Pushpa 2 Update: పుష్ప -2 కోసం రిస్క్ చేస్తోన్న బన్నీ - మావోయిస్ట్ కంచుకోట మల్కాన్‌గిరిలో షూటింగ్
10 April 2023, 10:33 IST
Pushpa 2 Update:పుష్ప 2 షూటింగ్ కోసం ఇప్పటివరకు ఎవరు చేయని రిస్క్‌కు సిద్ధపడ్డాడు అల్లు అర్జున్. మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతంలో షూటింగ్ చేయబోతున్నాడు.
అల్లు అర్జున్
Pushpa 2 Update: అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన పుష్ప -2 ఫస్ట్‌లుక్‌కు టాలీవుడ్, బాలీవుడ్‌తో పాటు అన్ని లాంగ్వేజ్‌ల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తోంది. ఈ ఫస్ట్‌లుక్ సినిమాపై అంచనాల్ని అమాంతం పెంచేసింది. ఈ ఫస్ట్‌లుక్‌కు లభించిన రెస్పాన్స్‌తో ఫుల్ ఖుషిలో ఉన్న చిత్ర యూనిట్ పుష్ప -2 నెక్స్ట్ షెడ్యూల్‌ను మొదలుపెట్టేందుకు రెడీ అవుతోంది.
మే ఫస్ట్ వీక్‌లో ఒడిశాలోని మల్కాన్‌గిరి జిల్లా అటవీ ప్రాంతంలో పుష్ప-2 కొత్త షెడ్యూల్ ప్రారంభం కానున్నట్లు తెలిసింది.మావోయిస్ట్‌లకు కంచుకోటగా ప్రసిద్ధి చెందిన స్వాభిమాన్ అంచల్ ఏరియాలో కీలక సన్నివేశాలను చిత్రీకరించబోతున్నట్లు తెలిసింది.
ఎర్రచందనం అక్రమ రవాణా బ్యాక్‌డ్రాప్‌లో సాగే కథ కావడంతో మల్కాన్‌గిరి లొకేషన్ కరెక్ట్ అని చిత్ర యూనిట్ భావించినట్లుగా చెబుతున్నారు. హంతల్‌గుడా, జూలాపోలా, సప్తధార తో పాటు పలు లొకేషన్స్‌ను యూనిట్ మెంబర్స్ సందర్శించినట్లుగా తెలిసింది. కొన్ని లొకేషన్స్‌ను ఫైనలైజ్ చేసినట్లు సమాచారం.
ఈ షెడ్యూల్‌లో అల్లు అర్జున్‌తో పాటు ప్రధాన తారాగణం మొత్తం పాల్గొననున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మల్కాన్‌గిరి ఏరియాలో షూటింగ్ చేసేందుకు అవసరమైన అనుమతులు లభించినట్లు చెబుతోన్నారు. ఇప్పటివరకు మల్కాన్‌గిరి ఏరియాలో స్టార్ హీరోలు ఎవరూ షూటింగ్ చేయలేదు. పుష్ప -2 తో అల్లు అర్జున్ తొలిసారి ఈ సాహసం చేయబోతుండటం హాట్‌టాపిక్‌గా మారింది.
మావోయిస్ట్ ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో ఇప్పటివరకు జరిగిన వివిధ ఘటనల్లో ఐదు వందల మందికిపైగాప్రాణాలను కోల్పోయారు. గత కొన్నేళ్లుగా ఈ పోరు కాస్త తగ్గుముఖం పట్టింది. కాగా పుష్ప 2 సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహిస్తోన్నాడు. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్‌లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోన్నారు.