Kriti Sanon: నాకు అలాంటి మగాడు కావాలి.. డేటింగ్‌పై ఆదిపురుష్ కృతి సనన్ కామెంట్స్
Kriti Sanon About Dating : ఆదిపురుష్ సినిమాలో సీతగా అలరించిన కృతి సనన్ తనకు ఎలాంటి మగాడు కావాలో చెప్పింది. తాను ఇప్పుడు సింగిల్ అని అలాంటి మగాళ్లను తాను చాలా ఇష్టపడుతానని చెప్పుకొచ్చింది. ఓ ఇంటర్వ్యూలో కృతి సనన్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి
(1 / 7)
వన్ నేనొక్కడినే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన బ్యూటిఫుల్ కృతి సనన్ చాలా గ్యాప్ తర్వాత ఆదిపురుష్ సినిమాతో తెలుగు ఆడియెన్స్ ముందుకు వచ్చింది. (All Pics@Instagram)
(2 / 7)
బాలీవుడ్‌లో వరుస హిట్లతో దూసుకుపోతున్న కృతి సనన్ ఇటీవలే తేరీ బాటన్ మే ఐసా ఉల్జా జియా సినిమాతో మంచి హిట్ అందుకుంది. ఈ సినిమా ప్రమోషన్లలో డేటింగ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది కృతి సనన్.
(3 / 7)
శ్వేత జాతీయులు హాట్‌గా ఉండొచ్చు. కానీ, నేను ఇప్పటివరకు ఏ విదేశీయుడుకి అంతగా అట్రాక్ట్. కాలేదు. నాకు భారతీయ మగాళ్లు అంటేనే ఇష్టం అని కృతి సనన్ తెలిపింది.
(4 / 7)
దేశీయుడుతోనే నేను డేటింగ్‌కు ఇష్టపడతాను. హిందీ అర్థం చేసుకునే మగాడు అయితే ఓకే. నేను ప్రతీసారి ఇంగ్లీషులో మాట్లాడలేను, ఆంగ్ల పాటలకు డ్యాన్స్ చేయలేను అని కృతి సనన్ చెప్పుకొచ్చింది.
(5 / 7)
నాతో కలిసి పంజాబీ, హిందీ పాటలకు డ్యాన్స్ చేసే భారతీయ మగాడు కావాలి. అలాంటి వ్యక్తితే డేటింగ్ చేసేందుకు ఇష్టపడతాను అని కృతి సనన్ చెప్పింది. దీంతో ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
(6 / 7)
అయితే, ఇప్పటికే కృతి సనన్ ఓ వ్యక్తితో డేటింగ్‌లో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. తనకంటే వయసులో 10 ఏళ్లు చిన్నవాడు, స్టార్ క్రికెటర్ ఎంఎస్ ధోనీకి అత్యంత సన్నిహితుడైన కబీర్ బహియాతో కృతి సనన్ లవ్ ట్రాక్ నడిపిస్తోందని బాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇతర గ్యాలరీలు