Pushpa -2 Update: పుష్ప సీక్వెల్‌లో జగపతిబాబు - సుకుమార్ సెంటిమెంట్ కంటిన్యూ
Pushpa -2 Update: పుష్ప సీక్వెల్‌కు సంబంధించి మరో ఆసక్తికర వార్త టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఈ సీక్వెల్‌లో జగపతిబాబు కీలక పాత్రలో నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Pushpa -2 Update: ఈ ఏడాది టాలీవుడ్‌తో పాటు పాన్ ఇండియన్ స్థాయిలో సినీ అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తోన్న సినిమాల్లో పుష్ప -2 ఒకటి. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. 2021లో విడుదలైన పుష్ప ది రైజ్‌కు కొనసాగింపుగా పుష్ప -2 రూపొందుతోంది. శుక్రవారం నుంచి ఈ సినిమా షూటింగ్ వైజాగ్‌లో మొదలుకానుంది. .
వైజాగ్ హార్బర్ ఏరియాలో దాదాపు పది రోజుల పాటు అల్లు అర్జున్‌తో పాటు ప్రధాన తారాగణంపై దర్శకుడు సుకుమార్ కీలక సన్నివేశాలను చిత్రీకరించబోతున్నట్లు తెలిసింది. ఈ షెడ్యూల్ కోసం గురువారం అల్లు అర్జున్ వైజాగ్ చేరుకున్నారు. కాగా పుష్ప -2లో మరో టాలెంటెడ్ యాక్టర్ భాగం కాబోతున్నట్లు సమాచారం. జగపతిబాబు కీలక పాత్రలో నటించనున్నట్లు తెలిసింది.
ఈ సీక్వెల్‌లో జగపతిబాబు రోల్ సర్‌ప్రైజింగ్‌గా ఉంటుందని సమాచారం. నెగెటివ్ షేడ్స్‌తో కూడిన రోల్‌లోనే జగపతిబాబు కనిపించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. త్వరలోనే జగపతిబాబు పాత్రకు సంబంధించి మేకర్స్ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. గతంలో సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన నాన్నకు ప్రేమతో, రంగస్థలం సినిమాల్లో జగపతిబాబు నటించారు. ఈ రెండు సినిమాల్లో జగపతిబాబు నటనకు మంచి పేరు వచ్చింది.
జగపతిబాబు క్యారెక్టర్ సెంటిమెంట్‌ను పుష్ప -2లో డైరెక్టర్ సుకుమార్ కొనసాగించబోతున్నట్లు తెలిసింది. పుష్ప -2లో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. ఫహాద్ ఫాజిల్ విలన్‌గా కనిపించబోతున్నారు. ఫ్యామిలీ ఎమోషన్స్‌కు ఇంపార్టెన్స్ ఇస్తూ ఈ సీక్వెల్‌ను సుకుమార్ తెరకెక్కించబోతున్నట్లు సమాచారం.