తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Janasena Pawan Kalyan: అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల బరిలో పవన్ కళ్యాణ్? రెండు స్థానాల్లో పోటీ చేస్తారని ప్రచారం

Janasena Pawan Kalyan: అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల బరిలో పవన్ కళ్యాణ్? రెండు స్థానాల్లో పోటీ చేస్తారని ప్రచారం

Sarath chandra.B HT Telugu

27 March 2024, 11:49 IST

google News
    • Janasena Pawan Kalyan: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ పోటీ చేసే స్థానాలపై కొత్త ప్రచారం తెరపైకి వచ్చింది. రానున్న ఎన్నికల్లో పవన్ అసెంబ్లీతో పాటు పార్లమెంటుకు కూడా పోటీ చేసే యోచనలో ఉన్నట్టు సమాచారం
ఢిల్లీ పర్యటనలో బీజేపీ అగ్రనేత అమిత్‌షాతో పవన్ కళ్యాణ్
ఢిల్లీ పర్యటనలో బీజేపీ అగ్రనేత అమిత్‌షాతో పవన్ కళ్యాణ్

ఢిల్లీ పర్యటనలో బీజేపీ అగ్రనేత అమిత్‌షాతో పవన్ కళ్యాణ్

Janasena Pawan Kalyan: సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ కూటమితో కలిసి బరిలోకి దిగుతున్న జనసేనాని ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పవన్ కళ్యాణ్‌ గత ఎన్నికల్లో భీమవరం, గాజువాక నియోజక వర్గాల్లో పోటీ చేశారు. ఈసారి భీమవరం, పిఠాపురంలలో పవన్ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతున్నా స్పష్టత రాలేదు.

ఓ వైపు ఢిల్లీలో కూటమిలో సీట్ల సర్దుబాటు ప్రయత్నాలు జరుగుతున్న సమయంలో పవన్ కళ్యాణ్ లోక్‌సభకు కూడా పోటీ చేేసే యోచనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. జనసేనకు కేటాయించిన మూడు స్థానాల్లో ఒక నియోజక వర్గం నుంచి పవన్ బరిలో నిలవాలని యోచిస్తున్నట్టు ఆ పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

మచిలీపట్నంలో ఇప్పటికే సిట్టింగ్ ఎంపీ వల్లభనేని బాలశౌరి ఖరారు చేశారు. అనకాపల్లి , కాకినాడ పార్లమెంటు నియోజక వర్గాల్లో ఏదొక స్థానం నుంచి పవన్ పోటీ చేయొచ్చని చెబుతున్నారు. లోక్‌సభకు ఎన్నికైతే కేంద్ర క్యాబినెట్‌లో చోటు దక్కించు కోవచ్చని భావిస్తున్నారు. టీడీపీ-జనసేన కూటమి కలిసి పోటీ చేస్తున్నా పరిమిత సంఖ్యలో జనసేన పోటీ చేస్తున్నందున ముఖ్యమంత్రి స్థానం విషయంలో గందరగోళం తలెత్తకుండా ఉండటానికి లోక్‌సభకు కూడా పవన్ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది.

అసెంబ్లీతో పాటు లోక్‌సభకు కూడా పవన్ పోటీ చేస్తే అనవసరమైన విమర్శలు తలెత్తుతాయని కూడా ఆ పార్టీ నేతలు అనుమానిస్తున్నారు. గత ఎన్నికల్లో గాజువాక, భీమవరం నుంచి పోటీ చేసిన పవన్ రెండు చోట్ల ఓడిపోయారు. దీంతొో ఈ సారి ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాలని భావిస్తున్నారు.

ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వకూడదనే ఉద్దేశంతోనే టీడీపీ-బీజేపీలో కలిసి కూటమి కోసం తీవ్రంగా శ్రమించినట్టు పవన్ చెబుతున్నారు. 2014లో మూడు పార్టీలు కలిసి ఎన్నికల్లో పోటీ చేసినా, జనసేన అభ్యర్థులు పోటీ చేయలేదు. 2019లో పోటీ చేసినా రాజోలులో మాత్రమే ఆ పార్టీ అభ్యర్తులు విజయం సాధించారు.

2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ వామపక్షాలతో కలిసి భీమవరంBhimavaram నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈ సారి టీడీపీTDPతో కలిసి పోటీ చేయాలని నిర్ణయించారు.

ఉమ్మడి అభ్యర్థిగా మరోసారి భీమవరం నుంచి పోటీ చేయనున్నట్లు పవన్ కళ్యాణ్ టీడీపీ నేతలకు గత నెలలోనే వివరించారు. తనకు సహకరించాలని ఆ పార్టీ నేతలకు విజ్ఞప్తి చేశారు. పవన్ కళ్యాణ్ ప్రతిపాదనకు టీడీపీ నేతలు కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.

గత ఎన్నికల్లో భీమవరం, గాజువాక Gajuvaka నియోజక వర్గాల్లో రెండు చోట్ల పవన్ ఓటమి పాలయ్యారు. 2019 ఎన్నికల్లో భీమవరంలో వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ విజయం సాధించారు. ఓడిన చోటే నిలబడాలనే లక్ష్యంతో పవన్ మళ్లీ భీమవరం పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

భీమవరం నుంచి పోటీ చేయాలనే నిర్ణయాన్ని టీడీపీ అధ్యక్షురాలి ఇంటి వద్ద పవన్ కళ్యాణ‌ ప్రకటించాలని భావించినా పెద్ద సంఖ్యలో అభిమానులు,కార్యకర్తలు తరలి రావడంతో అక్కడ ఆ ప్రకటన చేయడానికి కుదరలేదని టీడీపీ నేతలు చెబుతున్నారు.

భీమవరం పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్‌ మాజీ ఎమ్మెల్యే పులవర్తి రామాంజనేయులు ఇంటికి కూడా వెళ్లారు. ఆంజనేయులు రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. టీడీపీ అధ్యక్షురాలు సీతామహలక్ష్మీ నివాసంలో పలువురు ముఖ్య నాయకులతో పవన్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో వైసీపీని ఓడించేందుకు తనకు సహకరించాలని టీడీపీ నేతలకు పవన్ విజ్ఞప్తి చేశారు.

పిఠాపురం ఆప్షన్ కూడా….

విస్తృత కసరత్తు తర్వాత పిఠాపురం నుంచి కూడా పోటీ చేయడానికి పవన్‌ మొగ్గు చూపినట్లు తెలిసింది. పిఠాపురం నియోజకవర్గంలో కాపు సామాజికవర్గం ఓట్లు దాదాపు 91 వేలు ఉండటంతో అక్కడి నుంచి పోటీచేస్తే పవన్‌ విజయానికి ఢోకా ఉండదని జనసేన వర్గాల్లో బలంగా ఉంది. దీంతో పిఠాపురం నుంచి పోటీకి పవన్‌ మొగ్గుచూపినట్టు తెలుస్తోంది. కాకినాడ రూరల్‌ నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా పంతం నానాజీని ప్రకటించారు. కాకినాడ ఎంపీ సీటు కూడా దాదాపు జనసేనకే ఖాయం కావడంతో పవన్ భీమవరం-పిఠాపురం స్థానాలతో పాటు కాకినాడ పార్లమెంటు స్థానానికి కూడా పోటీ చేయొచ్చని చెబుతున్నారు.

తదుపరి వ్యాసం