తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Hyderabad Election Campaign : గ్రేటర్ హైదరాబాద్ లో జోరందుకున్న ప్రచారం, రంగంలోకి అగ్రనేతలు

Hyderabad Election Campaign : గ్రేటర్ హైదరాబాద్ లో జోరందుకున్న ప్రచారం, రంగంలోకి అగ్రనేతలు

HT Telugu Desk HT Telugu

04 May 2024, 15:46 IST

google News
    • Hyderabad Election Campaign : గ్రేటర్ హైదరాబాద్ లో పొలిటికల్ హీట్ మొదలైంది. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అగ్రనేతలు భాగ్యనగరానికి క్యూ కట్టారు. ఎన్నికల పోలింగ్ గడువు దగ్గర పడడంతో ప్రచారం ముమ్మరం చేస్తున్నారు.
గ్రేటర్ హైదరాబాద్ లో జోరందుకున్న ప్రచారం
గ్రేటర్ హైదరాబాద్ లో జోరందుకున్న ప్రచారం

గ్రేటర్ హైదరాబాద్ లో జోరందుకున్న ప్రచారం

Hyderabad Election Campaign : గ్రేటర్ హైదరాబాద్(Hyderabad) నగరంలో ఓవైపు ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతుంటే......మరోవైపు రాజకీయ వేడి సైతం పెరుగుతుంది. గ్రేటర్ లో మరికొన్ని రోజుల పాటు ఇటు సమ్మర్ హీట్, అటు పొలిటికల్ హీట్(TS Politics) ఇలానే కొనసాగనుంది. పార్లమెంట్ ఎన్నికలకు(Parliament Elections) పోలింగ్ ఈనెల 13న జరగనుంది. ఈ నేపథ్యంలోనే అన్నీ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. విమర్శలు, ప్రతి విమర్శలు, సవాళ్లు, ప్రతి సవాళ్లతో నగరం దద్దరిల్లిపోతుంది. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ.....తమ ప్రచారానికి అగ్రనేతలను బరిలోకి దింపుతున్నాయి. ఇప్పటికే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Amit Shah) పాతబస్తీలో హైదరాబాద్(Hyderabad) బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతకు మద్దతుగా ప్రచారం చేయగా......ఇటు రేవంత్ రెడ్డి సైతం హైదరాబాద్ లో ప్రచారం జోరుగా చేస్తున్నారు.

ఇప్పటికే శేరిలింగంపల్లి, కూకట్ పల్లి, ఎల్బీనగర్ , మల్కాజిగిరి ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షోలు నిర్వహించారు. ఇటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం గురువారం నుంచి రోడ్ షోలు ప్రారంభించారు. జూబ్లీహిల్స్, కూకట్ పల్లిలో రోడ్ షోలలో ఇప్పటికే ఆయన పాల్గొన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలు నియోజకవర్గాల్లో ఈనెల 7 వరకు కేటీఆర్ రోడ్ షోలు కొనసాగనున్నాయి.

ఈనెల 10న హైదరాబాద్ కు ప్రధాని

కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఈ లోక్ సభ ఎన్నికలను సవాల్ గా తీసుకున్నాయి. ఎలాగైనా అత్యధిక స్థానాల్లో విజయం సాధించాలనే లక్ష్యంతో మూడు ప్రధాన పార్టీల అగ్రనేతలు, కేంద్ర స్థాయి నేతలను, ఇతర రాష్ట్రాల కీలక నేతలను ప్రచారంలోకి దింపుతున్నాయి. హైదరాబాద్ పార్లమెంట్ స్థానానికి బీజేపీ నుంచి పోటీలో ఉన్న మాధవి లత(Madhavi Latha)కు మద్దతుగా ఇప్పటికే అమిత్ షా(Amit Shah Campaign) ప్రచారం చేయగా.......రేపు మరోసారి హైదరాబాద్ (Hyderabad)కు అమిత్ షా రానున్నారు. మల్కాజిగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కు మద్దతుగా ఆయన ప్రచారం చేయనున్నారు. ఇక ఈనెల 10న ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) రంగంలోకి దిగుతున్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగే భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. అనంతరం రోడ్ షో(Road Show)లో కూడా మోదీ పాల్గొంటారని సమాచారం. ఇక అదే రోజు మహబూబ్ నాగర్ బీజేపీ అభ్యర్థి డీకే అరుణ(DK Aruna) తరఫున మోదీ ప్రచారం చేయనున్నారు.

రంగంలోకి రాహుల్, ప్రియాంక

ఇదిలా ఉంటే ఈనెల 9న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) సరూర్ నాగర్ స్టేడియంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. గ్రేటర్ పరిధిలోకి వచ్చే కాంగ్రెస్ అభ్యర్థులకు(Congress Candidates) మద్దతుగా ఆయన ప్రచారం చేయనున్నారు. అదే రోజు ఉదయం కరీంనగర్ బహిరంగ సభలో పాల్గొన్న తరువాత సరూర్ నగర్ సభకు రాహుల్ హాజరవుతారు. కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ (Priyanka Gandhi)సైతం తెలంగాణలో ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఈనెల 6న చేవెళ్ల లోక్ సభ(Chevella Lok Sabha Elections) పరిధిలోని తాండూరు సభలో ఆమె పాల్గొంటారు. మరుసటి రోజు ఈనెల 7 తేదీన కూకట్ పల్లి, శేరిలింగంపల్లిలో రోడ్ షోలలో ప్రియాంక పాల్గొంటారు.

తమిళి సై సైతం

మొన్నటి వరకు తెలంగాణ గవర్నర్ (Telangana Governor)గా పని చేసిన తమిళి సై(Tamili Sai)......హైదరాబాద్(Hyderabad) లో బీజేపీ తరఫున ప్రచారం చేయనున్నారు. పార్టీ ఆమెను హైదరాబాద్ లోక్ సభ కోఆర్డినేటర్ గా నియమించింది. గ్రేటర్ పరిధిలోని చేవెళ్ల, హైదరాబాద్, సికింద్రబాద్ , మల్కాజిగిరి స్థానాల్లో ఆమె ఎన్నికల ప్రచారం చేయనున్నారు.

కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా

తదుపరి వ్యాసం