Agent Twitter Review: ఏజెంట్ ట్విట్టర్ రివ్యూ - అఖిల్ ఖాతాలో మరో డిజాస్టర్ ఖాయమేనా?
28 April 2023, 7:13 IST
Agent Twitter Review: అఖిల్ అక్కినేని హీరోగా నటించిన ఏజెంట్ మూవీ శుక్రవారం (నేడు) ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా ఓవర్‌సీస్ ప్రీమియర్స్ రెస్పాన్స్ ఎలా ఉందంటే...
అఖిల్
Agent Twitter Review: ఏజెంట్ మూవీతో ఏడాదిన్నర విరామం తర్వాత తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చాడు అఖిల్. స్పై యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన ఈ మూవీకి సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో మలయాళ అగ్ర నటుడు మమ్ముట్టి కీలక పాత్రను పోషించాడు. సాక్షి వైద్య హీరోయిన్‌గా నటించింది. దాదాపు ఎనభై కోట్ల బడ్జెట్‌తో అఖిల్ కెరీర్‌లో భారీ బడ్జెట్ మూవీగా తెరకెక్కిన ఏజెంట్ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా ఓవర్‌సీస్ ప్రీమియర్ టాక్ ఎలా ఉందో చూద్దాం...
లాజిక్‌లెస్ స్టోరీ...
భారీ అంచనాలతో రిలీజైన ఏజెంట్ మూవీకి ఓవర్‌సీస్ ప్రీమియర్స్ నుంచి దారుణంగా నెగెటివ్ కామెంట్స్ వినిపిస్తోన్నాయి. అఖిల్ యాక్టింగ్‌తో పాటు కొన్ని యాక్షన్ సీక్వెన్స్ మినహా సినిమాలో ఎలాంటి కొత్తదనం లేదని అంటోన్నారు. కంప్లీట్ ఔట్‌డేటెడ్ స్టోరీతో సురేందర్‌రెడ్డి ఈసినిమాను తెరకెక్కించాడని ట్వీట్లు చేస్తోన్నారు. అఖిత్‌తో పాటు మిగిలిన పాత్రలను డిజైన్ చేసిన తీరు బాగాలేదని చెబుతోన్నారు.
కథ మొత్తం లాజిక్‌లెస్‌గా సాగుతోందని పేర్కొంటున్నారు. సాంగ్స్, బీజీఎమ్ తో పాటు వీఎఫ్ఎక్స్ ఈ సినిమాకు పెద్ద మైనస్ అనే కామెంట్స్ వినిపిస్తోన్నాయి. హీరోహీరోయిన్ల లవ్‌ట్రాక్ పూర్తిగా బోర్ కొట్టిస్తోందని ఓవర్‌సీస్ ఆడియెన్స్ పేర్కొంటున్నారు. విలన్ క్యారెక్టర్, అతడితో అఖిల్ పోరాటంలో ఇంటెన్సిటీ మిస్సయిందని, క్లైమాక్స్ కూడా నిరాశపరుస్తుందని కామెంట్స్ వినిపిస్తోన్నాయి.
అఖిల్ యాక్టింగ్ ప్లస్
అఖిల్ యాక్టింగ్ ఒక్కటే ఏజెంట్‌కు పెద్ద ప్లస్ పాయింట్ అని చెబుతోన్నారు. స్పై రోల్‌లో అఖిల్ ఫుల్ ఎనర్జిటిక్‌గా కనిపించాడని అంటున్నారు. యాక్షన్ సన్నివేశాల్లో ఈజ్‌తో నటించాడని పేర్కొంటున్నారు. ఈ యాక్షన్ రోల్ కోసం అతడు పడిన కష్టం స్క్రీన్‌పై కనిపిస్తోందని, కానీ సురేందర్‌రెడ్డి డైరెక్షన్, రొటీన్ స్టోరీ కారణంగా అఖిల్ శ్రమ మొత్తం వృథాగా మారిపోయినట్లు చెబుతోన్నారు. అఖిల్‌కు మరో డిజాస్టర్ తప్పదనే కామెంట్స్ వినిపిస్తోన్నాయి.