Agent Wild Saala Song: పిచ్చెక్కిస్తున్న ఏజెంట్ 'వైల్డ్ సాలా' సాంగ్
Agent Wild Saala Song: పిచ్చెక్కిస్తోంది ఏజెంట్ మూవీ నుంచి వచ్చిన 'వైల్డ్ సాలా' సాంగ్. మంగళవారం (ఏప్రిల్ 25) ఈ వీడియో సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.
Agent Wild Saala Song: టాలీవుడ్ లో మోస్ట్ అవేటెడ్ మూవీస్ లో ఒకటి ఏజెంట్. అఖిల్ అక్కినేని నటించిన ఈ సినిమా ఎంతో ఆసక్తి రేపుతోంది. అఖిల్ కెరీర్ కు ఈ మూవీ పెద్ద బ్రేక్ ఇస్తుందన్న నమ్మకంతో అభిమానులు ఉన్నారు. చాలా రోజుల వెయిటింగ్ తర్వాత ఈ మూవీ వచ్చే శుక్రవారం (ఏప్రిల్ 28) ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
అయితే మంగళవారం (ఏప్రిల్ 25) మేకర్స్ ఓ వీడియో సాంగ్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్ పేరు వైల్డ్ సాలా (Wild Saala). మూవీలో ఐటెమ్ సాంగ్ అయిన ఇందులో బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా ఇరగదీసింది. ట్రైలర్ తోనే సినిమాపై అంచనాలను భారీగా పెంచేసిన మేకర్స్.. ఇప్పుడీ పాటతో వైల్డ్ నెస్ ను మరో రేంజ్ కు తీసుకెళ్లారు.
సురేందర్ రెడ్డి ప్రతి సినిమా హీరోలాగే ఈ సినిమాలో అఖిల్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. అతని మేకోవర్ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇక తాజాగా వచ్చిన వీడియో సాంగ్ కు రఘురాం లిరిక్స్ అందించగా.. ఈ పాటకు మాత్రమే భీమ్స్ సీసిరోలియో మ్యూజిక్ కంపోజ్ చేశాడు. నిజానికి ఏజెంట్ మూవీకి హిప్ హాప్ తమిళ మ్యూజిక్ ఇచ్చాడు.
ఇంతకుముందు వచ్చిన పాటలన్నీ కాస్త డిఫరెంట్ ఫీల్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక ఈ ఐటెమ్ సాంగ్ బీట్స్ కూడా పిచ్చెక్కించేలా ఉన్నాయి. వైల్డ్ సాలా అంటూ ఈ మూవీలో బీస్ట్ లుక్ లో కనిపిస్తున్న అఖిల్ కు తగినట్లుగా లిరిక్స్ ఉండటం విశేషం. ఈ వీడియో సాంగ్ నిమిషంన్నర పాటు ఉంది. ఈ పాటను భీమ్స్ తోపాటు శ్రావణ భార్గవి, స్వాతి రెడ్డి, అమలా చెంబోలు పాడారు.
ఏజెంట్ మూవీలో అఖిల్ సరసన సాక్షి వైద్య ఫిమేల్ లీడ్ గా నటించిన విషయం తెలిసిందే. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కీలకపాత్రలో కనిపిస్తున్నాడు. కెరీర్లో ఓ మెగా హిట్ కోసం చూస్తున్న అఖిల్.. ఏజెంట్ మూవీ కోసం బాగానే కష్టపడినట్లు కనిపిస్తోంది. మరి ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను ఏమేరకు అందుకుంటుందో చూడాలి.
సంబంధిత కథనం
టాపిక్