Anchor Suma: యాంకర్ సుమపై జర్నలిస్ట్ ఆగ్రహం.. ‘స్నాక్స్’ వ్యాఖ్యతో అసంతృప్తి: వీడియో
Anchor Suma: యాంకర్ సుమపై ఓ సినీ జర్నలిస్టు ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిధి దాటారంటూ అసంతృప్తి చెందారు. అసలేం జరిగిందంటే..
Anchor Suma: ప్రముఖ యాంకర్ సుమ.. టీవీ షో అయినా, సినిమా ఈవెంట్ అయినా ఏ కార్యక్రమమైనా.. ఎనర్జిటిక్‍గా హోస్ట్ చేస్తారు. తన మార్క్ వాక్చాతుర్యంతో, టైమింగ్‍తో అందరినీ అలరిస్తారు. ఈవెంట్ ఏ మాత్రం బోరు కొట్టకుండా తన మాటలతో ఎంటర్‌టైన్ చేస్తుంటారు. ఆదికేశవ సినిమాలో మూడో పాట అయిన లీలమ్మో పాట లాంచ్ ఈవెంట్ నేడు (అక్టోబర్ 25) హైదరాబాద్‍లోని ఓ హోటల్‍లో జరిగింది. ఈ కార్యక్రమానికి సుమ హోస్ట్ చేశారు. అయితే, ఈ సందర్భంగా సుమ అన్న ఓ మాటపై ఓ జర్నలిస్టు అసంతృప్తి వ్యక్తం చేశారు. వివరాలివే..
తాము పెట్టిన స్నాక్స్‌ను భోజనంలా తింటున్నారో వాళ్లు తొందరగా లోపలికి వచ్చిన ఇక్కడ కెమెరాలను పెట్టాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామని జర్నలిస్టులను ఉద్దేశించి సుమ అన్నారు. అందరూ రావాలంటూ సరదాగా చెప్పే క్రమంగా ఆమె ఇలా అన్నారు. మిగిలిన వారిని రావాలని చెప్పాలని అక్కడే ఉన్న మరో కెమెరామెన్‍తో చెప్పారు. దీంతో స్నాక్స్‌ను భోజనంలా తింటున్నారంటూ సుమ చేసిన కామెంట్‍పై ఓ జర్నలిస్టు ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా వాళ్ల విషయంలో సుమ లిమిట్స్‌లో ఉండాలని అన్నారు. సుమ చేసిన వ్యాఖ్యలు తమకు కోపం తెప్పించాయని అసంతృప్తి వ్యక్తం చేశారు.
“ఈ ఈవెంట్‍లో స్టార్ట్ చేసే ముందు.. స్నాక్స్ భోజనంలా చేస్తున్నారని మీరు మీడియా వాళ్లను అన్నారు చూశారా.. అది ఒకటి అనకుండా ఉండి ఉంటే బాగుండేది” అని ఆ జర్నలిస్టు అన్నారు. దీంతో జోక్‍గా తాను అన్నానని, అందరూ తనకు చాలా ఏళ్ల నుంచి తెలుసు కదా అని సుమ సమర్థించుకున్నారు. “మీరు జోక్స్ బాగా చేస్తారు కానీ.. మీడియాను మినహాయిస్తే బాగుంటుందనిపిస్తోంది” అని ఆ జర్నలిస్టు అడిగారు. అయితే, “మీరు స్నాక్స్‌ను.. స్నాక్స్‌లాగే తిన్నారు.. ఓకేనా” అని సుమ అన్నారు. దీంతో ఆయనకు మళ్లీ కోపం వచ్చింది. “అదే వద్దనేది.. మీడియాను వద్దు.. జనరల్‍గా మీ యాంకరింగ్ అందరికీ ఇష్టమే కానీ.. మీడియా వరకు వద్దు ప్లీజ్” అని ఆ జర్నలిస్టు చెప్పారు. “మీకు బాధ కలిగించి ఉంటే చాలా సారీ. నా ఉద్దేశం అది కాదు” అని సుమ చెప్పారు. అయితే, తమకు బాధ కలిగిందని, కానీ ఓకే అని ఆ సదరు జర్నలిస్టు అనటంతో ఈ వాగ్వాదం ముగిసింది.
ఇక, ఆదికేశవ నుంచి మూడో పాట లీలమ్మో ఫుల్ లిరికల్ సాంగ్ నేడు రిలీజ్ అయింది. ఈ మాస్ బీట్ పాటకు హీరో వైష్ణవ్ తేజ్, హీరోయిన్ శ్రీలీల అదిరిపోయే డ్యాన్స్ చేశారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఈ లీలమ్మో పాటను నకాశ్ అజీజ్, ఇంద్రావతి చౌహాన్ పాడగా.. కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించారు. శ్రీకాంత్ ఎన్.రెడ్డి దర్శకత్వం వహించిన ఆదికేశవ సినిమా నవంబర్ 10వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది.
టాపిక్