Lok Sabha election schedule : రేపు.. లోక్‌సభ, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల షెడ్యూల్ విడుదల..
Lok Sabha election schedule : రేపు లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల అవుతుంది. ఆంధ్రప్రదేశ్‌తో పాటు మరో మూడు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ కూడా రేపే వెలువడనుంది.
Lok Sabha election schedule : యావత్ భారత దేశం ఎదురుచూస్తున్న ఘట్టానికి సమయం ఆసన్నమైంది. 2024 లోక్‌సభ ఎన్నికలపై ఎన్నికల సంఘం (ఈసీ) నుంచి కీలక అప్డేట్ వచ్చింది. మార్చ్ 16, శనివారం మధ్యాహ్నం 3 గంటలకు.. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడనుంది.
లోక్‌సభతో పాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిశాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌తో పాటు.. ఆయా అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కూడా ప్రకటించనుంది ఎన్నికల సంఘం.
ఈ మేరకు.. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రెస్ మీటింగ్‌ని నిర్వహిస్తుంది ఈసీ.
యావత్ భారత దేశం ఎంతగానో ఎదురుచూస్తున్న సమయం ఆసన్నమైంది! 2024 లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ శనివారం వెలవడనుంది. మార్చ్ 16, మధ్యాహ్నం 3 గంటలకు లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటిస్తామని ఎన్నికల సంఘం (ఈసీ) అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు.. దిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ప్రెస్ మీటింగ్‌ని ఏర్పాటు చేసింది. ఈ ప్రెస్ మీటింగ్‌ని.. ఈసీకి చెందిన వివిధ సోషల్ మీడియా సైట్స్‌లో లైవ్ చూడొచ్చని పేర్కొంది.
రేపే.. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల..
2024 Lok Sabha elections : 2024 లోక్‌సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిశా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆయా రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌ని కూడా.. శనివారం మధ్యాహ్నం విడుదల చేయనుంది ఈసీ.
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కమిటీ.. ఇద్దరు ఎన్నికల కమిషనర్లను నియమించిన ఒక రోజు వ్యవధిలో.. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన వెలుడింది. ఎన్నికల షెడ్యూల్‌ని ఈసీ ప్రకటించిన వెంటనే.. దేశవ్యాప్తంంగా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి వస్తుంది.
2024 లోక్‌సభ ఎన్నికల్లో గెలిచి.. హ్యాట్రిక్ సాధించాలని ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ భావిస్తోంది. మోదీని ఢీకొట్టి, ఆయన్ని గద్దెదించేందుకు.. విపక్ష ఇండియా కూటమి సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో.. ఈ దఫా ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి, అంచనాలు పెరిగిపోయాయి.
లోక్‌సభ సీట్లు:- లోక్‌సభలో మొత్తం 545 సీట్లు ఉంటాయి. వీటిల్లో 543 సీట్లకు ఎన్నికలు జరుగుతాయి. ఏప్రిల్ నుంచి మే మధ్య వరకు పోలింగ్ ప్రక్రియ సాగుతుంది. సాధారణంగా మే చివరి వారంలో ఫలితాలు వెలువడతాయి.
Andhra Pradesh assembly election schedule : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు:- ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 175 సీట్లు ఉన్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే.. మెజారిటీ ఫిగర్ 88ని దాటాలి. జగన్ నేతృత్వంలోని వైసీపీ.. ఇక్కడ ప్రస్తుతం అధికారంలో ఉంది.
ఒడిశా అసెంబ్లీ ఎన్నికలు:- ఒడిశాలో మొత్తం 147 సీట్లు ఉన్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే కనీసం 74 స్థానాల్లో గెలవాలి. బీజేడీ అధినేత నవీన్ పట్నాయక్.. సుదీర్ఘ కాలంగా ఇక్కడ సీఎంగా కొనసాగుతున్నారు.
సిక్కిం అసెంబ్లీ ఎన్నికలు:- ఈశాన్య భారత రాష్ట్రమైన సిక్కింలో మొత్తం 32 సీట్లు ఉన్నాయి. మెజారిటీ ఫిగర్ 17గా ఉంది. ఎస్కేఎం (సిక్కిం క్రాంతికారి మోర్చా)కు చెందిన ప్రేమ్ సింగ్ తమంగ్ ఇక్కడ సీఎంగా ఉన్నారు.
Andhra Pradesh elections 2024 opinion polls : అరుణాచల్ ప్రదేశ్ ఎన్నికలు:- ఇక్కడ మొత్తం 57 సీట్లు ఉన్నాయి. మెజారిటీ మార్క్ 31గా ఉంది. బీజేపీకి చెందిన ప్రేమ ఖండు.. ఇక్కడ సీఎంగా కొనసాగుతున్నారు.
సంబంధిత కథనం
టాపిక్