Star Kid: స్టార్ కిడ్, జెనీలియాతో ఎంట్రీ.. తన జుట్టు తానే కత్తిరించుకునే దీనస్థితికి వచ్చిన సూపర్ స్టార్ మేనల్లుడు-aamir khan nephew imran khan have 6 flops sold ferrari bungalow and cuts his own hair from 2016 star kid ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Star Kid: స్టార్ కిడ్, జెనీలియాతో ఎంట్రీ.. తన జుట్టు తానే కత్తిరించుకునే దీనస్థితికి వచ్చిన సూపర్ స్టార్ మేనల్లుడు

Star Kid: స్టార్ కిడ్, జెనీలియాతో ఎంట్రీ.. తన జుట్టు తానే కత్తిరించుకునే దీనస్థితికి వచ్చిన సూపర్ స్టార్ మేనల్లుడు

Sanjiv Kumar HT Telugu
Feb 16, 2024 11:36 AM IST

Star Kid Sold Ferrari Car And Bungalow: సూపర్ స్టార్ మేనల్లుడుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఓ స్టార్ కిడ్ ఇప్పుడు హెయిర్ కట్ కోసం డబ్బులు లేని పరిస్థితికి వచ్చాడు. దాంతో తన జుట్టు తానే కత్తిరించుకోవడమే కాకుండా, ఖరీదైన బంగ్లా, ఫెరారీ కారులను అమ్మే దీనస్థితికి వచ్చాడు.

స్టార్ కిడ్, జెనీలియాతో ఎంట్రీ.. తన జుట్టు తానే కత్తిరించుకునే దీనస్థితికి వచ్చిన సూపర్ స్టార్ మేనల్లుడు
స్టార్ కిడ్, జెనీలియాతో ఎంట్రీ.. తన జుట్టు తానే కత్తిరించుకునే దీనస్థితికి వచ్చిన సూపర్ స్టార్ మేనల్లుడు

Star Kid With 6 Flop Films: చాలా మంది స్టార్ కిడ్స్ తొలి మూవీతోనే బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించారు. కానీ, తర్వాత వాళ్లు వారి స్టార్‌డమ్‌ను నిలదొక్కుకోవడం అంత సులువైన విషయం కాదు. స్టార్ కిడ్స్‌కు తొలి సక్సెస్ కొన్ని నెలల్లోనే చాలా ప్రాజెక్ట్స్ వచ్చేందుకు దారి చూపిస్తుంది. కానీ, ఆ ప్రాజెక్ట్స్ తర్వాత కూడా స్టార్ హీరోగా వెలుగొందాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. తొలి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి, ఓవర్ నైట్ స్టార్‌గా మారి ఇప్పుడు దీనస్థితిని గడుపుతున్నాడు ఓ స్టార్ కిడ్. అతని పేరే ఇమ్రాన్ ఖాన్ (Imran Khan).

జెనీలియాతో ఎంట్రీ

బాలీవుడ్ సూపర్ స్టార్, మిస్టర్ పర్ఫెక్ట్ ఆమీర్ ఖాన్ (Aamir Khan) మేనల్లుడిగా హిందీ చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చాడు ఇమ్రాన్ ఖాన్. జానే తు జానే నా అనే లవ్ రొమాంటిక్ మూవీతో డెబ్యూ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు ఇమ్రాన్ ఖాన్. 2008లో వచ్చిన ఈ సినిమాకు అబ్బాస్ టైరేవాలా దర్శకత్వం వహించగా.. ఇందులో హీరోయిన్‌గా ఇమ్రాన్‌కు జోడీగా జెనీలియా డిసౌజా నటించింది. జానే తు జానే నా మూవీ బాక్సాఫీస్ వద్ద రూ. 84 కోట్లు రాబట్టింది. దీంతో ఇమ్రాన్ ఖాన్ ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు.

మీడియం అడల్ట్ సినిమాలు

ఇక జానే తు జానే నా మూవీ తర్వాత ఇమ్రాన్ ఖాన్ రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. దాంతో అతన్ని వన్ ఫిల్మ్ వండర్ అని బాలీవుడ్ మీడియా పిలిచింది. అంటే ఒక్క సినిమా అద్భుతం. మొదటి సినిమా ఏదో అలా హిట్ అయింది అన్నట్లుగా కథనాలు రాశారు. ఆ తర్వాత ఇమ్రాన్ ఖాన్ ఐ హేట్ లవ్ స్టోరీస్, ఢిల్లీ బెల్లీ, మేరే బ్రదర్ కి దుల్హన్‌తో పాటు కొన్ని మీడియం అడల్ట్ కంటెంట్ బేస్‌డ్ కామెడీ సినిమాలు చేశాడు. అవి పర్వాలేదనిపించుకున్నాయి.

క్లిష్ట పరిస్థితులు

అయితే, 2012 తర్వాత వరుసగా నాలుగు ఫ్లాప్ సినిమాలు చవి చూశాడు ఇమ్రాన్ ఖాన్. వాటి తర్వాత నటించిన మాతృ కి బిజిలీ కా మండోలా, కత్తి బట్టీ చిత్రాలు కూడ ఫ్లాప్‌గా నిలిచాయి (Imran Khan 6 Flops Films). కత్తి బట్టీ మూవీనే ఇమ్రాన్ ఖాన్ చివరి చిత్రం. ఇక తన ఆర్థిక పరిస్థితి, తన ఖరీదైన ఫెరారి కారును అమ్మాల్సిన విషయం గురించి వోగ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు ఇమ్రాన్ ఖాన్. తాను అప్పుడు క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్నట్లు, అందుకే ఖర్చులు తగ్గించుకోవడం కోసం ఫెరారీ కారును అమ్మేసినట్లు ఇమ్రాన్ ఖాన్ తెలిపాడు.

మినిమలిస్టిక్ జీవనశైలి

ఫెరారీ కారు అమ్మేసి చీప్ కారు ఒకటి తీసుకున్నాడట ఇమ్రాన్ ఖాన్. కాస్ట్‌లీ కారు మెయింటెన్స్‌కు భారీగా ఖర్చు అవుతుందని ఈ పని చేసినట్లు తెలిపాడు. అలాగే పాలి హిల్‌లో ఉన్న ఖరీదైన బంగ్లాను అమ్మేసి ఓ ప్లాట్‌కు మారాడు. అయితే, మినిమలిస్టిక్ జీవనశైలిని నమ్మే ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం తన వంటగదిలో మూడు ప్లేట్లు, మూడు ఫోర్కులు, రెండు కాఫీ మగ్‌లు, ఒక ఫ్రైయింగ్ పాన్ మాత్రమే ఉన్నట్లు చెప్పాడు. అంతేకాకుండా 2016 నుంచి తన జుట్టును తానే కత్తిరించుకుంటున్నట్లు ఇమ్రాన్ ఖాన్ షాకింగ్ విషయం వెల్లడించాడు.

పదేళ్ల తర్వాత రీ ఎంట్రీ

దాదాపు పదేళ్లు సినిమాలకు దూరంగా ఉన్న ఇమ్రాన్ ఖాన్ ఇప్పుడు రీ ఎంట్రీ ఇచ్చే ఆలోచనలో ఉన్నాడు. అయితే, తన సోషల్ మీడియాలో తాను సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నట్లు జోక్ చేస్తూ ఓ పోస్ట్ చేశాడట ఇమ్రాన్. దానికి విపరీతమైన లైక్స్, కామెంట్స్ వచ్చాయట. దాంతో అతనిపై మళ్లీ నమ్మకం వచ్చిందని, అందుకే సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలని అనుకున్నాడట ఇమ్రాన్ ఖాన్. నటుడిగా తొలి ఇన్నింగ్స్‌లో చేసిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుని సెకండ్ ఇన్నింగ్స్ కోసం ఎదురు చూస్తున్నానని చెప్పుకొచ్చాడు స్టార్ కిడ్ ఇమ్రాన్ ఖాన్.

Whats_app_banner