Movies In Theaters This Week: ఏజెంట్ వర్సెస్ పొన్నియన్ సెల్వన్ 2 - సెంటిమెంట్ డేట్‌న హిట్ కొట్టేది ఎవరో?
Movies In Theaters This Week: ఈ వారం బాక్సాఫీస్ వద్ద అఖిల్ ఏజెంట్‌తో మణిరత్నం పొన్నియన్ సెల్వన్ -2 పోటీపడబోతున్నది. ఈ రెండు భారీ బడ్జెట్ సినిమాల మధ్య పోరు ఆసక్తికరంగా మారింది.
Movies In Theaters This Week: ఈ వారం టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద అఖిల్ ఏజెంట్, మణిరత్నం పొన్నియన్ సెల్వన్ -2 పోటీపడబోతున్నాయి. ఈ రెండు భారీ బడ్జెట్ సినిమాల మధ్య ఫైట్ ఆసక్తికరంగా మారింది. అయితే ప్రచారం, బజ్‌లో ఏజెంట్‌తో పోలిస్తే పొన్నియన్ సెల్వన్ చాలా వెనుకబడిపోయింది.
ఏజెంట్ ప్రమోషన్స్‌లో అఖిల్ (Akhil) అగ్రెసివ్‌గా కనిపిస్తోన్నాడు. గ్యాప్ లేకుండా బ్యాక్ టూ బ్యాక్ ఈవెంట్స్, ఇంటర్వ్యూలతో ఫుల్ బిజీగా కనిపిస్తోన్నాడు. ఆదివారం వరంగల్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. త్వరలోనే హైదరాబాద్‌లో మరో భారీ ఈవెంట్‌ను ప్లాన్ చేస్తోన్నట్లు తెలిసింది.
జీరో బజ్
మరోవైపు పొన్నియన్ సెల్వన్ ప్రమోషన్స్ విషయంలో పూర్తిగా వెనుకబడిపోయింది. ఒకే ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ మినహా తెలుగు స్టేట్స్‌లో ఎలాంటి ప్రమోషన్స్ చేయలేదు. మరోవైపు పొన్నియన్ సెల్వన్ ఫస్ట్ పార్ట్‌కు తెలుగు నాట పెద్దగా ఆదరణ దక్కలేదు. పూర్తిగా తమిళ కల్చర్, సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ మణిరత్నం ఈ సినిమాను తెరకెక్కించారు. లెక్కకుమించి పాత్రలు కనిపించడం, ఏ క్యారెక్టర్‌కు సరైన ఇంపార్టెన్స్ లేకపోవడంతో పొన్నియన్ సెల్వన్ మోస్తారు వసూళ్లను మాత్రమే రాబట్టింది.
ఫస్ట్ పార్ట్ ఇంపాక్ట్ కారణంగా తెలుగు స్టేట్స్‌లో పొన్నియన్ సెల్వన్ సీక్వెల్‌పై జీరో బజ్ ఉంది. మణిరత్నం (Maniratnam) ఫ్యాన్స్ మినహా మిగిలిన ప్రేక్షకులు ఈ సినిమాను ఎంత వరకు ఆదరిస్తారన్నది అనుమానంగానే మారింది. అదే ఏజెంట్‌కు కలిసివచ్చే అవకాశం ఉన్నట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతోన్నాయి. ఏజెంట్ ఈ వారం బాక్సాఫీస్ వద్ద హకా కొనసాగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతోన్నారు.
సెంటిమెంట్ డేట్
ఏప్రిల్ 28 టాలీవుడ్‌కు బాగా కలిసివచ్చింది. ఈ డేట్‌న మహేష్ బాబు పోకిరి, ప్రభాస్ బాహుబలి-2తో పాటు రిలీజైన పలు సినిమాలు అద్భుత విజయాలతో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాశాయి. ఆ సెంటిమెంట్‌ను ఏజెంట్, పొన్నియన్ సెల్వన్ -2లలో ఏది కొనసాగిస్తుందన్నది మరో నాలుగు రోజుల్లో తేలనుంది. స్పై యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన ఏజెంట్‌కు సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహించాడు. దాదాపు ఎనభై కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను రూపొందించారు. ఇప్పటివరకు అఖిల్ సినిమా ఏది కూడా యాభై కోట్ల కలెక్షన్స్ మార్కును దాటలేదు.
ఈ నేపథ్యంలో ఏజెంట్ రికవరీ అయ్యే అవకాశాలు తక్కువే అని తెలుస్తోంది. పాన్ ఇండియన్ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాను మొదలుపెట్టారు. కానీ ఇప్పుడు కేవలం తెలుగుతో పాటు మలయాళ భాషల్లోనే సినిమాను రిలీజ్ చేయాల్సిరావడం నిర్మాతలకు ఇబ్బందిగానే మారనున్నట్లు తెలుస్తోంది.
ఏజెంట్ మూవీలో మలయాళ స్టార్ మమ్ముట్టి కీలక పాత్రను పోషించాడు. ఇందులో సాక్షి వైద్య హీరోయిన్‌గా నటించింది. మరోవైపు పొన్నియన్ సెల్వన్ 2లో ఐశ్వర్యరాయ్, విక్రమ్, కార్తి, జయంరవి, త్రిష కీలక పాత్రలను పోషించారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించింది.
రెండు చిన్న సినిమాలు కూడా….
ఈ రెండు సినిమాలతో పాటు చేతన్ చీను హీరోగా నటించిన విద్యార్థి మూవీ ఏప్రిల్ 29న రిలీజ్ కానుంది. అలాగే నందితాశ్వేత ప్రధాన పాత్రను పోషించిన రానా పెనిమిటి మూవీ కూడా ఏప్రిల్ 28న తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది.