Tollywood Releases: ఈ వారం థియేటర్లలో డబ్బింగ్ సినిమాలదే హవా - కన్నడ, తమిళ హీరోలతో అల్లరి నరేష్ పోటీ
16 December 2024, 6:15 IST
Tollywood Releases This Week: ఈ వారం తెలుగు ప్రేక్షకుల ముందుకు స్ట్రెయిట్ సినిమాల కంటే డబ్బింగ్ మూవీస్ ఎక్కువగా రాబోతున్నాయి. ఈ శుక్రవారం థియేటర్లలో అల్లరి నరేష్ బచ్చలమల్లితో పాటు ఉపేంద్ర యూఐ, హాలీవుడ్ మూవీ ముఫాసా రిలీజ్ కాబోతున్నాయి.
ఈ వారం థియేటర్ రిలీజ్‌లు
Tollywood Releases This Week: ఈ వారం టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద స్ట్రెయిట్ సినిమాల కంటే డబ్బింగ్ సినిమాల సందడే ఎక్కువగా కనిపించబోతున్నది. హాలీవుడ్‌తో పాటు తమిళం, కన్నడ డబ్బింగ్ సినిమాలు ఈ వీక్ తెలుగు ప్రేక్షకులను పలకరించబోతున్నాయి. ఈ వారం రిలీజ్ అవుతోన్న సినిమాలు ఏవంటే?
అల్లరి నరేష్ బచ్చలమల్లి...
అల్లరి నరేష్ హీరోగా నటించిన బచ్చలమల్లి ఈ శుక్రవారం తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మాస్ యాక్షన్ లవ్‌స్టోరీగా తెరకెక్కుతోన్న ఈ మూవీకి సోలో బ్రతుకే సో బెటర్ ఫేమ్ సుబ్బు మంగదేవి దర్శకత్వం వహిస్తోన్నాడు. టీజర్, ట్రైలర్ రా అండ్ రస్టిక్‌గా సాగడం, అల్లరి నరేష్ క్యారెక్టరైజేషన్ గత సినిమాలకు భిన్నంగా బోల్డ్, రగ్గ్‌డ్‌గా కనిపించడంతో బచ్చలమల్లిపై అంచనాలు ఏర్పడ్డాయి.
ఈ సినిమాలో హనుమాన్ ఫేమ్ అమృత అయ్యర్ హీరోయిన్‌గా నటిస్తోంది. విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ అందిస్తోన్నాడు.బచ్చలమల్లితో అల్లరి నరేష్ తిరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడా లేదా అన్నది మరో నాలుగు రోజుల్లో తేలనుంది.
ఉపేంద్ర యూఐ
రెగ్యులర్ కమర్షియల్ ఫార్ములాలకు భిన్నమైన కథలతో సినిమాలు చేస్తూ తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు కన్నడ హీరో ఉపేంద్ర. అతడు హీరోగా నటించిన కొత్త మూవీ యూఐ ఈ డిసెంబర్ 20న తెలుగులో రిలీజ్ అవుతోంది. సైకలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీకి ఉపేంద్ర స్వయంగా దర్శకత్వం వహించాడు.ఈ సినిమాలో రేష్మ నన్నయ్య హీరోయిన్‌గా నటిస్తోంది.
సన్నీలియోన్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నది. గీతా ఫిల్మ్ సంస్థ తెలుగులో ఈ మూవీని రిలీజ్ చేస్తోంది. గత కొన్నేళ్లుగా ఉపేంద్ర చేసిన ప్రయోగాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్‌గా నిలిచాయి. యూఐతో మళ్లీ వింటేజ్ ఉపేంద్రను చూడటం ఖాయమని ప్రొడ్యూసర్లు చెబుతోన్నారు.
విజయ్ సేతుపతి విడుదల 2
కోలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి, నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ వెట్రిమారన్ కాంబోలో రూపొందిన విడుదల 2 ఈ వారమే థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకొస్తోంది. గత ఏడాది రిలీజై బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన విడుదల సినిమాకు సీక్వెల్‌గా ఈ మూవీ తెరకెక్కుతోంది.
విడుదల 2లో సూరి, మంజు వారియర్, భవానీ శ్రీ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ సినిమాకు ఇళయరాజా మ్యూజిక్ అందించాడు. అగ్ర వర్ణాల వివక్ష ఎదురించి ఓ నాయకుడు సాగించిన పోరాటంతో వెట్రిమారన్ ఈ మూవీని తెరకెక్కించారు.
ముఫాసా
హాలీవుడ్ మూవీ ది లయన్ కింగ్ ఈ వారమే థియేటర్లలోకి రాబోతోంది. ఈ సినిమాలో ముఫాసా పాత్రకు మహేష్‌బాబు వాయిస్ ఓవర్ అందించాడు. మహేష్ వాయిస్ ఓవర్ కారణంగా ఈ హాలీవుడ్ మూవీపై తెలుగు ఆడియెన్స్‌లో ఆసక్తి ఏర్పడింది. ఈ వాల్ట్ డిస్నీ మూవీ తెలుగు వెర్షన్ భారీ సంఖ్యలో థియేటర్లలో రిలీజ్ అవుతోంది.
భాగమతి ఫేమ్...
భాగమతి ఫేమ్ ఉన్ని ముకుందన్ నటించిన మార్కో మూవీ డిసెంబర్ 20న విడుదల కాబోతోంది. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీలో ప్రేమమ్ ఫేమ్ నివీన్ పాల్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.
టాపిక్