Horror OTT: ఓటీటీలోకి వచ్చేసిన SSMB29 హీరోయిన్ హారర్ థ్రిల్లర్- రెండేళ్ల తర్వాత సీక్వెల్, బ్లాక్ బస్టర్ హిట్- ఎక్కడంటే?
Smile 2 OTT Streaming: ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ మూవీ స్మైల్ 2 వచ్చేసింది. 2022లో ప్రేక్షకులను భయంతో వణికించిన సూపర్ హిట్ హారర్ మూవీ స్మైల్‌కు ఇది సీక్వెల్. మహేష్ బాబు ఎస్ఎస్ఎంబీ29లో హీరోయిన్ అని టాక్ వినిపిస్తోన్న నవోమీ స్కాట్ నటించిన హారర్ థ్రిల్లర్ స్మైల్ 2 ఓటీటీ స్ట్రీమింగ్‌పై లుక్కేద్దాం.
Smile 2 OTT Release: హారర్ జోనర్‌లో వచ్చే సినిమాలకు ఎంత క్రేజ్ అండ్ డిమాండ్ ఉంటుందో తెలిసిందే. కాన్సెప్ట్ కాస్తా అటు ఇటుగా ఉన్న టేకింగ్ పరంగా ఆకట్టుకుంటే ఆ మూవీస్ సూపర్ హిట్ అవుతాయి. అలాగే, డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కే హారర్ థ్రిల్లర్ మూవీస్ మంచి ఆదరణ కూడా పొందుతాయి.
మొదటి పార్ట్ కంటే ఎక్కువ
అలా ఒక యూనిక్ పాయింట్‌తో తెరకెక్కిన సూపర్ హిట్ కొట్టిన సినిమానే స్మైల్. 2022లో వచ్చిన ఈ సూపర్‌నేచురల్ హారర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ మంచి విజయం సాధించింది. అయితే, ఐఎమ్‌డీబీలో పదికి 6.5 రేటింగ్ అందుకున్న స్మైల్ మూవీకి రెండేళ్ల తర్వాత సీక్వెల్ వచ్చింది. అదే స్మైల్ 2. అక్టోబర్ 18న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మొదటి పార్ట్ కంటే ఎక్కువ విజయం సాధించింది.
నవ్వు చూస్తే చస్తారు
నవ్వు చూస్తే చనిపోవడం వంటి డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఈ స్మైల్ సిరీస్ తెరకెక్కింది. స్మైల్ మూవీలో ఓ సైకలాజికల్ డాక్టర్ వద్దకు ఒక పేషంట్ వస్తుంది. తనను అందరూ చూస్తు నవ్వుతున్నారని, తనను ఏదో వెంటాడుతుందని తను భయపడే విషయాలు చెప్పుకుంటుంది. ఇంతలోనే విచిత్రమైన ఆకారం తనను ఏదో చంపుతుందని హడలెత్తిపోతుంది. కట్ చేస్తే ఆ పేషంట్ చనిపోతుంది.
భయానక పరిస్థితులు
ఆ పేషంట్ చనిపోయిన తర్వాత లేచి నిల్చుని డాక్టర్ వైపు నవ్వుతూ చూస్తుంది. అక్కడి నుంచి స్మైల్ మూవీ ప్రారంభం అవుతుంది. ఆ పేషంట్ మరణం తర్వాత డాక్టర్ జీవితంలో ఎదురైన సంఘటనలు, భయానక పరిస్థితుల సముహారంగా స్మైల్ తెరకెక్కింది. స్మైల్ మూవీలో నవ్వును చూసిన వారంతా వరుసగా చనిపోతుంటారు.
స్మైల్ క్లైమాక్స్ నుంచి
అసలు వాళ్లు అలా ఎందుకు నవ్వుతున్నారు? దాని వెనుక ఉన్నది ఏంటీ? దాని నుంచి డాక్టర్ ఎలా బయటపడింది? అనే గ్రిప్పింగ్ అంట్ హారర్ ఎలిమెంట్స్‌తో స్మైల్ తెరకెక్కింది. దీనికి సీక్వెల్‌గా రూపొందిన స్మైల్ 2 మొదటి పార్ట్ క్లైమాక్స్ నుంచి ప్రారంభం అవుతుంది. డాక్టర్ రోజ్ కాటర్ డెత్‌ను కళ్లారా వీక్షించిన పోలీస్ ఆఫీసర్‌ను నవ్వు వెంటాడుతుంది. ఆ నవ్వును అతను ఇద్దరు క్రిమినల్స్‌కు పాస్ చేస్తారు.
రియల్ లైఫ్ సింగర్
అలా ఆ నవ్వు పాప్ స్టార్ స్కై రిలే పాస్ అవుతుంది. ఆ నవ్వు తర్వాత ఎంతో పేరు ప్రఖ్యాతలు గాంచిన పాప్ స్టార్ స్కై రిలే జీవితం ఎలాంటి మలుపు తిరిగిందన్నది స్మైల్ 2 కథ. మొదటి పార్ట్ కంటే భయం పుట్టించేలా స్మైల్ 2 చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఇక స్మైల్ 2 సినిమాలో పాప్ స్టార్ స్కై రిలే పాత్రలో రియల్ లైఫ్ సింగర్, హీరోయిన్ నవోమి స్కాట్ యాక్ట్ చేసింది.
మహేష్ బాబు హీరోయిన్
బ్యూటిఫుల్ నవోమీ స్కాట్ సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబో మూవీ ఎస్ఎస్ఎంబీ 29లో హీరోయిన్‌గా చేస్తుందని టాక్ వస్తోంది. అలాంటి నవోమి స్కాట్ నటించిన హారర్ థ్రిల్లర్ స్మైల్ 2 ఓటీటీలోకి వచ్చేసింది. అయితే, అది ఇండియాలో ఇంకా ఓటీటీ రిలీజ్ రాలేదు. కేవలం యూఎస్‌లో అమెజాన్ ప్రైమ్‌లో స్మైల్ 2 ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. అది కూడా రెంటల్ విధానంలో స్మైల్ 2 ఓటీటీ రిలీజ్ అయింది.