Movies in Theaters This Week: ఈ శుక్ర‌వారం ఒక్క‌రోజే 13 సినిమాలు రిలీజ్ - థియేట‌ర్ల‌లో చిన్న సినిమాల వెల్లువ‌-rules ranjan to mad 13 movies releasing this friday in theaters ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Movies In Theaters This Week: ఈ శుక్ర‌వారం ఒక్క‌రోజే 13 సినిమాలు రిలీజ్ - థియేట‌ర్ల‌లో చిన్న సినిమాల వెల్లువ‌

Movies in Theaters This Week: ఈ శుక్ర‌వారం ఒక్క‌రోజే 13 సినిమాలు రిలీజ్ - థియేట‌ర్ల‌లో చిన్న సినిమాల వెల్లువ‌

Nelki Naresh Kumar HT Telugu
Oct 02, 2023 01:45 PM IST

Movies in Theaters This Week: ఈ వారం థియేట‌ర్ల‌లో ఏకంగా 13 సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఎనిమిది తెలుగు సినిమాలు ఈ శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకురాబోతున్నాయి. ఆ సినిమాలు ఏవంటే....

రూల్స్ రంజ‌న్
రూల్స్ రంజ‌న్

Movies in Theaters This Week: ఈ శుక్ర‌వారం చిన్న సినిమాల‌తో థియేట‌ర్లు క‌ళ‌క‌ళ‌లాడ‌బోతున్నాయి. తెలుగు, త‌మిళంతో పాటు మిగిలిన భాష‌ల్లో క‌లిపి ఏకంగా ప‌ద‌మూడు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఇటీవ‌ల‌కాలంలో ఒకేరోజు పెద్ద మొత్తంలో సినిమాలు రిలీజ్ కావ‌డం ఇదే ఫ‌స్ట్ టైమ్ కావ‌డం గ‌మ‌నార్హం.

yearly horoscope entry point

తెలుగులో ఎనిమిది సినిమాలు రిలీజ్‌

ఈ వారం టాలీవుడ్ బాక్సాఫీస్ బ‌రిలో ఏకంగా ఎనిమిది సినిమాలు నిలిచాయి. కిర‌ణ్ అబ్బ‌వ‌రం హీరోగా న‌టించిన రూల్స్ రంజ‌న్ అక్టోబ‌ర్ 6న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. రొమాంటిక్ ల‌వ్‌స్టోరీగా రూపొందిన ఈ సినిమాకు కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఇందులో నేహాశెట్టి హీరోయిన్‌గా న‌టించింది.

సుధీర్‌బాబు త్రిబుల్‌రోల్‌లో న‌టిస్తోన్న మామ‌మ‌శ్చీంద్ర కూడా ఈ శుక్ర‌వార‌మే థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌బోతున్న‌ది. ప్ర‌యోగాత్మ‌క క‌థాంశంతో రూపొందిన ఈ సినిమాకు న‌టుడు హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అగ్ర నిర్మాణ సంస్థ సితార‌ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ నిర్మించిన మ్యాడ్ మూవీ కూడా ఈ ఫ్రైడే థియేట‌ర్ల‌లోకి రాబోతోంది. ఈ యూత్‌ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్ మూవీలో ఎన్టీఆర్ బావ‌మ‌రిది నార్నే నితిన్ హీరోగా న‌టిస్తున్నాడు.

న‌వీన్‌చంద్ర‌, క‌ల‌ర్స్ స్వాతి జంట‌గా న‌టించిన మంత్ ఆఫ్ మ‌ధు కూడా ఆక్టోబ‌ర్ 6న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. వీటితో పాటు తంతిరం, స‌గిలేటిక‌థ‌, ఏందిరా ఈ పంచాయ‌తీ సినిమాలు తెలుగు ప్రేక్ష‌కుల్ని అల‌రించేందుకు ఈ శుక్ర‌వారం థియేట‌ర్ల‌లోకి రాబోతున్నాయి.

డ‌బ్బింగ్ మూవీస్‌...

సిద్ధార్థ్ హీరోగా న‌టించిన త‌మిళ డ‌బ్బింగ్ మూవీ చిన్నా కూడా ఆక్టోబ‌ర్ 6న థియేట‌ర్ల ద్వారా తెలుగు ఆడియెన్స్‌ను ప‌ల‌క‌రించ‌బోతున్న‌ది. అలాగే శ్రీలంక క్రికెట‌ర్ ముత్త‌య్య ముర‌ళీధ‌ర‌న్ జీవితం ఆధారంగా రూపొందిన 800 మూవీ కూడా ఈ ఫ్రైడే విడుద‌ల‌కానుంది. . అలాగే త్రిష ది రోడ్‌తో పాటు విజ‌య్ ఆంటోనీ ర‌త్తం మూవీస్ కూడా ఈ వార‌మే రిలీజ్ కానున్నాయి.

వీటితో పాటు చ‌వేరా (మ‌ల‌యాళం మూవీ), షూట్ బూట్ దేర్‌, ఇరుంగుపాత్రు, మ‌ర్గాజీ థింగాల్ తో పాటు అక్ష‌య్ కుమార్ మిష‌న్ రాణిగంజ్ అక్టోబ‌ర్ 6న విడుద‌ల‌కానున్నాయి. వీటితో పాటు హాలీవుడ్ మూవీ ది ఎగ్జార్సిస్ట్ బిలీవ‌ర్ కూడా ఈ వార‌మే థియేట‌ర్ల‌లోకి రాబోతోంది.

Whats_app_banner