తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Allu Arjun: గంగోత్రి నుంచి పుష్ప 2 వరకు అల్లు అర్జున్ సినిమాల బడ్జెట్, వచ్చిన కలెక్షన్స్ ఇవే! 200 కోట్లు ఎన్ని దాటాయంటే?

Allu Arjun: గంగోత్రి నుంచి పుష్ప 2 వరకు అల్లు అర్జున్ సినిమాల బడ్జెట్, వచ్చిన కలెక్షన్స్ ఇవే! 200 కోట్లు ఎన్ని దాటాయంటే?

Sanjiv Kumar HT Telugu

06 December 2024, 15:30 IST

google News
    • Allu Arjun All Movies Budget And Collection Over Pushpa 2: ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 ది రూల్ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో దూసుకుపోతుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో గంగోత్రి నుంచి పుష్ప 2 వరకు అల్లు అర్జున్ అన్ని సినిమాల బడ్డెట్, కలెక్షన్స్‌పై లుక్కేద్దాం.
గంగోత్రి నుంచి పుష్ప 2 వరకు అల్లు అర్జున్ సినిమాల బడ్జెట్, వచ్చిన కలెక్షన్స్ ఇవే! 200 కోట్లు ఎన్ని దాటాయంటే?
గంగోత్రి నుంచి పుష్ప 2 వరకు అల్లు అర్జున్ సినిమాల బడ్జెట్, వచ్చిన కలెక్షన్స్ ఇవే! 200 కోట్లు ఎన్ని దాటాయంటే?

గంగోత్రి నుంచి పుష్ప 2 వరకు అల్లు అర్జున్ సినిమాల బడ్జెట్, వచ్చిన కలెక్షన్స్ ఇవే! 200 కోట్లు ఎన్ని దాటాయంటే?

Allu Arjun All Movies Budget Over Pushpa 2: పుష్ప 1 సినిమాతో నేషనల్ అవార్డ్ అందుకున్న ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 ది రూల్ మూవీతో ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తాడో అని టాలీవుడ్ ఎదురుచూస్తోంది. డిసెంబర్ 5న రిలీజ్ అయిన పుష్ప 2 మూవీ ఓపెనింగ్ డే రోజు రూ. 250 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేశారు.

బడ్జెట్- బాక్సాఫీస్ కలెక్షన్స్

ఈ నేపథ్యంలో గంగోత్రి నుంచి పుష్ప 2 వరకు అల్లు అర్జున్ నటించిన అన్ని సినిమాలు, వాటికి పెట్టిన బడ్జెట్, బాక్సాఫీస్ వద్ద వాటికి వచ్చిన కలెక్షన్స్, ఆ సినిమాల్లో ఏవి హిట్, మరేవి ఫ్లాప్ అనే ఆసక్తిర విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

1. గంగోత్రి- 2. ఆర్య

అల్లు అర్జున్ హీరోగా డెబ్యూ ఎంట్రీ ఇచ్చిన గంగోత్రి మూవీకి రూ. 3 కోట్ల బడ్జెట్ అయితే రూ. 11 కోట్ల కలెక్షన్స్ కొల్లగొట్టి సూపర్ హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్య మూవీకి నాలుగు కోట్ల బడ్జెట్ పెడితే బాక్సాఫీస్ వద్ద 30 కోట్లు రాబట్టింది. ఈ రెండో సినిమాతో కెరీర్‌లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు బన్నీ.

3. బన్నీ- 4. హ్యాపీ

అల్లు అర్జున్ ముద్దు పేరుతో తెరకెక్కిన బన్నీ సినిమాకు రూ. 15 కోట్లు ఖర్చు అయితే రూ. 29 కోట్లు కలెక్షన్స్ సాధించి సూపర్ హిట్‌ అయింది. తర్వాత జెనీలియా హీరోయిన్‌గా చేసిన హ్యాపీ సినిమాను 20 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తే బాక్సాఫీస్ వద్ద 16 కోట్లు రాబట్టి ఫ్లాప్ మూవీగా నిలిచింది. అల్లు అర్జున్ కెరీర్‌లో ఇదే మొదటి ఫ్లాప్.

5. దేశముదురు- 6.పరుగు- 7. ఆర్య 2

అల్లు అర్జున్ సిక్స్ ప్యాక్‌తో అలరించిన దేశ ముదురుకు పది కోట్ల బడ్జెట్ పెడితే 39 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక 15 కోట్లతో తెరకెక్కిన పరుగు సినిమా 31 కోట్లు రాబట్టి సూపర్ హిట్‌గా నిలిచింది. సుకుమార్‌- అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన రెండో మూవీ ఆర్య 2 బడ్జెట్ 21 కోట్లు అయితే.. బాక్సాఫీస్ వద్ద 20 కోట్ల కలెక్షన్స్‌‌తో ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది.

8. వరుడు- 9. వేదం- 10 బద్రీనాథ్

ఐదు రోజుల పెళ్లి కాన్సెప్ట్‌తో వచ్చిన వరుడు సినిమాకు రూ. 30 కోట్ల బడ్జెట్ పెడితే రూ. 15 కోట్లు మాత్రమే రాబట్టి డిజాస్టర్‌గా నిలిచింది. అల్లు అర్జున్ కీలక పాత్ర పోషించిన వేదం సినిమా 16 కోట్లల్లో తెరకెక్కగా 14 కోట్లు రాబట్టి కమర్షియల్‌గా ఫ్లాప్ అయింది. కానీ, నటన పరంగా డీసెంట్ టాక్ తెచ్చుకుంది. ఇక రూ. 42 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిన బద్రీనాథ్ సినిమా రూ. 45 కోట్లు మాత్రమే వసూలు చేసి యావరేజ్‌గా నిలిచింది.

11. జులాయి సినిమా బడ్జెట్ రూ. 30 కోట్లు కాగా రూ. 55 కోట్ల కలెక్షన్స్ వచ్చి సూపర్ హిట్‌గా నిలిచింది.

12. ఇద్దరమ్మాయిలతో- బడ్జెట్ రూ. 33 కోట్లు, కలెక్షన్స్ రూ. 37 కోట్లు, రిజల్ట్: యావరేజ్

13. ఎవడు- బడ్జెట్ రూ. 35 కోట్లు, కలెక్షన్స్ రూ. 60 కోట్లు, రిజల్ట్: సూపర్ హిట్

14. రేసు గుర్రం- బడ్జెట్ రూ. 40 కోట్లు, కలెక్షన్స్ రూ. 102 కోట్లు, రిజల్ట్: బ్లాక్ బస్టర్. అల్లు అర్జున్ కెరీర్‌లో వంద కోట్లు కలెక్ట్ చేసిన మొదటి సినిమా ఇదే.

15. సన్నాఫ్ సత్యమూర్తి- బడ్జెట్ రూ. 40 కోట్లు, కలెక్షన్స్ రూ. 85 కోట్లు, రిజల్ట్: సూపర్ హిట్

16. రుద్రమదేవి- బడ్జెట్ రూ. 60 కోట్లు, కలెక్షన్స్ రూ. 65 కోట్లు, రిజల్ట్: యావరేజ్

17. సరైనోడు- బడ్జెట్ రూ. 50 కోట్లు, కలెక్షన్స్ రూ. 127 కోట్లు, రిజల్ట్: బ్లాక్ బస్టర్ హిట్

18. దువ్వాడ జగన్నాథం- బడ్జెట్ రూ. 40 కోట్లు, కలెక్షన్స్ రూ. 115 కోట్లు, రిజల్ట్: బ్లాక్ బస్టర్

19. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా- బడ్జెట్ రూ. 65 కోట్లు, కలెక్షన్స్ రూ. 73 కోట్లు, రిజల్ట్: యావరేజ్

20. అల వైకుంఠపురములో- బడ్జెట్ రూ. 75 కోట్లు, కలెక్షన్స్ రూ. 255 కోట్లు, రిజల్ట్: బ్లాక్ బస్టర్ హిట్. అల్లు అర్జున్ సినీ కెరీర్‌లో రూ. 200 కోట్లు దాటిన మొదటి మూవీ ఇదే.

21. పుష్ప ది రైస్- బడ్జెట్ రూ. 150 కోట్లు, కలెక్షన్స్ రూ. 350 కోట్లు, రిజల్ట్: బ్లాక్ బస్టర్. బన్నీ కెరీర్‌లో వంద కోట్లు దాటిన బడ్జెట్‌తో పాటు 300 దాటిన తొలి సినిమా ఇదే.

22. పుష్ప 2 ది రూల్

ఇక అల్లు అర్జున్ 22వ సినిమా అయిన పుష్ప 2 ది రూల్ బడ్జెట్ రూ. 400 నుంచి 500 కోట్ల మధ్య ఉండగా.. మొదటి రోజు కలెక్షన్స్ రూ. 250 కోట్ల వరకు ఉండొచ్చని అంచనా. ఇక లాంగ్ రన్‌లో రూ. వెయ్యి కోట్లకుపైగానే దాటే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు.

ఐఎమ్‌డీబీ ప్రకారం

ఇదిలా ఉంటే, అల్లు అర్జున్ కెరీర్‌లో హై బడ్జెట్ అండ్ హై కలెక్షన్స్ అందుకున్న తొలి సినిమాగా పుష్ప 2 ది రూల్ నిలవనుందని తెలుస్తోంది. గంగోత్రి నుంచి పుష్ప 1 వరకు బన్నీ కెరీర్‌లో వంద కోట్ల కలెక్షన్స్ దాటిన సినిమాలు నాలుగు, రెండు వందల కోట్లు దాటిన మూవీస్ 2 ఉన్నాయి. 

వంద కోట్ల బడ్జెట్ దాటిన సినిమాలుగా పుష్ప 1, పుష్ప 2 ఉన్నాయి. ఈ సమాచారం అంతా ఐఎమ్‌డీబీ వెబ్‌సైట్ ప్రకారం తెలియజేయటం జరిగిందని గమనించగలరు.

తదుపరి వ్యాసం