తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Bjp Tdp Alliance : జగన్​ని కాదని.. టీడీపీతో బీజేపీ ఎందుకు కలిసింది?- అమిత్​ షా జవాబు ఇదే!

BJP TDP alliance : జగన్​ని కాదని.. టీడీపీతో బీజేపీ ఎందుకు కలిసింది?- అమిత్​ షా జవాబు ఇదే!

Sharath Chitturi HT Telugu

16 March 2024, 7:20 IST

google News
    • 2024 Andhra Pradesh assembly elections : ఆంధ్ర సీఎం జనగ్​ని కాదని.. టీడీపీతో బీజేపీ ఎందుకు పొత్తు కుదుర్చుకుంది? అన్న ప్రశ్నకు సమాధానం ఇచ్చారు అమిత్​ షా.
టీడీపీతో బీజేపీ మళ్లీ ఎందుకు కలిసింది?
టీడీపీతో బీజేపీ మళ్లీ ఎందుకు కలిసింది? (Amit Shah X)

టీడీపీతో బీజేపీ మళ్లీ ఎందుకు కలిసింది?

TDP BJP Janasena alliance : టీడీపీ- జనసేన- బీజేపీ పార్టీలు కూటమిగా ఏర్పడటంతో.. 2024 ఆంధ్రప్రదేశ్​ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. అధికారంలో ఉన్న వైసీపీని గద్దె దించడమే లక్ష్యంగా కూటమి పని చేస్తోంది. అయితే.. గతంలో విడిపోయిన టీడీపీ- బీజేపీలు మళ్లీ ఎందుకు కలిశాయి? టీడీపీతో కలవాలని బీజేపీ ఎందుకు నిర్ణయించుకుంది? సీఎం జగన్​ మోహన్​ రెడ్డిని కాదని.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో కలిసి ముందుకు వెళ్లాలని కమలదళం ఎందుకు నిర్ణయించుకుంది? వంటి ప్రశ్నలకు తాజాగా సమాధానం ఇచ్చారు కేంద్రమంత్రి, బీజేపీ కీలక నేత అమిత్​ షా.

'చంద్రబాబుతో మళ్లీ కలవడానికి అదే కారణం..'

2024 ఆంధ్రప్రదేశ్​ ఎన్నికలు, 2024 లోక్​సభ ఎన్నికల్లో కలిసి పోటీచేస్తున్నట్టు, సీట్ల సద్దుబాటు కూడా ముగిసినట్టు.. ఇటీవలే ప్రకటించింది టీడీపీ- బీజేపీ- జనసేన కూటమి. శుక్రవారం జరిగిన ఓ ఈవెంట్​లో పాల్గొన్ని అమిత్​ షా.. ఆంధ్రప్రదేశ్​లో తాజా రాజకీయ పరిస్థితులపై స్పందించారు. చంద్రబాబు నాయుడుతో మళ్లీ ఎందుకు కలిశామో చెప్పారు.

2024 Andhra Pradesh elections : "ఎన్​డీఏని వదిలియేలాని మేము చంద్రబాబుకు చెప్పలేదు. ఆయనే నిర్ణయం తీసుకుని వెళ్లిపోయారు. ప్రజల్లోకి వెళ్లి, ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ విషయం తెలుసుకుని మళ్లీ మాతో కలిశారు. ఆయనకు మేము స్వాగతం పలికాము," అని అమిత్​ షా అన్నారు.

అయితే.. జగన్​ మోహన్​ రెడ్డీ వైసీపీ కూడా.. అనేక విషయాల్లో బీజేపీకి, ఎన్​డీఏకి ఇంత కాలం మద్దతు ఇస్తూ వచ్చింది. రాజ్యసభలో అనేక మార్లు ఎన్​డీఏకి ఓటు వేసింది. మరి.. జగన్​ని కాదని టీడీపీని బీజేపీ ఎందుకు ఎంచుకుంది? అన్న ప్రశ్నకు సమాధానం ఇచ్చారు అమిత్​ షా.

ఇదీ చూడండి:- TDP JSP Alliance 2024 : కాకరేపిన ‘పవన్’ ప్రకటన - పిఠాపురంలో ఆందోళనకు దిగిన టీడీపీ శ్రేణులు

"పార్లమెంట్​లో వేసే ఓట్లను, రాజకీయ పొత్తులతో కలపకూడదు. సమస్యను బట్టి.. పార్లమెంట్​లో పార్టీలు ఓట్లు వేస్తాయి. తమకు నచ్చితే అనుకులంగా ఉంటాయి. లేదంటే వ్యతిరేకంగా ఓట్లు వేస్తాయి. వైసీపీ కూడా.. మూడు సందర్భాల్లో మాకు వ్యతిరకంగా ఓట్లు వేసింది. రాజకీయ పార్టీల మద్దతు ఆధారంగా పొత్తులు ఉండాలని నేను అనుకోను," అని అమిత్​ షా స్పష్టం చేశారు.

Andhra Pradesh elections 2024 polls survey : ఆంధ్రప్రదేశ్​లో ప్రత్యేక హోదా నిరసనల మధ్య.. 2018లో ఎన్​డీఏ నుంచి బయటకు వచ్చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. 2019 ఆంధ్రప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు.6ఏళ్ల తర్వాత.. మళ్లీ ఎన్​డీఏలో చేరింది టీడీపీ. టీడీపీ- బీజేపీ- జనసేన కూటమి అధికారంలోకి వస్తుంది చంద్రబాబు ధీమాగా ఉన్నారు.

TDP BJP Janasena alliance latest news : ఇక 175 సీట్లున్న ఆంధ్రప్రదేశ్​ అసెంబ్లీలో.. టీడీపీ 144 స్థానాల్లో, పవన్​ కల్యాణ్​ జనసేన్​ 21 చోట్ల, బీజేపీ 10 సీట్లల్లో పోటీ చేస్తాయి. 25 లోక్​సభ సీట్లల్లో.. టీడీపీ 17 స్థానాల్లో బరిలో దిగుతుంది. పొత్తులో భాగంగా జనసేనకి 2, బీజేపీకి 6 సీట్లు దక్కాయి.

తదుపరి వ్యాసం