క్రీనింగ్ చేయబోతున్నట్లు సమాచారం. ఈ స్పెషల్ టీజర్‌తో ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్ ఇవ్వబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
పుష్ప ది రాంపేజ్...
పుష్ప మూడో పార్ట్‌కు పుష్ప 3 ది రాంపేజ్ అనే టైటిల్‌ను ఫిక్స్‌చేశారు. ఈ విషయాన్ని ఆస్కార్ విన్నర్, ప్రముఖ సౌండ్ డిజైనర్ రసూల్ పొకూట్టి రివీల్ చేశాడు. పుష్ప 3 స్పెషల్ టీజర్‌కు రసూల్ అండ్ టీమ్ సౌండ్ మిక్సింగ్ చేస్తోన్న ఓ ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ఫొటోను అల్లు అర్జున్ ఫ్యాన్స్ తెగ షేర్ చేస్తోన్నారు.
ఫాస్టెస్ట్ మిలియన్ సేల్స్...
పుష్ప ది రూల్ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డులను క్రియేట్ చేసింది. కేజీఎఫ్ 2, బాహుబలి 2, కల్కి 2898 ఏడీ తో పాటు పలు బ్లాక్‌బస్టర్ మూవీస్ రికార్డులను దాటేసింది. బుక్ మై షోలో అత్యంత వేగంగా మిలియన్ టికెట్లు అమ్ముడైన సినిమాగా పుష్ప 2 నిలిచింది. అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమైన మొదటిరోజే మూడు లక్షల టికెట్లు బుక్ మై షో ద్వారా అమ్ముడుకావడం గమనార్హం.
నలుగురు మ్యూజిక్ డైరెక్టర్లు...
పుష్ప 2 మూవీలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. ఫహాద్ ఫాజిల్ విలన్‌గా నటిస్తోన్న ఈ మూవీలో జగపతిబాబు, సునీల్, అనసూయ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ సీక్వెల్‌కు నలుగురు మ్యూజిక్ డైరెక్టర్లు పనిచేయడం గమనార్హం. సాంగ్స్‌ను దేవిశ్రీప్రసాద్ కంపోజ్ చేయగా...బీజీఎమ్‌ను మాత్రం తమన్, అజనీష్ లోకనాథ్, సామ్ సీఎస్ అందించారు.
హైకోర్టులో పిటీషన్...
పుష్ప మూవీని మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మించాయి. దాదాపు ఐదు వందల కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ 1085 కోట్లకుపైగా జరిగింది.
పుష్ప టికెట్ ధరలు తెలుగు రాష్ట్రాల్లో పదకొండు వందలకుపైనే ఉండటంపై ఓ వ్యక్తి హైకోర్టులో పిటీషన్ వేశాడు. చివరి నిమిషంలో సినిమారిలీజ్‌ను ఆపలేమంటూ ఈ పిటీషన్‌ను రెండు వారాలు కోర్టు వాయిదావేసింది.