తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Actor Brahmaji: హైదరాబాద్ రెస్టారెంట్లలో కల్తీ.. నటుడు బ్రహ్మాజీ సెటైర్.. ఏమన్నాడో తెలిస్తే నవ్వాల్సిందే!

Actor Brahmaji: హైదరాబాద్ రెస్టారెంట్లలో కల్తీ.. నటుడు బ్రహ్మాజీ సెటైర్.. ఏమన్నాడో తెలిస్తే నవ్వాల్సిందే!

Sanjiv Kumar HT Telugu

24 May 2024, 14:09 IST

google News
  • Actor Brahmaji Hyderabad Restaurants Food Safety: హైదరాబాద్ రెస్టారెంట్లపై తనదైన శైలీలో సెటైర్ వేశారు సీనియర్ యాక్టర్ బ్రహ్మాజీ. ఇటీవల సిటీలోని కొన్ని ఏరియాల్లో పాపులర్ రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో నటుడు బ్రహ్మాజీ కౌంటర్ ఇస్తూ ట్వీట్ చేశారు.

హైదరాబాద్ రెస్టారెంట్లలో కల్తీ.. నటుడు బ్రహ్మాజీ సెటైర్.. ఏమన్నాడో తెలిస్తే నవ్వాల్సిందే!
హైదరాబాద్ రెస్టారెంట్లలో కల్తీ.. నటుడు బ్రహ్మాజీ సెటైర్.. ఏమన్నాడో తెలిస్తే నవ్వాల్సిందే!

హైదరాబాద్ రెస్టారెంట్లలో కల్తీ.. నటుడు బ్రహ్మాజీ సెటైర్.. ఏమన్నాడో తెలిస్తే నవ్వాల్సిందే!

Brahmaji About Hyderabad Restaurants: టాలీవుడ్‌లో ఎన్నో ఏళ్లుగా నటుడిగా మంచి స్థానం సంపాదించుకున్నారు యాక్టర్ బ్రహ్మాజీ (Brahmaji). హీరోగా ప్రారంభమైన ఆయన సినీ కెరీర్‌లో పలు సినిమాలతో అలరించారు. అనంతరం సపోర్టింగ్ రోల్స్, విలన్ పాత్రలు, కమెడియన్‌గా నటిస్తూ ఆదరాభిమానాలు పొందుతున్నారు.

సింధూరం సినిమాలో

చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ స్టార్ హీరోలు, జూనియర్ కథానాయకులతో నటిస్తూ ప్రతి సినిమాలో మెరుస్తున్నారు నటుడు బ్రహ్మాజీ. సింధూరం సినిమాలో రవితేజతో (Ravi Teja) కలిసి నటించిన బ్రహ్మాజీ ఇటీవల టిల్లు స్క్వేర్, చారి 111, విరూపాక్ష, జాతి రత్నాలు వంటి సినిమాలతో అలరించారు. ఇక సినిమాల సంగతి పక్కన పెడితే ఆయన నిజ జీవితంలో బ్రహ్మాజీ కామెడీ టైమింగ్ అదిరిపోతుంది.

హైదరాబాద్ రెస్టారెంట్స్

సోషల్ మీడియాలో మీమ్స్ డైలాగ్స్ కొడుతూ షోలలో సూపర్ ఫన్ జనరేట్ చేస్తుంటారు. అలాగే సెలబ్రిటీలకు సంబంధించిన ట్వీట్లకు, ప్రశ్నలకు ఇన్ డైరెక్ట్‌గా సెటైరికల్‌గా ఆన్సర్స్ ఇస్తూ నెటిజన్స్‌కు మంచి ఎంటర్టైన్‌మెంట్ అందిస్తుంటారు నటుడు బ్రహ్మాజీ. ఇక తాజాగా మరోసారి తన ట్వీట్‌తో ఆకట్టుకున్నారు యాక్టర్ బ్రహ్మాజీ. ఈసారి హైదరాబాద్ రెస్టారెంట్లపై (Hyderabad Restaurants) కామెంట్ చేశారు.

కల్తీ ఆహారం

ఇటీవల హైదరాబాద్‌లోని కొన్ని ఏరియాల్లోని పాపులర్ రెస్టారెంట్ల్స్, కేఫ్‌లపై ఫుడ్ సెఫ్టీ అధికారులు (Food Safety Officers Raid) దాడులు నిర్వహించారు. ఈ పేరొందిన హోటళ్లలో చెడిపోయిన, కల్తీ నిల్వ ఆహారం, కాలం చెల్లిన వస్తువులను వాడుతున్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. అలాగే ఏమాత్రం శుభ్రత లేకుండా అపరిశుభ్రంగా ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఎక్స్ (గతంలో ట్విట్టర్) అకౌంట్‌లో అధికారికంగా ట్వీట్ పెట్టారు.

ఎక్కడ తినమంటారు?

ఈ విషయంపై తాజాగా నటుడు బ్రహ్మాజీ స్పందించారు. ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ట్వీట్‌పై స్పందిస్తూ "సర్.. మరి ఎక్కడ తినమంటారు..? ఇంటిలోనా..?" అని తనదైన స్టైల్‌లో అడిగారు. ఈ ట్వీట్ వెంటనే ఇంటర్నెట్‌లో వైరల్ అయింది. దీంతో నెటిజన్స్ వివిధ రకాలుగా రియాక్ట్ అవుతున్నారు.

నెటిజన్స్ కామెంట్స్

"ఇది అందరిని ఇంట్లో తినమని, బయటక తిండికి ఎక్కువగా అలవాటు పడకండి" అని ఇన్‌డైరెక్ట్‌గా బ్రహ్మాజీ హైదరాబాద్ రెస్టారెంట్లపై సెటైర్ వేసినట్లు నెటిజన్స్ అంటున్నారు. "ఏమైనా బ్రహ్మాజీ సార్ ట్వీట్స్‌కు నవ్వాల్సిందే" అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. మరోవైపు భారీగా బిల్లుల మోత మోగించే రెస్టారెంట్లు క్వాలిటీ ఆహారం అందించకపోవడంపై నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. మొత్తానికి మరోసారి బ్రహ్మాజీ ట్వీట్ వైరల్ అవుతోంది.

ఆదిపురుష్ డైలాగ్

ఇదిలా ఉంటే, ఇదివరకు బ్రహ్మాజీ ఇలాంటి విషయాలపై ట్వీట్స్ వేశారు. సెలబ్రిటీలకు సంబంధించిన ప్రశ్నలకు కూడా వెటకారంగా ఆన్సర్స్ ఇచ్చేవారు. ఇక ఆదిపురుష్ (Adipurush Movie) టైమ్‌లో ఓం కమ్ టూ మై రూమ్ అని ప్రభాస్ (Prabhas) చెప్పిన డైలాగ్ మీమ్స్‌లో బాగా వాడిన విషయం తెలిసిందే. ఇదే డైలాగ్‌ను లైక్ షేర్ సబ్‌స్క్రైబ్ మూవీ ప్రమోషన్స్‌లో బ్రహ్మాజీ విపరీతంగా వాడారు. సుమ (Anchor Suma) షోలోఏ ప్రశ్న అడిగినా కమ్ టు మై రూమ్ అంటూ ఫన్ జెనరేట్ చేశారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం