CM Jagan: ప్యాకేజీ స్టార్ కు భీమవరం, గాజువాకతో సంబంధం లేదు-cm jagan made sensational comments on pawan in samarlakota ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Cm Jagan: ప్యాకేజీ స్టార్ కు భీమవరం, గాజువాకతో సంబంధం లేదు

CM Jagan: ప్యాకేజీ స్టార్ కు భీమవరం, గాజువాకతో సంబంధం లేదు

Oct 12, 2023 01:31 PM IST Muvva Krishnama Naidu
Oct 12, 2023 01:31 PM IST

  • చంద్రబాబు, పవన్ కు అధికారం కావాల్సింది దోచుకోవటానికేనని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. గతంలో ఏ ప్రభుత్వం ఇన్ని లక్షల ఇళ్లు పేదలకు ఇవ్వలేదన్నారు. సామర్లకోటలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న CM జగన్, పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కు ఏపీలో ఇళ్లు కూడా లేదన్నారు. ఆడవాళ్లన్నా, పెళ్లిళ్ల వ్యవస్థ అన్న పవన్ కు గౌరవం లేదన్నారు. రాష్ట్రంలో 7.43 లక్షల ఇళ్ల నిర్మా ణం పూర్తి చేశామన్న జగన్.. మరో 14.33 లక్షల ఇళ్ల నిర్మా ణం జరుగుతోందన్నారు. లక్షల విలువైన ఆస్తిని అక్క చెల్లెమ్మల చేతిలో పెడుతున్నామన్నారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.2.75 లక్షలు ఖర్చు చేస్తున్నామని, అక్కడ మౌలిక వసతులను ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుందని జగన్ స్పష్టం చేశారు.

More