Brahmaji on Suma: స్నాక్స్, భోజనం అంటూ యాంకర్ సుమను ఆట పట్టించిన బ్రహ్మాజీ.. ఆ వివాదాన్ని గుర్తు చేసేలా..: వీడియో-brahmaji makes fun with anchor suma during cash tv game show ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Brahmaji Makes Fun With Anchor Suma During Cash Tv Game Show

Brahmaji on Suma: స్నాక్స్, భోజనం అంటూ యాంకర్ సుమను ఆట పట్టించిన బ్రహ్మాజీ.. ఆ వివాదాన్ని గుర్తు చేసేలా..: వీడియో

Chatakonda Krishna Prakash HT Telugu
Dec 05, 2023 08:16 PM IST

Brahmaji on Suma: యాంకర్ సుమను ఆట పట్టించారు సీనియర్ నటుడు బ్రహ్మాజీ. సుమ గతంలో చేసిన ఓ కామెంట్ వివాదాస్పదం కాగా.. దాన్ని గుర్తు చేస్తు ఆయన సరదాగా పంచ్‍లు వేశారు.

సుమ, బ్రహ్మాజీ
సుమ, బ్రహ్మాజీ

Brahmaji on Suma: ప్రముఖ యాంకర్ సుమ ఇటీవల ఓ వివాదంలో చిక్కుకున్నారు. స్నాక్స్‌ను భోజనంలా తింటున్నారంటూ జర్నలిస్టులను సరదాగా అనడంతో అసంతృప్తి రేగింది. ఆదికేశవ మూవీ సాంగ్ లాంచ్ ఈవెంట్‍లో సుమ సరదాగా అన్న మాటపై కొందరు అభ్యంతరం తెలిపారు. దీంతో ఆమె క్షమాపణ కూడా చెప్పారు. దీంతో ఆ వివాదం అక్కడితో ముగిసింది. అయితే, తాజాగా క్యాష్ గేమ్ షోలో దీన్ని గుర్తు చేశారు సీనియర్ నటుడు బ్రహ్మాజీ.

ట్రెండింగ్ వార్తలు

నితిన్ హీరోగా నటించిన ఎక్స్‌ట్రా ఆర్జినరీ సినిమా ప్రమోషన్లలో భాగంగా క్యాష్‍ షోకు మూవీ యూనిట్ వచ్చింది. హీరో నితిన్, నటుడు బ్రహ్మాజీ, దర్శకుడు వక్కంతం వంశీ, కమెడియన్ హైపర్ ఆది క్యాష్ షోలో పాల్గొన్నారు. ఈ ఎపిసోడ్‍కు సంబంధించిన ప్రోమోను బయటికి వచ్చింది.

ముందుగా నితిన్, సుమ.. బ్రహ్మాజీపై కొన్ని పంచ్‍లు వేశారు. బ్రహ్మాజీ కళ్లద్దాలు పెట్టుకొని రావడంపై సరదాగా కామెడీ చేశారు. గండెల్లో కళ్లలో తెలుస్తుంది అని సుమ పాట పాడగా.. కళ్ల కింద క్యారీ బ్యాగ్‍లను కవర్ చేయడానికి బ్రహ్మాజీ గ్లాసెస్ పెట్టుకున్నారని కామెడీ చేశారు. ఆ తర్వాత ఇందిరానగర్ గడ్డ అంటూ బ్రహ్మాజీ కొత్త షో చేస్తారని ఆది సరగాదా అంటే.. సుమ మరో పంచ్ వేశారు. బాహుబలి ఫస్ట్ పార్టులో పుల్లలు ఏరుకునే క్యారెక్టర్ మీరే చేశారంటూ సుమను ఆది అన్నారు.

“బ్రహ్మాజీ మళ్లీ తింటున్నారు. పండ్ల సెట్ చూసుకోండి కొంచెం” అని సుమ అన్నారు. దీంతో బ్రహ్మాజీ స్పందించారు. “సుమ ఇది స్నాక్స్.. భోజనం కాదు.. భోజనం కాదు” అంటూ వివాదాస్పదమైన ఆ వ్యాఖ్యలను బ్రహ్మాజీ గుర్తు చేశారు. దీంతో అందరూ నవ్వారు.

మళ్లీ భోజనాలు ఎప్పుడు అని బ్రహ్మాజీ అన్నారు. దీంతో సుమ కూడా నవ్వారు. ఓ స్కిట్‍లో భాగంగా భోజనం ఎన్నింటికి చేస్తావో అడగవా, స్నాక్స్ ఎన్నింటికి పెడతారు అంటూ సుమను మళ్లీ ఆటపట్టించారు బ్రహ్మాజీ. దీంతో వెళ్లవయ్యా.. వెళ్లు అని సుమ అన్నారు. దీంతో అందుకే మొన్న అంటూ బ్రహ్మాజీ నవ్వారు. క్యాష్ గేమ్ షోలో ఈ ఎపిసోడ్ డిసెంబర్ 9న రాత్రి 9.30 గంటలకు ఈటీవీ ఛానెల్‍లో ప్రసారం కానుంది.

వక్కంతం వంశీ దర్శకత్వంలో నితిన్ హీరోగా నటించిన ఎక్స్‌ట్రా-ఆర్డినరీ సినిమా డిసెంబర్ 8న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్‍గా నటించారు.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.