Pawan Kalyan Clarity: పోటీ అక్కడి నుంచే… స్పష్టత ఇచ్చేసిన పవన్ కళ్యాణ్-janasena chief pawan kalyan asked tdp leaders to cooperate in bhimavaram ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Pawan Kalyan Clarity: పోటీ అక్కడి నుంచే… స్పష్టత ఇచ్చేసిన పవన్ కళ్యాణ్

Pawan Kalyan Clarity: పోటీ అక్కడి నుంచే… స్పష్టత ఇచ్చేసిన పవన్ కళ్యాణ్

Sarath chandra.B HT Telugu
Feb 21, 2024 12:57 PM IST

Pawan Kalyan Clarity: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోటీ చేసే నియోజక వర్గంపై స్పష్టత వచ్చేసింది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ మరోసారి భీమవరంBhimavaram నుంచి పోటీ చేయనున్నారు.

భీమవరంలో అభిమానులకు అభివాదం చేస్తున్న పవన్ కళ్యాణ్
భీమవరంలో అభిమానులకు అభివాదం చేస్తున్న పవన్ కళ్యాణ్

Pawan Kalyan Clarity: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ‌్ పోటీ చేసే నియోజక వర్గంపై స్పష్టత వచ్చేసింది. త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ టీడీపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థిగా భీమవరం నుంచి పోటీ Contest చేయనున్నారు. 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ వామపక్షాలతో కలిసి భీమవరంBhimavaram నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈ సారి టీడీపీTDPతో కలిసి పోటీ చేయాలని నిర్ణయించారు.

భీమవరంలో పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్‌ బుధవారం ఉదయం జిల్లా ముఖ్య నాయకులతో భేటీ అయ్యారు. టీడీపీ TDP జిల్లా అధ్యక్షురాలు సీతారామలక్ష్మీ నివాసానికి వెళ్ళిన పవన్ కళ్యాణ్‌ టీడీపీ నేతలతో మనసులో మాట చెప్పారు.

ఉమ్మడి అభ్యర్థిగా మరోసారి భీమవరం నుంచి పోటీ చేయనున్నట్లు పవన్ కళ్యాణ్ టీడీపీ నేతలకు వివరించారు. తనకు సహకరించాలని ఆ పార్టీ నేతలకు విజ్ఞప్తి చేశారు. పవన్ కళ్యాణ్ ప్రతిపాదనకు టీడీపీ నేతలు కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.

గత ఎన్నికల్లో భీమవరం, గాజువాకGajuvaka నియోజక వర్గాల్లో రెండు చోట్ల పవన్ ఓటమి పాలయ్యారు. 2019 ఎన్నికల్లో భీమవరంలో వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ విజయం సాధించారు. ఓడిన చోటే నిలబడాలనే లక్ష్యంతో పవన్ మళ్లీ భీమవరం పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

భీమవరం నుంచి పోటీ చేయాలనే నిర్ణయాన్ని టీడీపీ అధ్యక్షురాలి ఇంటి వద్ద పవన్ కళ్యాణ‌ ప్రకటించాలని భావించినా పెద్ద సంఖ్యలో అభిమానులు,కార్యకర్తలు తరలి రావడంతో అక్కడ ఆ ప్రకటన చేయడానికి కుదరలేదని టీడీపీ నేతలు చెబుతున్నారు. బుధవారం మధ్యాహ్నం పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో పవన్ అభ్యర్థిత్వంపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

భీమవరం పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్‌ మాజీ ఎమ్మెల్యే పులవర్తి రామాంజనేయులు ఇంటికి కూడా వెళ్లారు. ఆంజనేయులు రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. టీడీపీ అధ్యక్షురాలు సీతామహలక్ష్మీ నివాసంలో పలువురు ముఖ్య నాయకులతో పవన్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో వైసీపీని ఓడించేందుకు తనకు సహకరించాలని టీడీపీ నేతలకు పవన్ విజ్ఞప్తి చేశారు.

తోట సీతారామలక్ష్మీ నివాసానికి వెళ్లిన సమయంలోనే పవన్ కళ్యాణ్ తాను మళ్లీ భీమవరం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. తనకు సహకరించాలని టీడీపీ నేతలకు కోరారు. ఆ సమయంలో భీమవరం , భీమవరం రూరల్, వీరవాసరం ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు తరలి వచ్చారు. నిమ్మల రామానాయుడు, రాధాకృష్ణ వంటి నేతలతో పాటు ఉండి మాజీ ఎమ్మెల్యే శివ కూడా టీడీపీ అధ్యక్షురాలి నివాసానికి వచ్చారు. పవన్ కళ్యాణ్ పోటీ చేయాలనే నిర్ణయాన్ని వారు స్వాగతించినట్టు చెబుతున్నారు.

జిల్లాకు సంబంధించిన నాయకులతో పవన్‌ కళ్యాణ్‌ పొత్తు గురించి చర్చించినట్లు ఉండి మాజీ ఎమ్మెల్యే శివ చెప్పారు. టీడీపీ ఓటు షేరింగ్ పవన్ కళ్యాణ్‌కు అందుతుందని, ఖచ్చితంగా పవన్ కళ్యాణ‌ గెలుస్తారని ఆయన చెప్పారు. ప్రజలంతా ఆయనకు మద్దతు ఇస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. జనసేన, టీడీపీల ఉమ్మడి అభ్యర్ధిత్వానికి అంతా సానుకూలంగా స్పందించినట్లు టీడీపీ నేతలు చెబుతున్నారు.