Akhil Agent: ఏజెంట్ తర్వాత అఖిల్ రేంజ్ మరో లెవల్లో ఉంటుంది: ప్రొడ్యూసర్ అనిల్ సుంకర
Akhil Agent: ఏజెంట్ తర్వాత అఖిల్ రేంజ్ మరో లెవల్లో ఉంటుందని అన్నాడు ప్రొడ్యూసర్ అనిల్ సుంకర. ఈ శుక్రవారం (ఏప్రిల్ 28) ఈ ఏజెంట్ మూవీ రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే.
Akhil Agent: అఖిల్ నటించిన ఏజెంట్ మూవీ ఎన్నో రోజులు ఊరించిన తర్వాత థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. ఈ శుక్రవారం (ఏప్రిల్ 28) ఏజెంట్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా మూవీ ప్రొడ్యూసర్ అనిల్ సుంకర మీడియాతో మాట్లాడాడు. ఏజెంట్ మూవీ తర్వాత అఖిల్ రేంజ్ మరో లెవల్లో ఉంటుందని, ఏజెంట్ ముందు అఖిల్.. ఏజెంట్ తర్వాత అఖిల్ అని మాట్లాడుకుంటారని అతడు అనడం విశేషం.
ఏజెంట్ మూవీలో గంటన్నర పాటు గ్రాఫిక్స్ ఉంటాయని, దీని కోసం చాలా రోజులుగా టీమ్ అంతా శ్రమిస్తోందని అనిల్ సుంకర చెప్పాడు. ఇలాంటి స్పై మూవీస్ లో చిన్న తప్పు కూడా దొర్లకుండా చూసుకోవాలని, అందుకే చాలా సమయం తీసుకుందని తెలిపాడు. ఏజెంట్ మూవీని ఎందుకు పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేయడం లేదని అడగగా.. దానికి కనీసం మూడు నెలల సమయం కావాలని, తొలి వారం తెలుగులో నడిచిన తర్వాత రెండో వారం నుంచి అటు వైపు చూసే ఆలోచన ఉన్నట్లు అనిల్ సుంకర వెల్లడించాడు.
ఏజెంట్ రిలీజ్ తర్వాత అఖిల్ రేంజ్ మరో లెవల్లో ఉంటుందని స్పష్టం చేశాడు. ఇక మూవీ కథపై స్పందిస్తూ.. ఇదొక యాక్షన్ మూవీ అని, కథ భిన్నంగా ఉంటుందని చెప్పాడు. విజువల్స్ చాలా గ్రాండ్ గా ఉంటాయని అన్నాడు. ఏజెంట్ లో అఖిల్ చాలా సాహసాలే చేశాడని, అవన్నీ ప్రేక్షకులను మెప్పిస్తాయని తెలిపాడు. ఏజెంట్ క్యారెక్టర్ లో ఫన్ ఉంటుందని, అతడు ప్రతి విషయాన్నీ ఎంజాయ్ చేయడం ట్రైలర్ లో చూసే ఉంటారని అన్నాడు.
ఏజెంట్ మూవీకి సురేందర్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఈ సినిమా నుంచి వచ్చిన పాటలు, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అఖిల్ కూడా చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు.
సంబంధిత కథనం
టాపిక్